మనకు బాగా ఉక్కపోతగా ఉన్నప్పుడు విసిన కఱ్ఱతో విసురుకుంటే చల్లదనం చిక్కుతుంది. అదే విసిన కఱ్ఱను ఇతరులవైపు త్రిప్పతే ఆచల్లదనం వారికే పోతుంది. మన బుద్ధియే ఒక విసిన కఱ్ఱ. దానిని ఆత్మవైపు త్రిప్పి విసిరితే ఆత్మానందం కలుగుతుంది. దేహంవైపు త్రిప్పి విసిరితే దేహానికి ఆనందం కలుగుతుంది. ఈ దేహానందం క్షణికమైనది. ఈ దేహం ఒక మలినపు కొంప. దీనివల్ల సుఖం లేదు. ఆత్మవైపులో చేరితే ఆనందం లభిస్తుంది.Head-Heart-Hand ఈ మూడింటిని ఆధారంగా తీసుకోవాలి. హదయంలో భగవంతుని నిలుపుకో, తలతో దైవాన్ని చింతించు. చేతులతో పనిచెయ్యి.
See no Evil-See what is good
Hear no evil-Hear what is good
Talk no evil - Talk what is good
Think no evil - Think what is good
Do no evil - Do what is good
This is the way to God
(దే.యు.పు.29)
బుద్ధి అనే సూర్యునిచేత దుర్భావాలనే సముద్ర జలాన్ని సద్భావాలనే ఆవిరిగా మార్చుకొని,సత్యమనే మేఘం నుండిప్రేమజలం కురుస్తుంది. చివరకి అది అనుగ్రహ సాగరంలో లీనమైపోతుంది.
(స.సా.జూలై 2000 పు.196)
బుద్ధి అంటే ఏమిటని ప్రత్యేకంగా విచారణ చేసినప్పుడు చదువుకున్నవాడుగాని, చదువులేనివాడుగాని, మూర్ఖుడు గాని, మేధాశక్తి గలిగినవాడుగాని బుద్ధి అనగా విచారణ శక్తి అంటున్నారు. నిత్యానిత్య విషయ పరిశీలన బుద్ధియొక్క స్వభావము అన్నారు. ఇది సరియైన అర్ధము కాదు. ఈ బుద్ధికి ఐదు అంశములుంటున్నాయి. ఏమిటీ ఐదు అంశములు? శ్రద్ధ, ఋతము, సత్యము, యోగము, మహత్తత్వము. ఈ ఐదు అంశములతో కూడిన బుద్ధిని కేవలం నిత్యానిత్య పరిశీలనా శక్తి యని చెప్పటం ఎంత పొరపాటు! శ్రద్ధకు రెండు విధములైన శక్తులుంటున్నాయి. ఇది గాఢ విశ్వాసముతో కూడినది. ఈ విశ్వాసముస్థిరత్వముతో ఉండినది. ఋతము నుండి ఆవిర్భవించిన వాక్ స్వరూపమే సత్యము. ఈ సత్యము తరువాతయోగము. ఏమిటీ యోగము? సర్వేంద్రియములను అరికట్టే తత్యము, సర్వేంద్రియములను స్వాధీనము చేసుకునే తత్వము యోగము. ఇంక, మహత్తత్య మనగా ఏమిటి? ఇది చాలా పవిత్రమైన స్థితి. దివ్యమైన, నవ్యమైన స్థితి. ఇది ఇట్టిది, అట్టిది అని ఎవరూ వర్ణించలేరు. కనుక శ్రద్ధతో, ఋతముతో, సత్యముతో, యోగములో, మహత్ తత్వంలో కూడినది బుద్ధి యొక్క స్వరూపము. ఇలాంటి సర్వ శక్తులతో కూడిన బుద్ధిని కేవలం నిత్యానిత్య విషయ పరిశీలనతో పోల్చితే బుద్ధిని ఎంత చులకన చేసిన వారమౌతాము. ప్రతి పదమునకు సరైన అర్థమును గుర్తించుటకు ప్రయత్నించాలి.
(ద.స.98 పు. 50/51)
బుద్ది అనగా ఏమిటి? ఇది విచక్షణా జ్ఞానముతో కూడినది. ఇది మనస్సుకు అతీతమైనది. మొట్టమొదటిది దేహము. దానికి పైభాగమున ఉన్నవి యింద్రియములు, దానికంటే పైభాగమున ఉన్నది మనస్సు. దాని కంటే పైభాగమున ఉన్నది బుద్ధి, బుద్ధి పైభాగమే ఆత్మ.కనుక ఆత్మకు ఆతి సమీపములో మండుటం చేత ఆత్మ ప్రభావము, ప్రకాశము బుద్ధి పైన పడుతూ ఉంటుంది. మనస్సుకు అతీతమైన తత్వము బుద్ధి. ఈ బుద్ధితో కొంతవరకు విచారణ చేసి మానవుడు బుద్ధిగా బ్రతకాలి. అప్పుడే నిజమైన ఆత్మతత్వము అర్థమవుతుంది.
