మనస్సనే యజమానికి ఇంద్రియములనే భార్యలు అధికంగా ఉండటంచేత భార్యలకు మనసు వశమై పోయింది. ఈ ఇంద్రియములకు మనస్సు స్వాధీనమై పోయి బుద్ధికి ఏ మాత్రమూ వశము కావటం లేదు. దేహముకంటె అతి సూక్ష్మములు ఇంద్రియములు. ఇంద్రియములకంటె అతి సూక్ష్మమైనది ఆత్మ. సర్వము ఆత్మ వశము కావలసిందే, తప్పదు. ఇంద్రియములు బలవత్తరమైనవి.
ఈ ఇంద్రియములను అరికట్టినపుడే ఈ జీవితము ఆదర్శవంతమైనదిగా రూపొందుతుంది.
(బృత్ర, పు. 60)
జీవితము ఒక (Musical chair) అనే ఆటవంటిది. ఈ ఆటలో ఎంతో మంది పాల్గొంటారు. భగవంతుడు band (Music) వాయిస్తాడు. ఎప్పుడు (band Music) వాయిస్తూ, వాయిస్తూ ఆపివేస్తాడోనని జాగ్రత్తగా గమనించి, ఆగిపోయిన వెంటనే కుర్చీలో కూర్చోవాలి. ఏమరుపాటున వుంటే సీటు అ నే అనుగ్రహము లభంచదు.
(ప్ర.ప. పు.28)
(చూ॥ దూపాటి తిరుమలాచార్యులు, నియబద్ధజీవితం, పరుగు, బ్రహ్మవిత్ బ్రహ్మైవభవతి, యాంతేయతిస్సాగతిః, విద్య)