ఆత్మ అంటే ఏమిటి? దీనినే ఎరుక అని చెప్పారు. ఇది ప్రతి మానవుని యందలి అహం . ఈ అహం అనేది దేహములో చేరినప్పుడు అంకురముగా మారుతుంది. ఇది దేహాత్మ భావము పొందినప్పుడు అహంకారముగా రూపొందుతుంది. ఈ అహం కేవలం దేహాత్మలో చేరినది కాదు. దేహాత్మతాదాత్మ్యము పొందినప్పుడే అహంకారమనేది రూపొందుతుంది. అనగా ఆకారమే నేను అని భావించటమే అహంకారము. అహమునకు ఆకారము లేదు. అదియే శుద్ధ సత్వములో కూడినది.
మొట్టమొదట ఈ ఆత్మ తత్త్వమును అనేక విధములుగా మరపింపచేసి అడ్డు తగిలేదే మనస్సు. సూర్యుని ప్రకాశముచే రూపొందిన మేఘసముదాయము సూర్యునే కప్పివేస్తున్నాయి. మేఘ సముదాయము సూర్యుని ఏ విధముగా కప్పి వేస్తున్నాయో, అదే విధముగా ఆత్మయందు పుట్టిన ఈ మనస్సు కూడా ఈ ఆత్మనే కప్పివేస్తున్నది. కనుక మనస్ తత్త్వమునకు అడ్డు తగిలేది. కనుక మనస్సును మరపింపచేసే మార్గమును మనము వెతకాలి. మానవత్వములో నేను అనే పదము మొట్టమొదట ఆవిర్భవించినది. ఈ నేను అనేదే అహం స్వరూపము"అహం,పరమాత్మ,దేవుడు,ఉనికి,ఎరుక,యోగముఇత్యాది పదములన్నీ ఆత్మకు పర్యాయ పదములే. నేను అనే పదము ఆత్మకు పర్యాయ పదములే. నేను అనే పదమును సరిగా అర్థము చేసుకున్నప్పుడే ఆత్మజ్ఞానము కలుగును. నిజమైన ‘నేను అనే తత్త్వమును ఏ మానవుడు గ్రహించునో అదే నిజమైన ఆత్మతత్వమవుతుంది.ఆత్మతత్వమునుతిష్టగావేసుకొని దైవత్వముతో కూడిన అహం తత్త్వాన్ని విచారణ చేసినప్పుడే ఆత్మనిష్ఠ అవుతుంది. ఈ నేను అనే పదము మూలములో ఏకమైనప్పుడే ఆత్మసాక్షాత్కారమౌతుంది. నేను అనే భావమును కేవలం దేహముతో మాత్రమే కాదు. మూలాధారతత్త్వములో లీనము చేయాలి. ఆదియే ఆత్మసాక్షాత్కారము.
(ద.య.స. పు.82/83)
(చూ || ఆత్మ)