పంచ భూతములు లేని స్థానం లేదు. పంచభూతములలో కూడినది కాబట్టే, శరీరాన్ని పాంచభౌతిక స్వరూపమన్నారు. పంచ భూతముల తత్త్వాన్ని తెలిపేదే పంచాంగము. ఆకాశము శబ్దస్వరూపము. అదే ప్రణవ నాదము. ఏరోప్లేను దూరం నుండి వస్తున్నప్పుడు శబ్దం తక్కువగా ఉంటుంది. దగ్గరకు వచ్చేటప్పటికి శబ్దం ఎక్కువవుతుంది. తిరిగి దూరంగా వెళ్ళిపోయేటప్పుడు ఆ శబ్దం క్రమక్రమేణ తగ్గిపోతుంది. అదేరీతిగా, ఓంకారం అకార, ఉకార, మకారములతో కూడియున్నది. ఇట్టి ఓంకారనాదాన్ని మీరు శ్రవణం చేయాలి. ఇదే ఆకాశం చేసే బోధ. ఇంక, గాలి ఏమని బోధిస్తున్నది? మీరు ఆక్సీజన్‌ను పీల్చుకొని, కార్బన్ డయా క్సైడ్ ను వదలి పెడుతున్నారు కదా! అదేరీతిగా, మీరు మంచిని స్వీకరించి, చెడ్డను విర్జించాలి, ఫలమున స్వీకరించి మలమును విసర్జించాలి. ఇదే గాలి అందించే గొప్ప ఉపదేశం. అగ్ని ఆత్మజ్ఞానమును ప్రబోధిస్తున్నది."తమ సోమా జ్యోతిర్గమయ," అన్నారు. జ్యోతి ఉన్నచోట తమస్సు ఉండటానికి వీల్లేదు. రామనామంలో కూడా అగ్నిబీజం ఇమిడియున్నది. “ర, అమ” ఆవే మూడక్షరములచేరికయే రామనామము. ర’ - అగ్నిబీజము; అ - చంద్రబీజము; మ - సూర్యబీజము. సూర్యుడు చీకటిని దూరం చేసి ప్రకాశాన్ని అందిస్తున్నాడు. ప్రాణాన్ని నిల్పుతున్నాడు. చంద్రుడు తాపాన్ని తొలగించి హృదయాన్ని చల్లబర్చుతున్నాడు. ఇంక, అగ్ని పాపాన్ని భస్మం చేస్తున్నది. కనుక, రామనామం అజ్ఞానాంధ కారమును పోగొట్టుతుంది; తాపాన్ని చల్లార్చుతుంది; పాపాన్ని భస్మం చేస్తుంది. గర్గ మహర్షి రాము అని పేరు పెట్టడంలో గల అంతరార్థమిదియే.
(స. సా.జూలై2000 పు.195/196)
శబ్దం, స్పర్శ, రూప, రస, గంధములను గుణముల మిశ్రమములే: మొదటిది భూమి, అందువలన భూమి అతి భారమైనది. రెండవదైన నీరులో శబ్ద, స్పర్శ, రూపు, రసమను నాలుగు మాత్రమే కలవు. అందులో గంధము ఒకటి తగ్గింది. దాని వలన కొంత తేలికయి, అది ప్రవహించుచున్నది. ఇక మూడవదయిన అగ్ని యందు శబ్ద, స్పర్శ రూపములు మాత్రమే వున్నవి. రస, గంధములు లేవు. ఆ కారణముచే అగ్ని మరికొంత సూక్ష్మమయి పైకిలేచుచున్నది. వాయువు నాలుగవది. అందులో శబ్ద, స్పర్శ మాత్రమే నిలిచి, రూప, రస, గంధములు లేనందున అది మరింత సూక్ష్మమయి సర్వవ్యాప్తి అయినది. తరువాత ఆకాశము, అందులో శబ్దము మాత్రము మిగిలినది. తక్కిన స్పర్శ, రూప, రస, గంధములు లేనందున ఆకాశము అన్నిటికంటే తేలిక అయినది.
(శ్రీస.సూ.పు.221)
చూ ఆ త్మ బ్రాంతి, కులం, గుండె, దైవం కోసం, ధర్మము, నరుడు, మాను షాకారము, సృష్టి)