"ఉత్సాహం సాహసం ధైర్యం, బుద్ధి శక్తి: పరాక్రమః
షడేతే యత్ర తిష్ఠంతి తత్ర దేవస్సహాయకృత్".
ప్రేమస్వరూపులారా!
ఏరంగమునందైననూ, ఏకాలమునందైననూ, ఏ మానవుడైననూ ఈ ఆరు సద్గుణములు కలిగినటువంటి వాడు సర్వత్రా విజయమునే సాధిస్తాడు. ఈ సద్గుణములే మానవుని సకలైశ్వర్య సంపన్నుని గావిస్తాయి.ఈ సద్గుణములు కలిగినటువంటి మానవుడ్ని సర్వ విజయములూ వరిస్తాయి. అయితే ఈ సద్గుణములకు అనేక విధములైన అవాంతరములు అడ్డు తగులుతూ ఉంటాయి. ఆవాంతరములు, కష్టములు, నష్టములు, విచారములు ఇవి ఒక విధంగా తమ భవిష్యత్తుకు ఉన్నత సోపానములే. వీటినన్నింటిని ధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొని తట్టుకొని, నెట్టుకొని ముందుకు సాగిపోవటం నేర్చుకోవాలి.
(శ్రీ మా.97 పు.5)
(చూ॥అనాధుడు. అలవర్చుకోవాలి. చింత, సాయి - శరీరము. స్త్రీజాతి)