రామకృష్ణ పరమహంస, జయదేవ, గౌరాంగ, తుకారాం, తులసీదాసు, రామదాసు, కబీర్ దాసు, శారదాదేవి, మీరా, సక్కుబాయి, మల్లమ్మ మొదలయినవారికి బాహ్యచదువు లంతగా లేకపోయినప్పటికిని ఈనాడు ప్రపంచమంతా అన్ని మతములవారు అన్ని తెగలవారు అన్ని రాష్ట్ర ముల వారు వారిని పూజించుచూ, గౌరవించు చున్నారంటే, వారల చిత్తశుద్ధితో కూడిన ఆత్మవిశ్వాసమే మూల కారణము. చిత్తశుద్ధిని చేకూర్చునదే సత్య విద్య.
(వి.వా.పు7)