మానవుడు ఆశించవలసింది దీర్ఘ జీవితము కోసము కాదు. దివ్య జీవితము కోసము ఆశించాలి. దివ్యమైన ఈ ప్రకృతియందు మానవుడు దివ్యత్వమును పొందటమే ప్రధాన కర్తత్వము. సృష్టి రహస్యము సృష్టికర్తకు తప్ప అన్యులకు అర్థము కాదు. సృష్టి రహస్యమును - గుర్తించటానికి ప్రయత్నించేవారే సైంటిస్టులు. ఈ సృష్టి రహస్యమును పరిపూర్ణముగా ఎవ్వరూ గుర్తించలేదు. ఈ విజ్ఞానమునందు ఈనాటి పరిశోధన రేపటికి పాతదైపోతుంది. రేపటి పరిశోధన ఎల్లుండికి పాతదైపోతుంది. వైజ్ఞానికుడు పాతదంతా రోతదిగా భావిస్తుంటాడు. ఇది నిత్యమైనది సత్యమైనది కాదు.
నిత్య సత్య నిర్మలమైన తత్వము సృష్టికర్తనే. సృష్టికర్తను పరిశీలన చేసి పరిశోధన చేసి సృష్టికర్తను పొందేదే ఆధ్యాత్మిక మార్గము.
(బృత్ర.పు. ౧౧౧/౧౧౨)
(చూ॥ తల్లి యొక్క ఆశీర్వాదములు)