ఇంద్రియముల సహవాసముచేతనే మనస్సు మాలిన్యమగుతున్నది. సర్వ శాస్త్రములు మనస్సుకుమల, విక్షేప. ఆవరణములనే దోషములున్నవని నిరూపించినవి.
(బృ, త్ర పు. ౮౦)
మన దోషములు మనకు కానరావు. ఎట్లు?
తప్పు కానక సర్వము ఒప్పుగా భావించి
ప్రకటించు చుందురు ప్రాజ్ఞ జనులు.
తప్పును తప్పుగా ఒప్పును ఒప్పుగా జూచి
శ్లాఘించు చుందురు సరస జనులు
ఒప్పులను మరచి తప్పులనే గైకొని –
కలహించు చుందురు కలుష జనులు –
ఒప్పులన్నియు తప్పులుగా చేసి ..
దూషించు చుందురు దుష్ట జనులు.
మొదటి మూడింట ఒక విధమైన రీతి కలదు
నాల్గవ పక్షమందున్న వారిని నరుల నరయ
వారి కంటే రాక్షసుండే మేలు.
(శ్రీ సత్య సాయి దివ్య బోధ పు 169 -25 -7 -78 )