వ్యాసులవారి దగ్గర అనేకమంది శిష్యులు వేదధ్యయనము నిమిత్తమై చేరేవారు. అందులో మొదటివాడు వైశంపాయనుడు. ఇతను భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో గురువాజ్ఞను పాటించి తన జీవితమును సార్థకము గావించుకొన్న వ్యక్తి. “సద్గుణంబులు, సద్భుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమ శిక్షణ, కర్తవ్యపాలనము" మున్నగునవి వేర్పునదే ఎద్య. అట్టి విద్యను విద్యార్థి నేర్వవలయును. ఈ విధముగా గురువుదగ్గర వైశంపాయనుడు విద్యను నేర్చుకొని, తిరిగి తాను వేదమును బోధించే నిమిత్తమై ఒక గురుకులమును స్థాపించినాడు. గురుకులమనగా అభ్యాసముల చేత, ప్రత్యేకమైన నిబంధనల చేత ఏర్పడినదని భావిస్తారు. అది కాదు గురుకులము. గురుకులము అనగా గురువుగారి ఇల్లే శిష్యులకు నిలయం. గురువు భుజించునదే శిష్యులకు ప్రసాదంగా ఇచ్చేవారు. రాత్రింబవళ్ళు గురువులోనే జీవితము గడిపేవారు.
(స.పా.జూన్ 91 పు.164)