సత్య ధర్మ శాంతి, ప్రేమ అహింసలను మానవుడు తన పంచ ప్రాణాలుగా భావించాలి. సత్యం నాలో లేకపోతే ఒక ప్రాణం పోయినట్లే ధర్మం లేకపోతే రెండవ ప్రాణం కూడా పోయినట్లే. ఈ పంచ ప్రాణాలు నీలో లేక పోతే నీ వొక డెడ్ బాడీ. నీవొక శవంతో సమానం.
అన్నింటికీ ప్రేమ ప్రధానమైనది. ప్రేమతో ఏది పలికినా అది సత్యమవుతుంది. ప్రేమతో ఏది చేసినా అది ధర్మం అవుతుంది.
ఏకష్టం నీకు కలగకూడదని ఆశిస్తావో, ఎదుటి వారికి అట్టి కష్టాలు మీ వల్ల కలగకుండా చూసుకోవాలి. (దే.యు.పు.8)
సత్యధర్మ మహింసయు శాంతి ప్రేమ
మానవుని పంచప్రాణాలు మహిని వెలయు
పంచప్రాణాలలో ప్రేమ- యెంత హెచ్చు
కాన హృదయాన ప్రేమను గట్టిపరచు!
(భ.సా. పు 34)