నరుడైనందుకు పరమాత్మాయని
తలచిన నరుడని ఎంచండి
భగవన్నామము వలదనె నరుని
సరపశువని భావించండి
(ము.ము.పు.77)
నరసింహావతారము
నరసింహావతారమును జూచినపుడు ప్రహ్లాదుడు గడ గడ వణకెను. ఎందుకు ఆట్లు వణకుచున్నావని భగవంతుడు అడుగగా మీరు భయంకర రూపమున నున్నారని భయపడుటలేదు. అన్ని రూపములు మీవే కదా. మీరు త్వరలో అదృశ్యులవుతురేమోయను భయముతో వణకుచున్నానని ప్రహ్లాదుడు బదులు చెప్పెను. హిరణ్యకశిపుడు రజోగుణము గలవాడగుటచే మోహనావతారమును చూడలేకపోయెను. ప్రహ్లాదుడు భక్తుడైనందువల్ల అదే రూపమును భయంకరముగా తలంచక ప్రేమ భావముతో చూచుటవల్ల భగవంతుడతనికి సాధు రూపముతో దర్శనమిచ్చెను.
(జ.పు. 184)