(స.ది.పు.87)
"బుద్ది గ్రాహ్య మతీంద్రియం" అన్నట్టుగా, బుద్ధిని ఒకప్రత్యేకమైనటువంటి స్థానమునందు అనుభవిస్తూ వస్తున్నారు ప్రజలు. ఇది ఒక స్పటికము వంటిది. దీనికి స్వప్రకాశమన్నటువంటిది శూన్యము. ఆత్మకు సమీపంగా ఉండటంచేత, ఆత్మయొక్క ప్రకాశముచేత ఇది ప్రకాశిస్తూ ఉంటుంది. ఆత్మయొక్క ప్రకాశము బుద్ధి పైన పడటంచేతనే, బుద్ధి ప్రకాశమైనటువంటిదిగా మనకు గోచరిస్తూ వస్తున్నది. చంద్రుడు స్వప్రకాశకుడుకాడు.సూర్యుని యొక్క కిరణములు చంద్రునిపైన పడటంచేత, చంద్రుడు కూడను ప్రకాశవంతుడుగా మనకు గోచరిస్తున్నాడు. అదే విధముగనే, బుద్ధికి స్వప్రకాశమున్నటువంటిది లేదు. కత్తిని పదునువలె, మనస్సును బుద్ధి అంటి వుండును.
(ఆ.రా.పు.156)
చిత్త శుద్ధి లేని రిక్త సాధకునకు
ఆత్మ తత్త్వమెట్లు | అబ్బునొక్క
ఆత్మ తత్వ మబ్బు అతి శుద్ధ బుద్ధికే
సత్యమైన బాటసాయిమాట
(సా.పు.381)
మీహృదయమే మిమ్ములను గమ్యస్థానం చేరుస్తుంది. మీ హృదయాన్ని నమ్మండి. నిర్మల హృదయం బుద్ధికి అవతల వుంటుంది. అదే మిమ్ములను ప్రేరేపిస్తుంది.
(సా...పు 522)
మేధస్సుకంటే బుద్ధి చాలా శక్తివంతమైనదనే సత్యాన్ని విద్యార్థులు గుర్తించాలి. ఇది సామాన్యమైన బుద్ధికాదు. అస్థస్వాస్థ అనే ఆసక్తి స్థిరత్వములతో కూడిన శాంతియే యీ బుద్ధి. ఋతము సత్యము రెండింటితో ఏకీభవించినదే యీ బుద్ధి. యోగము మహత్తత్వము రెండింటితో కూడినదే ఈ బుద్ధి. బుద్ధి అనగా ఆలోచనా శక్తి విచారణ శక్తి వివేక శక్తి విజ్ఞాన శక్తి మాత్రమే కాదు, విచక్షణా శక్తితో కూడిన విచారణశక్తి,.
(బృత్ర.పు.116)
బుద్ధి ఆత్మకు సమీపముగా వుంటుంది. కనుక ఆత్మయొక్క ప్రకాశము ఆత్మ యొక్క ప్రభావము ఈ బుద్ధిని సరిగా చేయటానికి అవకాశముంటుంది. ఆత్మశక్తి ఇంచుమించు 90 శాతము బుద్ధిమీదకు రావటానికి అవకాశముంటుంది. ఈ బుద్ధి ప్రభావము మనస్సు పైన, మనస్సు ప్రభావము ఇంద్రియములపైన, ఇంద్రియముల ప్రభావము దేహము పైన ప్రసరిస్తుంది. దశోపనిషత్తులందు ప్రధానమైనది. తైత్తిరీయోపనిషత్తు,ఆది బుద్ధిని ఒక పక్షిగా వర్ణించింది. దాని శిరస్సు శ్రద్ధకుడి రెక్క ఋతము, ఎడమరెక్క సత్యము, మధ్యనున్న దేహము మహత్తత్వము. తోక యోగము అని నామకరణ చేసింది. కనుక బుద్ధి ఒక భాగము కాదు. ఋతము సత్యము. మహతత్త్వము యోగములతో కూడినట్టిది. బుద్ధి సామాన్యమైనది కాదు. ఇన్ని అంగములలో కూడినపుడే ఇది పరిపూర్ణస్వరూపాన్ని పొందుతుంది.
(బృత్ర.పు, 95/96)
బుద్థి నిలకడలేని మనుజుడు –
పోందజాలడు శాంతి శాంతిసుఖములు
విషయసుఖముల వేంట పరుగిడు-వెఱ్ఱిజీవికి
ఎచటశాంతి? కన్ను వివిప్పి చూడరోరన్నా!.
(శ్రీసత్యసాయి విద్యార్థి వాహిని పు 54)