పేలముల పైని పేరాశ విడువ లేక
బోను నందెలుకలు పడిపోయినట్లు
తుచ్చ విషయ సుఖాసక్తి దూలి నరుడు
వద్దనే యున్న ఆనంద పదవి వదలు.
(స.పా.పి.2000 పు.47)
సకల సద్గుణములు చక్కగా లేకున్న
వాడు నరుడు కాడు వాస్తవముగ
సవినయుండుగాక సచ్చరితుండెట్లగును!
ఉన్న మాట తెలుపు చున్నమాట!
(సా.పు.519)
నరుడనగా అర్ధమేమిటి? ఆత్మకే నర! అని పేరు. "నరః" అనగా ఆత్మస్వరూపుడే. ఒకానొక సమయంలో గోపికలు "క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లబాయ”, స్వాహా అన్నారు. క్లీం మొదటిది, కృష్ణాయ రెండవది; గోవిందాయ మూడవది; గోపీజన వల్లభాయ వాల్గవది, స్వాహా ఐదవది. ఇవే పంచభూతములు. ఈ పంచభూతముల స్వరూపమే మానవత్వములో చేరి ఉన్నది. పంచ భూతములు లేని స్థలముగాని, పంచభూతములు లేని జీవితముగాని జగత్తులో కానరాదు. పృధ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము సర్వత్ర వ్యాపించినవి. కనుకనే భగవంతుడు సర్వత్రా వ్యాపించిన వాడని వారు నిర్ణయము చేసుకొన్నారు. ఈ పంచభూతములను సద్వినియోగ పరచుకోటమే మానవుని ప్రధాన కర్తవ్యము. ఆగ్నిని దుర్వినియోగము చేసుకోవటం భగవంతుని దుర్వినియోగం చేసుకోవటమే; జలమును దుర్వినియోగం చేసుకోవటం భగవంతుని దుర్వినియోగం చేసుకోవటమే: పృధ్విని దుర్వినియోగం చేసుకోవటం కూడా భగవంతుని దుర్వినియోగం చేసుకోవటమే. మానవుడు పాంచ భౌతిక దేహమునే విశ్వసించి దీని సుఖములకోసం, దీని అనుకూలముల కోసం జీవితాన్ని ఆర్పితము చేస్తున్నాడు. (ద.స.98. పు.34/35)
విద్య యొసగు వినయము! వినయమునను
బడయు పాత్రత! పాత్రత వలన ధనము!
ధనము వలన ధర్మము! దానివలన
ఐహికాముష్కికా! సుఖముల నందు, నరుడు!
(సా.పు.289)
నీటియందే పుట్టి, నీటియందే నిలిచి
నీటి యందే అడంగు నీటిబుగ్గ
నరుడు బుద్బుదము నారాయణుడు నీరు
సత్యమైన మాట సాయిమాట!
(సా.పు.301)
పాపకర్మంబు నరుడు ఓపికతో చేయు
పుణ్యమును విడుచు బుద్ధిపూర్వకముగాను
పుణ్య ఫలము గుడవబోవ నహహః |
(సా.పు.576)
చెవులకెవ్వడు వినుశక్తి చేర్చెనోయి
కనుల కెవ్వడు ఇచ్చెను కాంతిరేఖ
అట్టివానిని వెలికెడి వాడె నరుడు
(బృ త్ర.పు. 54)
నరుని జీవితంబు నల్లుల మంచంబు
పుడమి నొడలు రోగములకు కొంప
సంతసమను మాట ఎంతదూరమొ కదా!
ఉన్నమాట తెలుపుచున్న మాట.
(భారతీయ స్రీ పు 110)