సమాజమనగా కంటికి కనిపించే నేల కాదు, సజీవమైన మానవ సమూహమే సమాజము. సమాజంలో ఐకమత్యం అత్యవసరం. ఐకమత్యంచేత మానవుడు సాధించలేని కార్యము ఈ జగత్తునందు కానరాదు. పిల్లలందరికీ చక్కగా తెలుసు - aను a తోను, bను bతోను హెచ్చించి, రెండింటినీ కలిపితే ఆది a2+b2అవుతుంది.కాని(a+b)ని (a+b) తో హెచ్చిస్తే అది a2+b2+2ab అవుతున్నది. ఇక్కడ 2ab అనే పదం అధికంగా రావడానికి కారణమేమిటి? a, b లకూడికయే అనగా ఐకమత్యంవల్ల బలం అధికమైపోతుంది. ఎంతటి ఘనకార్యమునైనా ఐకమత్యంచేత సులభంగా సాధించవచ్చు. ఇట్టి ఐకమత్యమును సాధించే నిమితమై విద్య తోడ్పడాలి. కానీ ఈనాటి విద్యార్థులు ఐకమత్యాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. కేవలం ఉద్యోగమును, ధనార్జననులక్ష్యంగా పట్టుకొని విద్యనభ్యసిస్తున్నారు. విద్య విజ్ఞానం కోసం, కృషి కూటి కోసమనే సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి.
(స.సా.ఆ1998పు.265)
మనజీవితమంతా సమాజములో కట్టబడి వుంటున్నాది. సమాజము క్షేమంగా వుంటున్నప్పుడే మన క్షేమం. ఈ సత్యాన్ని విద్యావంతులు గుర్తించటానికి ప్రయత్నించటం లేదు. మానవుడు వ్యక్తి, కుటుంబము, సమాజము మూడింటి ద్వారా ప్రయాణము చేయాలి. ఫ్రమ్ ఐటు వి(We) నిరంతరము, cఐ.ఐ ఏమిటి ఈ ఐ? రెండు రకములైన ఐలు వుంటున్నాయి. వన్ లెటర్, ఐ ఈజ్ వన్ 1. త్రీ లెటర్ eye ఈజ్ ఐ . త్రీ లెటర్ ఆనదర్ ఈజ్ బాడీ, వన్ త్రీ లెటర్ ఐ ఈజ్ సెల్ఫ్. అదే సోల్. నీవు బాడీ కాదు. బాడీ నికొక ఇన్ స్ట్రుమెంట్: మనస్సు నీకొక ఇన్ స్ట్రుమెంట్ (ఉపకరణం) సెన్సెస్ (ఇందియములు ఇన్ స్ట్రుమెంట్ ఉపకరణము). వీటిని సహాయము చేసుకొని యీ ఏకాక్షరమైన ఐని ఆధారము చేసుకోవాలి. తెల్లవారిమొదలు రాత్రి పరుండనంత వరకు ఐ.ఐ.దిస్ ఈజ్ మై హౌస్, దిస్ ఈజ్ మై కార్, మై పాంట్ మై షర్ట్ అంటారు. హూఆ ర్యు? హు యామ్ ఐ? ఈ ప్రశ్న వేసుకునే విద్యార్థులు ఎక్కడా కనుపించటం లేదు. మై బాడీ మీన్స్ బాడీ ఈజ్సెపరేట్ ఫ్రమ్ మి. ఈ సత్యాన్ని మనము గుర్తించినప్పుడే నిజమైన ఆధ్యాత్మికము అభివృద్ధి గాంచుతుంది.
(ఉ.బ.పు.6/7)
విద్యార్థులు మున్ముందు దీనిని (సమాజసేవ) లక్ష్యము నందుంచుకొని తమ శక్తిని తమ యొక్క పవిత్రతను తాము అనుభవించుటే కాకుండా సమాజమునకు కూడను వినియోగించాలి. ఎందుకనగా నీవు కూడను సమాజములో ఒక వ్యక్తివి. నీవు సమాజమునకు దూరముగా లేవు.నీ క్షేమము సమాజ క్షేమము పైనే ఆధారపడి వుంటుంది. అప్పుడే నీ క్షేమము అభివృద్ధి అవుతుంది. ఇదే మానవుని కర్తవ్యము.
(బృత్ర.పు.119)
(చూ॥ భావాలు, విద్యావంతుడు)