ఆత్మవిశ్వాసము మనము బలపరచుకోవాలి. ఈ ఆత్మ విశ్వాసము ఉండినప్పుడే మనకు ఆనందము లభ్యమవు తుంది. ఏ మాత్రము విచారము చేయకూడదు. వచ్చిన కష్టములు, నష్టములు, దుఃఖములు ధైర్యముతో ఎదుర్కోవటానికి తగిన బలమును సంపాదించుకోవాలి. అందుకనే మన Education system లోపల (4) నాలుగు Fలు బోధించాను.
మొదటిది Follow the master
రెండవది Face the devil
మూడవది Fight to the end
నాల్గవది Finish the game
ఇది నీ నిజమైన తత్వము. ఈ విషయములో నీవు నిరంతరము చదువును సాధిస్తూ రావాలి. ఏమిటి యీ చదువులు. ఆంగ్లములో ఎబిసి అని వుండాది. ఈ ABC అంతరార్థము ఏమిటి? Always be careful. ఇదే వేదాంతమునందు "ఉతిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్నిబోధత, జాగ్రత జాగ్రత". ఇలాంటి చదువుల సంస్కృతికి సంబంధించిన చదువులు చదవాలి. విద్యార్థులారా! ఎంతకాలము బ్రతికినప్పటికిని ఎన్ని విజ్ఞానములు తెలుసుకున్నప్పటికిని, ఎన్ని పదవులు ఏలినప్పటికిని ఏనాటికైనా మన తత్వాన్ని మనము గుర్తించక తప్పదు. ఎప్పటికో తెలుసుకోవలసిన ఈ సత్యాన్ని ఇప్పుడే తెలుసుకో. ఎప్పటికప్పుడే గుర్తించుకో. ఎప్పటికప్పుడే జాగ్రత్తగా ఉండు - భగవదనుగ్రహముగాని భగవంతుని ఆగ్రహముకాని భగవంతుని ప్రేమగాని భగవంతుని ఆశీర్వాదముగాని ఎప్పుడూ ఎక్కడ ఏ విధంగా లభిస్తుందో: భౌతికమైన లౌకికమైన ప్రపంచమందు కొన్ని కొన్ని మనకు తెలుస్తుంటాయి. అర్థమవుతుంటాయి. కాని ఆధ్యాత్మికములో మనకు ఏమి తెలియదు. అర్థము కాదు. మన కర్తవ్యమును మనము ఆచరిస్తూ పోతుంటే ఎప్పటికప్పుడు అదే మనకు ఆనందము చేకూరుస్తుంది.
(బృత్ర.పు. 3)
పునాది లేనిదే భవనం నిలవదు. పునాది భద్రంగా వుండాలి. జీవిత భవనానికి ఆత్మ విశ్వాసమే పునాది. చాలామందికి ఇది వుండటం లేదు. అందువల్ల ప్రయత్నమే చెయ్యరు. ఇంక విజయాన్ని ఎలా సాధిస్తారు? కనుక ఆత్మవిశ్వాసం చాల ప్రధానం. ఈ పునాది పైన గోడలు నిర్మించు. ఏమిటా గోడలు? అదే ఆత్మతృప్తి (సెల్ఫ్ సేటిస్ ఫేక్షన్). ఆత్మవిశ్వాసం ఉన్నవాడికే ఆత్మతృప్తి కలుగుతుంది. విశ్వాసం లేనివాడికి ఈ జన్మలో తృప్తిరాదు. కనుక ఆత్మతృప్తి అనే గోడలు ఆత్మవిశ్వాసమనే పునాది పైననే నిలుస్తాయి. ఇంక రూఫ్ (పైకప్పు) వెయ్యి. ప్రతి ఇంటికి రూఫ్ ఉండాలి కదా! ఏమిటా రూఫ్? అదే స్వార్థత్యాగం( సెల్స్ సేక్రిఫైజే) ఆత్మతృప్తి గలవాడే స్వార్థత్యాగం చేయగలడు. మీలో త్యాగం లేకపోవడానికి కారణం తృప్తి లేకపోవడమే! ఆత్మ విశ్వాసమనే పునాదిపై ఆత్మతృప్తి అనే గోడలపై సార్థత్యాగం అనే పైకప్పు వేశాక బిల్డింగ్ తయారైంది. ఇంకేం చేస్తావు? ఆ బిల్డింగ్ లో నివసిస్తావు. అదే లైఫ్. సెల్ఫ్ రియలైజేషనే లైఫ్. సెల్ఫ్ రియలైజేషన్. (ఆత్మాను భూతి) లేనిదే అది లైఫ్ కాదు. ఈ ఆత్మానుభూతి అనేది ఆత్మవిశ్వాసం, ఆత్మతృప్తి, స్వార్థత్యాగములపై ఆధారపడియున్నది. వీటిని అందరూ అలవర్చుకోవాలి. రాష్ట్రపతి వెంట ఇద్దరు ADC లు (అంగరక్షకులు) ఉంటారు. అలాగే డ్యూటీ అనే రాష్ట్ర పతికి డిసిప్లిన్ (క్రమశిక్షణ), డివోషన్ (భక్తి) రెండూ అవసరం. డిసిప్లిన్ లేనిదే జీవితంలో ఏదీ సాధించలేవు. మన టెంపరేచర్ గాని, బ్లడ్ ప్రెషర్ గాని, వాటిహద్దులను దాటాయంటే రోగం ప్రారంభమవుతుంది. కనుక మన దేహమంతా డిసిప్లిన్ లోనే ఉన్నది. డ్యూటీకి డిసిప్లిన్ చాల ముఖ్యం. రెండవది డివోషన్. డివోషన్ తో డ్యూటీని బాగా నిర్వర్తించగలవు. డివోషన్ అంటే ప్రేమ. ప్రేమతో చేసే డ్యూటీ తప్పక విజయాన్నందిస్తుంది. Duty with love is desirable. Duty without love is deplorable. ప్రేమ చాల అవసరం అయితే ఇక్కడ ముఖ్యమైన దొకటుంది. భగవంతుని ప్రేమ ఎప్పుడూ డ్యూటీ కాదు. Love without duty is divine.
(స. సా. ఫి. 98 పు. 53)
(చూ|| భక్తి, లింకన్, సత్యవిద్య)