దేహము యొక్క విశిష్టమును అలక్ష్యము చేయకూడదు. ఈ జగత్తునందు అన్ని ఆనిత్యమే. ఐతే అన్నింటిని అలక్ష్యము చేస్తున్నామా? లేదు. "అనిత్యం అసుఖంలోకమిమం ప్రాప్య భజస్వమామ్"అ నిత్యం అసుఖం ఈ రెండు రూపములలో చేరినది జగత్తు. దీనిని సరియైన రీతిలో అనుభవించి సరిగా వినియోగపెట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి. దేహమంటే ఒక దేవాలయము. ఎలాంటి దేవాలయము? నడిచే దేవాలయము. moving temple. ఇలాంటి దేవాలయమును మనము సార్థకమైన రీతిగా అనుభవించాలి. ఏది చేసినా దేవుడున్నాడు లోపల అనే ఆత్మవిశ్వాసమును పెంచుకోవాలి. ఈ ఆత్మ విశ్వాసము లేకుండా లోక విశ్వాసము చేతనే జీవితము గడవటంచేత అశాంతికి గురై పోతున్నాము. గోడ కట్టాలంటే పునాది భద్రముగా వుండాలి. అప్పుడే గోడ భద్రముగా వుంటుంది. గోడ భద్రముగా వుండినప్పుడే మనము రూఫ్ భద్రముగా వేయవచ్చు. రూఫ్ భద్రముగా వుండినప్పుడే అందులో వాసము ధైర్యముగా చేయవచ్చు. Sell confidence foundation; self satisfaction wall; self sacrifice roof; self realisation life అన్నారు. Self అంటే ఏమిటి? రెండు రకములైన self లు వుంటున్నాయి. ఏకాక్షరకమైన ఒక self. రెండవది eye. ఇది మూడక్షరముల I, three letters eye నే body. ఏకాక్షర I ఆత్మ. “ఏకం సత్యం విమలమచలం సర్వధీసాక్షి భూతం". ఈ I అనే ఏకాక్షరము సర్వుల యందు వుంటుండాది. మూడక్షరముల eye కొంతమందికి లేకుండా వుండవచ్చును. కొంతమందికి ఉండి కూడను క్యాటరేక్టు రావచ్చును. ఇంకా వేరు వేరు దోషములు అందులో ప్రారంభముకావచ్చును. యోగి భోగి జోగి. విరాగి బైరాగి సర్వులయందు ఏకాక్షర I సమంగానే ఉంటుంది. ఇప్పుడు భగవతి అని నేను పిల్చాను. ఆయన నేను I అంటాడు. హక్సర్ అని పిల్చాను. ఆయన నేను అంటాడు. అర్జున్ సింగ్ అని పిల్చాను. ఆయన నేను I అంటాడు. బిబ్బర్ అని పిల్చాను. I అంటాడు. భగవతి, హక్సర్ సింగ్ బిబ్బర్ రూపనామములు వేరు అయినప్పటికిని అందరినుండి I అనే జవాబు ఒక్కటిగానే వచ్చింది. రూపనామములు వేరు అయినప్పటికి ఈ I అనేది అందరియందున్నది ఒక్కటే. దానినే వేదాంతము "ఏకంసత్ విప్రాఃబహుధా వదంతి" అన్నది.
(బృ త్ర, పు. ౩౫/౩౬)
తన కంటె వేరైనది జగత్తు నందు లేదు - ఉన్నదంతా వున్న దాని యొక్క ప్రతిబింబములే.
(బృత్ర.పు. ౧౨౮)
జగత్తు అంతయు "అనిత్యం అసుఖం లోకమిమం ప్రాప్యభజస్వమాం" ఈ ప్రపంచములో ప్రతి ఒక్కటి మార్పు చెందునదే, శిథిలమయ్యేదే, క్షణించునదే, అనే దోషమును చక్కగా గుర్తించినచో అనిత్యమైన దోషభరితమైన ఈ జీవితమునకు ఏమాత్రము ముందంజవేయము. రోగనివారణమునకై భుజించే ఆహారములన్నియు భోగములు కానేరవు. ఆకలి రోగానికి అనుభవించే అన్నమంతా భోగమవుతుందా? ఇది ఒక రోగమునకు సంబంధించిన ఔషధమే. కొంత మంది మధురమైన ఔషధాన్ని సేవించాలని ఆశిస్తూ వుంటారు. అదే విధముగనే యీ ఆకలి అనే రోగానికి రుచికరమైన మందు అనే అన్నము కావాలని ఆశిస్తుంటారు. జగత్తులో మనము అనుభవించే ప్రతి విషయముగాని ప్రతి భోగముగాని రోగ నివారణకై సేవించే మందులు మాత్రముగా భావించాలి. ఈ జగత్తునందు అనేక విధములుగా సుఖశాంతులతో భోగభాగ్యములతో జీవించుచున్నట్టుగా భావిస్తుంటాము. ఇవి భోగములుగా విశ్వసిస్తుంటాము. కానీ యివి నిజముగా భోగములు కానేరవు. దీని ప్రతిఫలము మున్ముందు మనలను యెన్నో విధములుగా బాధింపజేస్తుంది.
(శ్రీ. గీ. పు.78)
(చూ॥అంతర్వాణి, ఆమనస్కుడు. అవతారము, ఆత్మజ్ఞానము, ఆధారము, ఆహారము, ఈతర్నాశబ్దం, ఋతువు, కల, జగదీశుడు, జన్మాద్యస్యయతః, తమోగుణము, దివ్యత్వము. దేవుడు, దైవము, ధర్మము, ధీమంతుడు, నాలుక, ప్రత్యక్షదైవము, బ్రహ్మస్వరూపము, భగవంతుడు, భవానీశంకర, మనసు, వసంతఋరువు, విశ్వాసము, సంపర్కము, హృదయము)