యోగము

ప్రజ్ఞాతత్త్వమును గుర్తించవలెనన్న ఒక యోగము ఉంటున్నది. ఏమిటీ యోగము? క్రియా యోగమా? హఠయోగమా? భక్తి యోగమా? కర్మయోగమా? జ్ఞానయోగమా? లేక పతంజలి యోగమా? కాదు, కాదు. యోగమనగా కేవలము శరీరముతోగాని, మనస్సుతోగాని ఆచరించే కసరత్తు కాదు. యోగమనగా - ఆనందము. ఇదే సరియైన అర్థము ఆనందమనేది మనకు ఎప్పుడు లభిస్తుంది? "నేను" అనే ప్రజ్ఞాతత్త్వాన్ని విశ్వసించినప్పుడే లభిస్తుంది. మనము ప్రజ్ఞాశక్తితో జీవించినప్పుడే ఆనందము కలుగుతుంది. జీవతత్త్వాన్ని బ్రహ్మతత్త్వాములో ఏకం చేయడమే యోగముకాని, మరొకటి కాదు. జీవ బ్రహ్మ తత్త్యములు రెండూ ఏకమే కాని, అనేకము కాదని ప్రబోధించునదే - యోగము. దీనినే శ్రుతులు - "ఏకం సత్ విప్రా బహందా వదంతి"అని తెలిపాయి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ దానికి విప్రులు అనేక పేర్లు పెడుతూ వచ్చారు. ఇది త్రికాలములందూ మార్పు చెందని సత్యము.

(స.సా.జ..3.2.93 పు.18)

 

యోగము రెండు విధములు. ఒకటి రాజయోగము, రెండవది జ్ఞానయోగము. రాజయోగమున అష్టాంగ యోగము అభ్యసింపబడును. ఇదియే ఆర్యము. యోగము నందు ఆంగములు బాహిరములు, అంతరములు అని రెండు విధములు, జ్ఞానయోగాంగములయందు, బాహిరములే లేవు. ఈ రెంటికి గమ్యము వృత్తి విలయ మొక్కటియే.

(ప్ర.వా.పు.77)

 

దేహమును పుష్టివంతముగను, మనస్సును ఆరోగ్యవంతముగను ఉంచేటందులకు అనుకూలమైనయోగమును కొంత వరకు నేర్పించాలి. కొంత మంది యోగమును కసరత్తుగా మాత్రమే ప్రాక్టీసు చేసి విదేశాలకు వెళ్ళి యోగా సెంటరు అని పెద్ద బోర్డు పెట్టుకొని ఈ కసరత్తు లన్నీ చేస్తుంటారు. ఇది యోగమని చెప్పుటకు వీలుకాదు. ఇది పెద్ద రోగము. మత్స్యాసనము కూర్మాసనము, సూర్యాసనము అని ఏవేవో ఆసనములు నేర్చుకొని వాటిని యోగమనే పేరుతో వ్యవహరిస్తున్నారు. పతంజలి చెప్పిన యోగమునకును, ఈ యోగమునకును ఎక్కడా పోలిక లేదు. చిత్త వృత్తులను అరికట్టడంగాని, ఆత్మసాక్షార్కరమునకు లేక ఆత్మానుభవమునకు గాని ఏమాత్రము పనికి రాదు. చిత్త శుద్ధికి మాత్రమే పనికి వస్తుంది. షడ్ దర్శ నాలు కాదు సత్ దర్శనం కావాలి..

(సా.పు.24)

 

