మనదేశము

ఇది నాదు మాతృదేశము

ఇది నా ప్రియమాతృభాష ఇది నా మతం

చెదగొట్టి నుడవనేరక

బ్రతికిన నరపీనుగొకడు వసుధను కలడా.

స్వదేశాభిమానమే లేకపోతే పరదేశవిచారణ ఎందుకు చెయ్యాలి? కన్న తల్లినే మరచిన వ్యక్తి పినతల్లిని మరువకుండా వుంటాడా? ధనం నిమిత్తమైయీ విధముగా beggarsగా తయారు కాకూడదు. నీవు beg చేయాలనుకుంటే నీ దేశములో చేయి. విదేశాలు పోయి భిక్షాపాత్ర నెత్తుకొని ధనమును సంపాయించుకొనిబ్రతికేదానికంటే చావు మేలు. స్వదేశ సేవలో స్వదేశ విశ్వాసమును అభివృద్ధి పరచుకోవాలి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అన్నారు. జన్మభూమి పైననే విశ్వాసము లేకపోతే ఎందుకోసం జన్మనెత్తాలి? మన దేశము నందేవుండి మన దేశ సేవ చేసి దేశ ప్రజలను తీర్చిదిద్దటానికి కంకణము కట్టుకోవాలి.  నీతల్లితండ్రుల సేవ చేయి. నీ కన్న భూమి సేవచేయి, నీదేశ ప్రజలను ఆదుకో, స్వార్థము స్వప్రయోజనం నిమిత్తమైనీ శక్తి సామర్థ్యము లుపయోగ పెట్టుకోవద్దు. ఇట్టి భావములను అభివృద్ధిపరచుకున్నప్పుడే చిత్తము స్థిరత్వానికి వస్తుంది. లేకపోతే ఎప్పుడూ గడియారము పెండ్యులం మాదిరి ఆటుయిటు ఆడుతూ వుంటుంది. స్థిరత్వము కావాలనుకుంటే మొదటనే master plan వేసుకోవాలి. నా భవిష్యత్తు ఏమి? ఏమి చెయ్యాలి? ఎలాంటి మార్గములో నడుచుకోవాలి? అనే విషయాన్ని విచారణ చెయ్యాలి. విద్యార్థులారా? ఒక్కటి మాత్రం మీరు మరవకూడదు. "మీ food మీ blood మీ head అంతా మీ parents యొక్క gift” మీరు మొట్టమొదట Parentsకు  gratitude చూపించాలి. వారిని ప్రసన్నలు చేయలేని మీ చదువులు ఎందుకోసం?వృద్ధులైన తల్లి తండ్రులను విసర్జించి పరదేశములకు పోయి నీవు ఫాషన్ గా తిరుగుతుంటుంటే నీపాపము పెరగక ఏట్ల తగ్గుతుంది? తల్లితండ్రుల దగ్గర వుండి వారిని చూచుకోవాలి. అది నీకర్తవ్యము. విధమైన పవిత్రభావాలను అభివృద్ధి పరచుకున్నప్పుడే మీ చిత్తము స్థిరము ఔతుంది. దీనికి ప్రత్యేకమైన కసరత్తులు చేయనక్కరలేదు. పవిత్ర భావములచేత పవిత్ర సాధనలచేత పవిత్రచింతనలచేత మనస్సును స్థిరము చేసుకోవచ్చు.

(బృత్ర.పు.84)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage