ఫలత్యాగ కర్మలలో, పదే పదే స్వాహా అనుచు ఆర్పితము గావించుచుందురు. ఈ స్వాహా శబ్దసాంప్రదాయములకు గతములైన శబ్దములు అర్థములను చూతము. కేశవాయస్వాహా,ప్రాణాయస్వాహా, ఇంద్రాయ స్వాహా, ఇత్యాది స్వరములయందు, స్వాహా పదమునకు సామాన్యముగ "హవిస్సు సుహుతమగు గాక" అని అర్థము చెప్పుదురు. "సుహుత మన నేమి? అగ్నియందు విడువబడిన యజ్ఞాది ద్రవ్యములు దగ్ధమగు గాక, జీర్ణమగుగాక, అని ఇక్కడ ఒక సందేహము కలుగవచ్చు. అగ్నిలో వేసిన సమస్త పదార్థములు, సహజంగానే దగ్ధమగును. జీర్ణమగును కదా, ఇక స్వాహాకారము చేయుటచేత కలుగు ప్రత్యేకత ఏమి? స్వాహ్రూతి అనగా వస్తువులను దగ్ధము చేయుట, జీర్ణముచేయుట మాత్రమే శృతితాత్పర్యము కాదు. దగ్గ మగుట ప్రత్యక్షగోచరము మాత్రమే; వైదిక దృష్టివేరు. కుమారసంభవ కావ్యమందు. కాళిదాసు, హిమాలయమును వర్ణించుచూ "దేవతాత్మా" అని అన్నాడు. అనగా దేవరా శరీరము. భౌతిక శరీరము అని ప్రతిదానికి రెండు శరీరములు కలవు. ఇది శ్రుతి సమ్మతము. దేవతా శరీరము అతీంద్రియం, భౌతిక శరీరం ఇంద్రియములలో కూడినది. దేవతా శరీరమున అగ్ని ప్రాణాగ్ని అగుచున్నది. అందులో అహుతి హవిస్సు అగుచున్నది. అహుతియొక్క స్వరూపమును శ్రుతి యిట్లు వివరించుచున్నది. అత్తా, అద్యము అనగా భోక్త, భోగ్యరూపమగు ఈ జగత్తు ఏకీభూతమయినపుడు, రెంటినీ కలిపిఅత్తా అనియే అనగా భోక్త అనియే, వ్యవహారము. ఆ భోక్త యెవరు? అదే అగ్ని, అది దైవికముగ ఆదిత్యుడు, ఆధ్యాత్మికమున ప్రాణము. అట్టి ప్రాణాన్ని యందు సమంత్రముగ నుంచబడెడి అన్నాది హవిస్సులకు "అహితయః" అని పేరు. స్వాహా శబ్దము కేవలము హామ సూచకమైన సాంకేతిక పదము మాత్రమే కాదు. సా ర్థకమగు వాజ్మయము.
ఛందయతి: ఆహ్లాద, చాదనమనగా బలవంతుడగుట, ప్రాణశక్తి వంతుడగుట, ఆచ్చాందించుట. ఇట్టి ధర్మ బలముండుటచేతనే వేదములకు చందస్సులని పేరు. ఇట్టి వేదము నాచ్ఛాదించు వారలను సుశక్తి వంతులను తైత్తరీయ శృతి యెంతయో విపులపరచినది. ఇట్టి క్రతువుఒక వ్యక్తికే కాక లోకోత్తరాహ్లాదమనే కలిగించునదైయున్నది. "యజ్ఞాంగ: యజ్ఞ వాహనః వృషురధ: ఇత్యాది నామములు శృతి, స్మృతులయందు పరమేశ్వరునకు చెప్పబడినవి. హిరణ్యగర్భుడు సువర్ణ ఛందోయముడు, సువర్ణమనగా గరుత్మంతుడు. ఛందోమయమును గరుడుని వాహనముగా స్వీకరించినవాడు.
వృష అనగా ధర్మస్వరూపము. ధర్మమునే వాహనముగా చేసుకొనుట. విష్ణు ఆలయములందు గరుడ, శివాలయములందు వృషభం స్తంభములను ద్వారముల ముందు యుంచి యుండుటలో ఇదే అంతరార్థము.
ఛాదనమనగ సంసారవృక్ష రక్షణము. ఫలకాములై కర్మల యందు చరించు వారికి తత్త్వము నాచ్చాదించి, ధర్మనిష్టులగావించి, సంసార వృక్షమును రక్షించు చుండును. కర్మిష్టులన ధర్మరూపమృత్యువునుండియు జ్ఞానులను సంసార రూపమృత్యువునుండియునాచ్చాదించిరక్షించును. అట్లు రక్షించునట్టి వానినే ఛందస్సులనియు, అవేవేదములనియు చెప్పబడెను. "ఛాదనాత్ఛందాసి"మృత్యువునుండిరక్షించగలుగునదనిఛందస్సులు శర్మ హేతువులు,యజ్ఞము దేవతలనుండితొలగిపోయికృష్ణమృగరూపమైసంచరించుచుండ దేవతలు వెన్నంటి, కడకు దాని చర్మమును గ్రహించగల్గిరి. యజ్ఞశరీరమే కృష్ణాజినము. దానియందలి శుక్ల కృష్ణ, బబ్రువర్గములు ఋగ్వేద, యజు:సామముల యొక్క రూపములు. కనుక కృష్ణాజినము ఋగ్, యజర్, సామవేదస్వరూపమనే నిర్ణయము గావించిరి. దీనిని త్రయూ విద్యారూపమనిరి. త్రయూ విహిత కర్మ సాధ్యమగుటచే యజ్ఞముకూడా త్రయీస్వరూపము. ఇట్టి కృష్ణాజినమును గ్రహించుటచేతనే, యజ్ఞదీక్షితుడగు యజమానుడు, ఛందస్సుల ప్రేరేపించును.
శుక్ల, కృష్ణ బబ్రు వర్ణములు కల కృష్ణాజినము లోకత్రయారూపము. కాన కృష్ణాజినము ధరించి యజమానుడు లోకత్రయ దీక్షితుడగుచున్నాడు. దీక్షితుడైన యజమాని గర్భస్థశిశుతుల్యుడు. గర్భస్థ శిశువు యేరీతిగవ్రేళ్ళు ముడిచి గుప్పిలిపట్టి మాత్రు శరీరచ్ఛాదితుడై యుండునో యజమానుడును ఆట్లే గుప్పిలిపట్టి త్రయూ విద్యారూప ఛందోమాతృశరీరచ్ఛాదితుడై కృష్ణాజినధారుడైయుండవలెను.
కృష్ణాజినము మానుష దృష్టిలో చర్మము. అది దేవతాప్రీతికర మైనదగుటచేత, యజ్ఞకర్మల యందు శర్మమగుచున్నది. అందువలన యేయజమానుడు, యజ్ఞసమయమున "నీవు శర్మస్వరూపివి. నాకు శర్మ నిమ్ము" అని సంబోధించును.
శర్మమనగా సుఖము, ఆనందము, ఆనంద స్వరూపుడు విష్ణువు. విష్ణువు యజ్ఞస్వరూపుడు."య జ్ఞో వైవిష్ణుః" ఆ విష్ణు త్రయీ విద్యా స్వరూపుడు.
(స.వా.పు.168/171)
స్వాహా అను పదము వేదవాచకము కాదని యున్నది. సామాన్యముగా హెూమార్థమైన మంత్రమనియు, ఇది హెూమసూచకమైన సాంకేతిక పదమనియూ తలంతురు. ఈపదమునకు స్వాహాదేవి అనియు, హవిష్రృధాన మనియు రెండు అర్థములున్నవి. దేవతలను ఉద్దేశించి స్వాహా అనియు, పితరులను ఉద్దేశించి స్వథా అని హవిస్సులు వేయబడుచుండును. స్వాహా అనుపదము వేదములో వాగ్ దేవత అను అర్థము నిచ్చుచున్నది. నిత్యనైమిత్తి కర్మలు, యాగాది క్రియలు అన్నియూ స్వాహాకార పూర్వకమగు నాచమన క్రియలతో ఆరంభ మగుచున్నవి. స్వాహా, స్వధాకార వర్జితములైన హామములు సామాన్యముగా ఉండవు.
స్వాహా, స్వధామంత్రములు చేర్చి హవిర్ధానముల గావించుట చేత దేవతలు, పితరులు తృప్తి పడుదురు. స్వాహా అను నామమును ఉచ్చరించకవేద విదులు యజ్ఞములందు హామము మొనర్చినచో దేవతలు ఆయజ్ఞ భాగములను పొందలేరు. స్వాహా, స్వధా అనురెండు శబ్ధములు దేవతా ప్రీతి కరములును దేవతా జీవన హేతువులును అగుమంత్రములు.
"స్వాహస్తోమస్యవర్చసా" ఋగ్వేదము. స్వాహా పదమునకు (1) స్వాహాకారపూర్వకమైన హవిర్ధానము (2) స్తుతిలక్షణమగు వేదవాక్కు అని రెండు అర్థములు ప్రసిద్ధములు. ఏ యర్థమును చెప్పినను లేక రెండు అర్థములు చెప్పెనను స్వాహాపదోచ్చారణముచే దేవతలు ప్రీతి నొందుటయు, ఆట్లు ప్రీతి నొందిన దేవతలు స్తోత్రము చేయుస్తోతను వర్ధిల్లు చేయుటయు జరుగును.
స్తోత్ర యొక్క వేద మంత్ర రూపమైన వాక్కులో నొక విధమగు ప్రభావమును చేకూర్చి ఉచ్చఱించుట అని అర్థము.
కేశవాయ స్వాహా, ప్రాణాయాస్వాహా, ఇంద్రాయ స్వాహా, ఇత్యాది స్థలములందు స్వాహా పదమునకు స్వాహుతమస్తు, సుహుతమస్తు అనగా సుత మగు గాక స్వాహతమగు గాక అని అర్థము. అర్పిత ద్రవ్యములు దగ్ధమగును గాక అనగా జీర్ణమగును గాక అని కూడా యర్థము.
స్వాహుతి అనగా వస్తువులను అగ్నిలో చక్కగా దగ్ధము చేయుట, లేక జీర్ణము చేయుట అని మాత్రమే కాదు. లౌకికముగా వస్తువులు అగ్నిలో దగ్ధమైపోవుట మాత్రమే చూతురు కాని అగ్నికీ దేవతా స్వరూపము, భౌతిక స్వరూపము రెండునూ కలవని తెలిసికొనరు. దేవతా శరీరము అతీంద్రియమగుటచే కర్మానుష్టాన సమయమున ఆయా దివ్యరూపముల ఆరాధించుట శ్రుతి సమ్మతము. “అగ్నిర్వై దేవ యోని:" అనేది శ్రుతి ననుసరించి అగ్నియొక్క దేవతాత్మకత్వమును అటులనే యజమానికి కలుగు దివ్యత్వమును ఎవరు తెలిసికొనగలరో అట్టివారికి అమృతత్వము సిద్ధించును.
భోక్త, భోగ్యము అని జగత్తు ద్వివిధము. భోక్త భోగ్య రూపమగు ఈ జగత్తు ఏకీభూతమగునపుడు, ఈ రెండింటినీ కలిపి అత్తా అనియె లేక భోక్త అనియో వ్యవహారము. భోగ్యము అను వ్యవహారము లేదు. భోక్తయెవరు? ఆగ్నియే హవిస్సుల గ్రహించేది.
అధిదైవికము ఆదిత్యుడు. ఆధ్యాత్మికముగ ప్రాణము. ప్రాణాన్ని ఇట్లు అగ్ని యందు ఆజ్య. సోమ ఆది హవిస్తులకు "అహితయః" అని పేరు. పరోక్షముగ అహుతులు అని చెప్పబడినవి. దేవతలు పరోక్ష ప్రియులు.ఆగ్రి: సర్వమునకు అగ్రమున అనగా పూర్వమున సృజింపబడినవాడు అని అర్థము అగ్ని: పరోక్షనామము. దేవతలనుద్దేశించి హూ మము చేయబడునది. అంత మాత్రమే గాక దేవతా ఆహ్వాన రూపమని విశేషార్థము. స్వాహాకార వషట్కార పూర్వకము కాని హుతులు దేవతలకు చెందనే చెందవు.
సరస్వతి శబ్దము ఒక దేవికిని, వేదవాక్కునకును ప్రసిద్ధము. అంతేకాదు. ఆత్మను గురించి చెప్పునది కనుక స్వాహా అని అర్థము. దేవీ భాగవతమునందు పరాదేవతయే గాయత్రి అనియు, స్వాహా ఆనియు చెప్పబడినది. లలితా సహస్రనామములో పరాదేవత స్వాహా. స్వధా అను శబ్దములలో పేర్కొనబడినది. స్వాహా అను శబ్దము హవిర్ధాన వాచకము కూడా..
(లీ.వా.పు.19/23)