పక్షికి లోక వేరే ఉంటుండాది. ఈ తోక ఎందుకోసం? రెక్కలను సమన్వయపరిచే కోసము Balance సరిగా పెట్టె నిమిత్తము ఈలోక అత్యవసరము. ఋత, సత్యములను జగత్తులో క్రియారూపములో ప్రసరింప చేయటానికి యోగము అనే తోక అవసరము. మనము వాయు విమానము చూస్తుంటాము. దీనికి రెండు రెక్కలుంటాయి. రెండు రెక్కలతో ఈ విమానము పరుగెత్తదు. ఈ రెండు రెక్కలకు సమన్వయపరచే తొకకూడా ఉండాలి. ఈ మూడింటి ద్వారానే మధ్య నున్నదేహము బాలెన్స్ వుంటాది. విమానం లోపల కూర్చునపుడు మీరు చూశారో లేదో? ఎక్కే సమయములో ఒక రెక్క క్రిందికి వస్తుంది. ఒక రెక్క పైకి పోతుంది. దిగే సమయములో మరోకరెక్క క్రిందకు వస్తుంది వేరొక రెక్క పైకి పోతుంది. ఇహసంబంధమైన జగత్తులో సత్యము ముందుగా వస్తుంది. ఋతం వెనుకవస్తుంది. ఆధ్యాత్మికమార్గములో ఋతం ముందు వస్తుంది. సత్యం దాని వెంట బడుతుంది. ఇదంతా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి వుంటాది. అన్ని రకములైన బాలెన్సులు సరిగానున్నపుడే ఈ బుద్ధి బుద్ధిగా రూపొందుతుంది. ఋతము, సత్యము, యోగము లేకుండా పోతే ఇది బుద్ధియే కాదు యోగమంటే ఏమిటి? హఠయోగమా? రాజయోగమా? ఏయోగముకాదిది. ఆసనాలు వేయటమే యోగముకాదు. ఆదొక Physical trainingఒక విధమైన కసరత్తు. “యోగః చిత్త వృత్తి నిరోధక: ఇంద్రియములను అరికట్టేదే నిజమైన యోగము. ఈ యోగమే తోక, యోగముతో కూడినపుడే బుద్ధి సరియైన మార్గములో నడుస్తుంది.

(బ్బ.త్ర.పు. 99/100)

 

భావమందు దుష్ట వాంఛలు వీడుటే త్యాగమగును అదియె యోగమగును, ఆస్తి ఆలివీడి అడవికేగుట కాదు.

(బృత్ర.పు.123)

 

కర్తృత్వబోక్తృత్వములను మనము దూరముగావించి కర్తవ్యమును ఆచరించాలి. "కర్తవ్యం యోగచ్చతే" ఇదే యోగము. ఈయోగమును నీవు సాధించావంటె దివ్యమై ఆత్వభోగమును అనుభవించవచ్చు. ఈ యోగము లేక పోవటంచేతనే రోగులుగా మారుతున్నారు.

(బృత్ర.పు.170)

పొద్దుపోక ఊరివారి సుద్దులంటే
మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ
ముద్దుముద్దుగా భగవత్ కథలు చెప్పువేళ
ఒద్దికగ నుండరే చెవులారా !
శివ శివ శివ శివ యనరాదా
మీ చింత లెల్లబాపుకొని మసరాదా
శివమెత్తి జగమంత తిరిగేవు
ఓ చిత్తమా నీకెంత సిగ్గులేదే
అవనిసుఖంబు అల్లారే నీకు
ఆవలికి కలిగేది అది –
యేమి పనిమాని సినిమాలు పలుమారు
మీరు చని గనినసు తనివి లేదే
క్షణమున దైవ సన్నిధిన నిలువ
కసులారా కడు కష్టమౌగ


ఈవిధముగా మనము అంగములను ఎంత అపవిత్రము చేసుకొంటున్నామో ఎవరికి వారు కన్నులు మూసుకొని విచారణ చేస్తే వారికే అర్థమవుతుంది. రెండు పాదములు భగవత్ సన్నిధిలో వుండాలంటే ఏమాత్రమూ నిలువవు. బస్టాండ్ లోపల గంటలు గంటలు క్యూలో నిల్చుంటారు. సినిమా హాలు దగ్గరకూడా అంతే. కాని భగవంతుని దేవాలయానికి వెళ్తే తక్షణమే లోపలకి విడచాలి. తక్షణమే దేవుడ్ని చూడాలి. తక్షణమే వెళ్ళిపోవాలి. నిత్యసత్యమైన విషయములో తొందరపాటు వస్తున్నది. అనిత్యము, అసత్యము అయిన వాటిలో మనము ఓపిక పట్టుకుంటున్నాము. దానినిక్కడకు దీనినక్కడకు మార్చాలి. అదియే యోగము. దీనికి నిత్యానిత్య పరిశీలన కావాలి ? ఏది మంచి ? ఏది చెడ్డ? (శ్రీ సత్యసాయి దివ్యబోధ 1993 పు149)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage