"సూర్యరశ్మిభి: తుహినపటలమివ జ్ఞానభాభి: అజ్ఞానం నశ్యతి” అన్నట్లు సూర్యకిరణములచే మంచు ఎట్లు కరుగునో అట్లే జ్ఞానకిరణములచేత ఆజ్ఞానము కరిగిపోవును. ఎడతెగని ఆధ్యాత్మిక విచారణచేత జ్ఞానోదయము చేకూరును. సంపూర్ణ జ్ఞానోదయమెప్పుడు కలుగునో అప్పుడే మోక్షప్రాప్తి కలుగును.
(జ్ఞా, వా, పుట 1)