చిత్త శుద్ధికి కావలసినది ఒక్కటే
See no evil see what is good
Hear no evil hear what is good
Think no evil think what is good
Talk no evil talk what is good
Do no evil do what is good.
ఇవీ పంచభూతములు పంచేంద్రియముల ప్రసాదములు. ఈ ప్రసాదమును అభివృద్ధి పరచుకుంటే చిత్తశుద్ధి కలుగుతుంది. జ్ఞానశుద్ధి కూడా కలుగుతుంది. దివ్యమైన ఆనందము అనుభవించగలము.
(బృత్రపు. ౯౦/౯౧)
వేద వేదాంతములు వల్లె వేసియున్న
గద్యపద్య oబులను గూర్ప గలిగియున్న
చిత్తశుద్ధియు లేకున్న చెడునువాడు
ఇంతకన్నను వేరేద్ధి ఎరుకపరతు
(భగవాన్ శ్రీ సత్యసాయిబాబా నవరాత్రిదివ్యోపన్యాసములు పుట58)