మనస్సే అనేక విధములైన సూక్ష్మరూపములు ధరించి అంతఃకరణ అనే పేరును అందుకుంటున్నది. మనసు బుద్ది చిత్తము అహంకారము ఈ నాలుగు ఆకారములు మనసే ధరిస్తుంటుంది. బుద్ధి చిత్తము అహంకారము మనసు యొక్క సూక్ష్మ స్వరూపములే. ఒక్కొక్క కర్మయందు ప్రవేశించినప్పుడు ఒక్కొక్క పేరును పొందుతుంది. ఒకే బ్రాహ్మణుడు, మందిరమునందు పూజ చేస్తున్నప్పుడు పూజారి బ్రాహ్మణుడు అంటారు. వంట చేస్తున్నప్పుడు వంట బ్రాహ్మణుడు అంటారు. విద్యార్థులకు విద్య బోధించుచున్నప్పుడు అధ్యాపక బ్రాహ్మణుడు అంటారు. పంచాంగము చెప్పుతున్నప్పుడు పంచాంగ (బ్రాహ్మణుడు అంటారు. బ్రాహ్మణుడు ఒక్కడే ఐనప్పటికిని చేసే వృత్తులను పురస్కరించుకొని అతనికి ఇట్టి నామములు కలుగుతూ వచ్చాయి. అదే విధముగనే సంకల్ప వికల్పములతో కూడినప్పుడు దీనికి మనస్సు అనే పేరు వచ్చింది. వివేచన చేసే సమయమునందు దీనిని బుద్ధి అనే పేరుతో పిలిచారు. ఇది విచక్షణ స్థానములో కూడిన విచారణ, దీనిని డిస్క్రిమినేషన్ నాలెడ్జి అంటారు. మూడవది చిత్తము. ఇది స్మృత్యాత్మకము కనుకనే దీనికి చిత్తము అని పేరు వచ్చింది (మెమొరి). మెమొరీ దేహముతో తాదాత్మ్యము పొందే సమయమునందు కలిగే స్వరూపమును అహంకారము అని పిలుస్తూ వచ్చారు. ఒకే మనసు ఇన్ని కర్మలయందు ఇన్ని స్థానములయందు అన్ని పేర్లను పొందుతూ ప్రకటిస్తూ వచ్చింది. అన్నింటికిని మనసే కారణము. ఈ ప్రపంచమంతయు మనసుచేత కట్టబడి ఉంటుండాది. (బ్బ.త్ర.పు. ౮౯)
అంతఃకరణమనగా లోపలి యింద్రియములు, కన్నులు బయట చూస్తున్నాయి. చెవులు బయట వింటున్నాయి, నోరు బయట మాట్లాడుతున్నది. చేతులు బయట పనిచేస్తున్నాయి, ముక్కు బయట వాసన చూస్తున్నది. వీటిన్నిటికి రూపములంటున్నాయి. మనస్సునకు రూపము లేదు. బుద్ధికి రూపము లేదు. చిత్తమునకు రూపము లేదు. అహంకారమునకు రూపము లేదు, రూపము లేని వీని సమ్మిళిత స్వరూపమే దీని స్వరూపము. దీనికి నాలుగు విధములైన దోషము లుంటున్నాయి. ఒకటి భ్రాంతి, రెండవది ప్రమాదము, మూడవది కరణ పాటవము. నాల్గవది విప్రలిస. ఈ నాల్గు దోషములు అంతఃకరణను మాలిన్యపరుస్తున్నాయి. (బృ త.పు ౯౯)
మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాల్గింటి చేరికనే అంతఃకరణ. కరణమనగా పనిముట్టు, ఇంద్రియము. అంతఃకరణమనగా లోపలి యింద్రియములు, కన్నులు బయట చూస్తున్నాయి. చెవులు బయట వింటున్నాయి, నోరు బయట మాట్లాడుతున్నది. చేతులు బయట పనిచేస్తున్నాయి, ముక్కు బయట వాసన చూస్తున్నది. వీటిన్నిటికి రూపములంటున్నాయి. మనస్సునకు రూపము లేదు. బుద్ధికి రూపము లేదు. చిత్తమునకు రూపము లేదు. అంహంకారమునకు రూపము లేదు, రూపము లేని వీని సమ్మిళిత స్వరూపమే దీని స్వరూపము. దీనికి నాలుగు విధములైన దోషము లుంటున్నాయి. ఒకటి భ్రాంతి, రెండవది ప్రమాదము, మూడవది కరణ పాటవము. నాల్గవది విప్రలిస్ప. ఈ నాల్గు దోషములు అంతఃకరణను మాలిన్యపరుస్తున్నాయి. (బృ. త్ర.పు ౯౯)
