"చీమకూడా అడుగు ముందర అడుగు వేస్తూ పోతే గురిని చేరుతుంది. గరుత్మంతుడు కూడా తన రెక్కలను ముడుచుకొని కూర్చుంటే గురిని చేరడు. కాబట్టి అడుగు వేయండి. ఈనాడే ఇపుడే, నిజమయిన ఆవేదనతో వివేక విచక్షణలతో సాధన మొదలు పెట్టండి! భగవంతుని అనుగ్రహము మీపైన అపుడే వెలుగును, త్రోవ చూపించును. ప్రయాణము సులభమగును. భగవంతుడు అవతరించినదే దీని కోసం కదా?"
(జ్ఞా, వా. పుట 78)