కర్తవ్యమునకు స్వాతంత్ర్యమునకు వ్యత్యాసముంటుండాది. ఇది మూడు రకములు. ఒకటి సంబంధము, రెండు నిర్భంధము మూడు కర్తవ్యము. ఈ మూడింటికి వ్యత్యాసము ఏమిటి? ఒక ఆదివారం వచ్చింది. స్నేహితులను పిలిచి టీపార్టీ పెట్టాలనుకున్నావు. ఆనాడు నాలుగు గంటలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు. నీకు తీవ్ర జ్వరం వచ్చింది. అప్పుడు స్నేహితులకు ఫోన్ చేస్తావు. నాకు జ్వరంగా వుంటుండాది.
ఈనాడు టీపార్టీ మానుకుంటాను అన్నావు. ఇది స్వాతంత్ర్యము అనుకుంటున్నాము. ఇష్టమైతే పెట్టుకో వచ్చు లేకపోతే మానుకోవచ్చు. ఇది సంబంధము. ఇక నిర్బంధము. నీవు ఆఫీసులో ఉంటున్నావు. అక్కడ అధికంగా జ్వరం వచ్చింది. అదే నాడు నీ డైరెక్టర్ ని ఆఫీసును విజిట్ చేస్తున్నాడు. నీవు సెలవు తీసుకోవటానికి వీలు కాదు. డాక్టరు దగ్గరకు పోయి యింజక్షను తీసుకొని మాత్రలు వేసుకొని ఆ జ్వరముతోనే ఆఫీసుకు పోయి తీరాలి. ఇది నిర్బంధము. మూడవది కర్తవ్యము. ఏదో కొన్ని కారణాలవల్ల భార్యాభర్తలు పోట్లాడుకున్నారు. కోపము చేత భర్త ఆమెను రెండు కొట్టాడు. ఆమె ఏడ్చుకుంటూ బెడ్ రూంకి పోయి పడుకుంది. వంట చేయలేదు. పురుషుడు డ్రాయింగు రూములో కూర్చున్నాడు. చాల కోపంగా ఉన్నాడు. విషయములో వచ్చిన కోపం ఒకటి, ఆకలితో వచ్చిన కోపం మరొకటి. ఈ రెండూ చేరి తాను చాలా రెస్ట్ ల్ స్ గా వుంటున్నాడు. ఆసమయమున ఒక స్నేహితుడు వచ్చాడు. నవ్వుతూ హలో హలో కమాన్ అన్నాడు. కూర్చోమని చెప్పాడు. స్నేహితునితో నవ్వుతూ వుత్సాహంగా మాట్లాడుతూ కాలము గడిపి లోపలికి పోయాడు. నా ఫ్రెండ్ వచ్చాడు. కాఫీ చెయ్యి అన్నాడు. కోపంగా. భార్యతో కోపంగా వున్నాడు. ఫ్రెండుతో ఆనందముగా వున్నాడు. ఫ్రెండ్లో తో ఆనందంగా వున్నది భార్యకు తెలియకూడదు. భార్యతో కోపంగా వున్నది ఫ్రెండ్ కి తెలియకూడదు. ఇది కర్తవ్యము.
ఈనాడు సంబంధమూ పోయింది, నిర్బంధమూ పోయింది. ఈ కర్తవ్యము అంతకంటె కనిపించటం లేదు. ఇదే ధర్మనాశనము, యిదే ధర్మగ్గాని. (బృత్ర.పు. ౧౪౮/౧౪౯)
విలువలేని యినుప పెట్టె యీదేహంబు
పెట్టెయందు నగలు పెట్టినటుల
దేహమందు "ఆత్మ" దేవుండుండెను సుమా
సత్యమైన మాట సాయి మాట
విలువలేనిదైనప్పటికిని, అస్థిరమైనది. అయినప్పటికిని మానవ దేహము ఆత్మ దేవునకు నివాసమగుట చేత దీనిని సక్రమమైన మార్గములో కాపాడుకోవటం ప్రతి మానవుని కర్తవ్యం. దేహ పోషణ మానవుని ప్రధాన కర్తవ్యము ధృడత్వము లేని దేహమునందు మానవత్వము అనేక చిక్కులపాలు కాగలదు. మానవ జీవితము దేహమనే పునాది పైన ఆధారపడి వుంటున్నది. కనుకనే ఆధునికమైన విజ్ఞానమునకు కారకులైన రోమను దేశము వారు ఈ దేహము యొక్క విశిష్టతను గుర్తించి దేహ పోషణ నిమిత్తమై అనేక విధములైన శ్రద్ధను తీసుకొనెడివారు.
ఈ దేహము తనంత తనైన ఒక ప్రత్యేకమైన ప్రపంచము. దేహమనగా కేవలము ఒక ఆకారము మాత్రమే కాదు. అనేక అంగములతో కూడిన సమిష్టి స్వరూపము. ఏ ఆంగమునకు ఆ ఆంగము లావణ్యమైనది. అన్ని ఆంగముల సౌందర్యమును మనము కాపాడుకోవలసిన కర్తవ్యము. అనారోగ్యమునకు గురియైన, బలహీనలకు - గురియైన దేహము ధృఢమైన సంకల్పమును చేయలేదు. పవిత్రమైన, దివ్యమైన, భవ్యమైన భావములు మానవుని నుండి ఆవిర్భవించవలెనన్న శరీరము దృఢమైనదిగను, ఆరోగ్యమైనదిగను ఉండాలి. అన్ని మతములవారు దేహము యొక్క పోషణను అంగీకరించినవారే. ఇది అనిత్యము అశాశ్వతము అయినప్పటికిని సత్యనిత్యమైన దివ్యత్వము యిందునివాసముగా ఉండటం చేత ఈ దేహము పైన ప్రత్యేకమైన శ్రద్ధను చూపాలి. (బృత్ర.పు. 30)
ఒకవైపున యింద్రియములు మరొక వైపున విషయము లతో కూడిన గుణములు - ఈ రెండిటిని అభివృద్ధి గావించుకోవటమే విద్యావంతుని ప్రధాన కర్తవ్యము. (బృత్రపు. 12)
దివ్యాత్మస్వరూపులారా! కాలము అనంతము. లోకము విశాలము. ఆ కాయము యొక్క ఆయుఃప్రమాణము అత్యల్పము. ఇలాంటి పరిస్థితులయందు కాలమును పవిత్రము చేసే కర్మలకు కాయము అర్పితము చేయటమే ప్రధానమైన కర్తవ్యము. అనాదికాలమునుండి మన పురాణములను అనుసరించి, ఆచరిస్తూ ఉన్న యిలాంటి పవిత్రమైన శివరాత్రిని మన భారతదేశమందు అనేక స్థానములందు పవిత్రమైన కర్మలతో అనుభవించటం మన భారతీయులకు విదితమే. కానీ మన ప్రశాంతి నిలయమందు కాలమును ఏవిధంగానూ అపవిత్రము గావించుటకు వీలులేని పరిస్థితియందు, కంటి ఎదుట భగవత్స్వరూపము, హృదయమునందు భగవద్భావము, నాలుక పై భగవన్నామము నాట్యమాడటం, ఈ పవిత్రమైన మనోవాక్కాయములతో - భగవంతుని సందర్శించుకొనే మహాప్రాప్తి మీకు లభించటం కేవలం మీ పూర్వజన్మ సుకృతమనే చెప్పవచ్చు. జన్మాంతర సుకృతముచే లభించిన ఈ దివ్యవిభూతిని తిని, హృదయమునందు నిరంతరము స్మరించి, వరించి, హృదయమును వికసింపజేసుకొనే ప్రయత్నానికి పూనుకోవటమే యింక మీరు చేయవలసిన సాధన. రాకాసుధాకరుని చూచినంతనే రత్నాకరుడు అంతులేని ఆనందముతో గంతులు వేసినట్లు భగవన్నామము విన్నంతమాత్రముననే మీ హృదయము ఉప్పొంగి ఉఱ్ఱూతలూగి ఉన్మత్తులై తన్మయత్వముతో ఆనందమును అనుభవించాలి. అదే పవిత్రమైన సాధనకు చిహ్నము. ఈ భగవన్నామమునందు అతిమధురమైన రసము చేరటంచేత అది హృదయమునే ఉప్పొంగించి మత్తులుగా చేస్తుంది. “యల్లబ్వా పుమాన్... తృప్తా భవతి... మత్తో - భవతి... - ఆత్మారామో - భవతి..." - ఎవరెవరి హృదయావేదన ననుసరించి ఆ ఆత్మస్వరూపుడు అలాంటి ఆనందాన్ని అందిస్తుంటాడు. ఆ మనము చేయవలసిన కర్తవ్యములో ఆ హృదయపూర్వకమైన ఈ విశ్వాసమునకు స్థానమిచ్చి తలచు తలంపులకు, పలుకు పలుకులకు, చేయు చేతలకు సన్నిహిత సంబంధము వుండేటట్లు పూనుకోవాలి. స్వామి బోధించు వాక్యములందు మీకు విశ్వాసము - అతిగాఢముగా నుండినప్పటికినీ ఆచరణయందు శూన్యముగానుండు పరిస్థితి లేకపోలేదు. విశ్వాసము ఎక్కడో దాని , ఆచరణకూడను . అక్కడ వుండినప్పుడే అది పూర్ణత్వమును ధరించి సత్యానందాన్ని మనకు అందించగలదు. (స.సా.మ. పు 1/2 2021
శాస్త్రoబు నెపుడు సత్యంబుగా నెoచు
వేదసమ్మతoబగు విప్రులారా !
దేశoబు కొరకునై దేహ మర్పణచెసి
రక్షించే రాజాధి రాజులారా!
వ్యవహయ వృద్ధిచే వర్ధిల్లు చుండెడి
సుఖజీవనము చేయు శూద్రు లారా!
ధన ధాన్యములు కలిగి ధర్మ గుణంబుచే
వరలు చుండెడి ఆర్యవైశ్యు లారా!
(శ్రీ సత్య సాయి దివ్య బోధ పు 47 -48 -25 -7 -78 )