మానవుడు ధనమును కోల్పోతే దానిని ఎన్నో మార్గాల ద్వారా తిరిగి సంపాదించుకోవచ్చు. స్నేహితుని కోల్పోతేఎంతమంది స్నేహితులతో సంపాదించుకోవచ్చు. భార్యను కోల్పోతే రెండవ వివాహమాడవచ్చు. భూమిని కోల్పోతే దానిని కూడా తిరిగి సంపాదించుకోవచ్చు. కాని, శరీరమునే కోల్పోతే అది లభ్యం కాదు.
(స.సా.జూలై 2000 పు.206)
మన శరీరంలో 500 కండరాలున్నాయి. 365 సైన్యూస్, 248 ఎముకలు, 7 మైళ్లు పొడవు గల, 72 కోట్ల నరాలున్నాయి. (కండరాలను ఎముకలకు అంటిపెట్టుకొని ఉండినట్టు చేసే వాటిని సైన్యూస్ అంటారు). మన దేహంలో కొన్ని కోట్ల సెల్సు ఉన్నాయి. ప్రతి సెల్ యందు మనరూపం సంపూర్ణంగా ఉంటుంది. మన నాలెకలో 40వేల టేస్టుబడ్సు ఉన్నాయి. అది కాక ఉష్ణం జనింపచేసే బడ్సు 25 వేలున్నాయి. కన్ను చూచుటకు కేవలం ఒక అంగుళం ప్రమాణంలో వుంటున్నది. దీని యందు 13 కోట్ల కాంతి కిరణాలు ఉంటున్నాయి. ఇది ఎంత విచిత్రం చూడండి! దీనిని ఎవరైనా నమ్మగలరా? ఇది అంతా ఎవరి సృష్టి? ఏ సైంటిష్టు నిర్మాణం ఇది? ఇది అంతాదైవసృష్టియే. ఎంచి చూసినట్లయితే ప్రతి అంగుళం భగవంతుని తత్వమే. ప్రతి అణువణువు భగవంతుని తత్వమే.
(త.శ.మ.పు. 9/10)
"మీ శరీరమునే పత్రముగా భావింపుడు. ఆభావనయే మీరు నాకర్శితము జేసే నివేదన. మీ హృదయములను ప్రేమతో పుష్పింపజేయుడు. ఇదే వేము కోరునటువంటి పుష్పము. మీ కర్మ ఫలములన్నియూ నా సంకల్పములే యని భావించి యర్పించుడు. నాకు ప్రీతికరమైన ఫలమే అది. భక్తిపారవశ్యమున రాలు మీ ఆనందభాష్పములే నేను కోరు తీర్థము. “బీదవారికి వృధా ప్రయాస ఎందులకు? ఈ నా దేహము పరోపకారమునకే యుద్భవించినది. ఒకరికి యిచ్చుటకే గాని తీసుకొనుటకు గాదు".
(స్వా.పు.113)
కరోతి దుఃఖే నహికర్మ తంత్రం శరీరమాద్యం భోగః అహర్నిశం సః
శరీర భిన్నః పురుషః సమిచ్చతే తావత్ర భోగః పురుషేణ ముచ్యతే.
మానవుడు రాత్రింబవలు శరీర సుఖముల నిమిత్తమైఅనేక శ్రమలు పడుతున్నాడు. ఆత్మ శరీరము కంటే భిన్నమనే సత్యాన్ని గుర్తించిన వ్యక్తి ఈ బాధలకు గురికాడు. నిజముగా ప్రపంచములోని ప్రతిమానవుడూ తనయొక్క మానవత్వమును, మానవలకు అర్థమును చక్కగా గుర్తించిన ఈ విధమైన శ్రమలే జగత్తులో ఉండేటటు వంటివి కాదు. మానవ జీవితమునందే పుట్టి, మానవ జీవితమునందే పెరిగి, మానవ సమాజమునందే జీవితము ఆనుభవిస్తూ మానవుడు అనే పదమునకు అర్థము తెలుసుకొనకుండిన ఆట్టి మానవుడు పశుపక్షి మృగాదుల కంటే హీనమని ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
(శ్రీ స.ది.1983పు.1)
పంచీకృత మహాభూతం సంభవం కర్మసంచితం
శరీరం సుఖదు:ఖానాం భోగాయతనముచ్యతే.
ప్రేమస్వరూపులారా! | మహాభూతముల సంచికృతమువలననే కర్మ జరగడం చేత స్థూలశరీరము ఏర్పడుతుంది. సుఖదు:ఖములకు ఈ శరీరమే మూలకారణము.
యేది యెరిగిన సర్వంబు ఎరుకపడునో
యేది తెలియక సర్వంబు తెలియబడదో
అట్టి పరతత్వమెరిగినవాడ నరుడు.
(స.ది.పు.33)
“శరీరమాద్యంఖలు ధర్మసాధనం”. ధర్మమును ఆచరించే పనిముట్టు శరీరం. స్వయంగా అది కర్మలలో ప్రవేశించదు. మనస్సు ప్రోత్సాహంతో శరీరం పని చేస్తుంది. అన్నిటికి మనస్సే ఆధారం. అయితే మనం, మనము చేసే పనులకు దేహాన్ని శిక్షిస్తున్నాం. ఒకనిని చంపిన వానికి ఉరిశిక్ష వేస్తారు. అయితే అక్కడ శిక్షను అనుభవించేది శరీరం. దోషం చేసినది మనసు మనస్సు ప్రోత్సాహం లేకుండా దేహం ఏకర్మ ఆచరించడానికి వీలుకాదు కదా! అయితే మనస్సును శిక్షించే అధికారి ఈ జగత్తులో లేడు. ధర్మ శాస్త్రము కూడా శరీరాన్నే శిక్షిస్తుంది. ఇది ప్రాకృతధర్మం. పరమాత్మ ధర్మం ఇదికాదు. తప్పు చేసేది మనస్సు, ఉపాధిగా ఉపయోగపడేది దేహం. దేహం తన కర్తవ్యాన్ని అనుసరించేదే. దోషంమంతా మనసుదే కనుక మనసును శిక్షిస్తాడు భగవంతుడు, అది పరమాత్మ ధర్మం”. (సాలీత పు182)