నాలికతో నామం ఉచ్చరించినపుడు, మనసుతో రూపాన్ని ఆరాధించి నపుడు అది యాంత్రికంగా జరిగే స్థితికి దిగజారకూడదు; నామంలో అర్థం, రూపంలో సౌందర్యం ఏక కాలంలో ఉత్తేజాన్ని కలిగించి, అంతరంగాన్ని వెలుగొందింప జేయాలి. వాడుక నుంచి తప్పుకో, చిత్త శుద్దితో ఘాడంగా పూజ్య భావానికి అంకితంగా. అదే శాంతిని తృప్తిని అందుకొనే మార్గము. మానవాళి అంకితమై ఆ దిశలో పయనించవలసిన మార్గము. - శ్రీ సత్య సాయి బాబా. (నా బాబా నేను పు193))