పంచభూతములు యొక్క సమిష్టిస్వరూపమే అంతఃకరణ. అంతఃకరణ శబ్ద స్పర్శ రూప రస గంధములు అన్నీ అనుభవించే అధికారముంటున్నది. అంత:కరణము. శబ్దస్పర్శ రూపరస గంధాదులు జ్ఞానేంద్రియములకు మాత్రమే సంబంధించినది. ఈ జ్ఞానేంద్రియములు దేహమునకు వెలపలివా లోపలివా అని విచారిస్తే ఇవి అంతర్బహిస్వరూపాలు. (బృ త్ర.పు.౧౧౩)
మానవుడు కేవలము శారీరక మానసిక ఆధ్యాత్మిక తత్వములతోనే కూడినవాడు కాదు. అతీతమైన ప్ర జ్ఞా శక్తి ఒకటి ఇతనికి వుంటున్నది. ఈ ప్ర జ్ఞా శక్తి ని ప్రతి మానవుడు దృష్టియందుంచుకోవాలి. ఇది మనస్సు, శరీరము, అంత కరణము లన్నింటియందును సర్వవ్యాపకమై వుంటున్నాది. అంత కరణమనగా ఏమిటి ? ఇక్కడనే త్యాగముతో కూడిన యోగము ప్రాప్తిస్తుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాల్గింటి సమ్మిళిత స్వరూపాన్నే అంతఃకరణ మంటారు. మనస్సు అనగా ఏమిటి ? "సంకల్ప వికల్ప ఆత్మకం మ నః " అన్నారు. ఇది సంకల్ప వికల్పాలతో కూడి వుంటుంటాది. ఇది ఒక వస్త్రము. ఈ వస్త్రమునకు పడుగు పేక అనగా నిలువు అడ్డము అనే దా రములు చేరివుంటున్నాయి. ఇదియే సంకల్ప వికల్పకాత్మకమైనది. మనము ఒక వైపునవున్న దారమును తీసివేస్తూ వస్తే బట్టలేదు. అదే విధముగనే ఈ సంకల్ప ములనే దారములను తీసివేస్తూ వస్తే మనస్సనే స్వరూపమే వుండదు. దీనినే మనన త్రాణ సమ్మిళితం అన్నారు. ఈ సంకల్పముల చేతనే మనన త్రాణశక్తిని పెంపొందించుకుంటున్నాము. చిత్తము అనగా చింతించటమే. తద్భావాన్నిచింతించటము. బుద్ధి అనగా నిర్ణయాత్మక శక్తి. నిత్యానిత్య విషయ పరిశీలన చేసేతెలివి.. ఇంక నాల్గవది అహంకారము. ఆకారమును పురస్కరించుకొని నేను అని భావించుకోవటమే అహంకారము, ఆకారము నేను అనుకోటమే అహంకారము. అహం+ఆకారము= అహంకారము. మనస్సు, బుద్ధి, చిత్తము, యింద్రియ, అహంకారము ఈ నాలుగు మనస్సు యొక్క వికారస్వరూపములే. మనస్సే యిన్నిరూమములను ధరిస్తున్నాది.. ఒకే మనస్సుకు యిన్ని పేర్లున్నాయి. ఒకే బ్రాహ్మణుడు వంట చేస్తుంటే వంట బ్రాహ్మణుడు అంటాము. అదే బ్రాహ్మణుడు పూజ చేస్తుంటే పూజారి బ్రాహ్మణుడంటున్నాము. అదే బ్రాహ్మణుడు టీచ్ చేస్తుంటే టీ చర్, బ్రాహ్మణుడు అంటాము. అదే బ్రాహ్మణుడు పంచాంగము చెబుతుంటే పంచాంగ బ్రాహ్మణుడు అంటాము. బ్రాహ్మణుడు ఒక్కడే. ఐనప్పటికిని ఆతని వృత్తిని పురస్కరించుకొని అతని పేర్లు వేరువేరుగా వస్తుంటాయి. మనస్సు అనేక వృత్తులతో కూడినప్పుడు దీనికే బుద్ధి, చిత్తము, అహంకారము, మనస్సు అని పేర్లు వస్తున్నాయి. ఇవన్నీ మనస్సు యొక్క పర్యాయ పదములు. బ్రాహ్మణుడు అంటాము.. మన కరణములన్నియు బయటకు కనుపిస్తున్నాయి. కన్ను బయటకు కనుపిస్తుంది. చెవి బయటి విషయాన్ని వింటుంది. ముక్కు బయటి గాలిని పీలుస్తుంది. ఇవన్నీ బహి:కరణములు. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అంతఃకరణములు లోపలి పనిముట్లు. కనుక వీటికి అంత:కరణములని పేర్లు. అంతఃకరణ త్యాగముచేత బహి:కరణములను అనుభవించినప్పటికి యిది త్యాగముతో చేరిన భోగమవుతుంది. కనుక మొట్టమొదట మనము అంతః కరణ పరిశుద్ధి గావించుకోవాలి. (ఉపనిష ద్బృందావనమ్ పు43-44)