"అనన్య చిత్తముతో నిత్యయుక్తుడై సతతము నన్ను యెవరు స్మరింతురో అట్టివారి ప్రాణము ఊర్థ్వద్వారము నుండి వదలనీ, మరే ద్వారమునుండి వదలనీ, వాడు నన్ను తప్పక పొందుచున్నాడు. అట్టి వానికి నాలో స్థానమున్నది. వాడు నాకెంత సమీపమో నేనునూ అతనికంత సమీపమే. నన్ను మరువని వానిని నేను మాత్రము మరతునా? బావా! అసలు. మరపు మానవత్వమునకే కానీ దైవమునకు లేదు. . "యోగము వద్దు, తపస్సు వద్దు, జ్ఞానము వద్దు. ఇన్ని చేయుశక్తి లేకపోయిననూ సరే, శక్తి యుండియూ చేయకపోయిననూ సరే, నేను యోగమును తపస్సునూ కోరుటలేదు. కేవలము చిత్తము నాపై పెట్టమనియు, చిత్తము నాకర్పితము చేయుమని మాత్రమే అడుగుదును.
(గీ. వా. పు. 149)
(చూ! అంతరాత్మ, సంకల్పములు)