విద్యార్థులారా! ఆదర్శముకోసము మనము జీవించాలి కాని అన్నము కోసము కాదనే సత్యాన్ని గుర్తించాలి. ఆదర్శము శాశ్వతమైనది. ఇట్టి ఉత్తమమైన ఆదర్శముచేత ఎంతైనను మున్ముందు అభివృద్ధి కాగలరు. "కాకి నగచు కలకాలము తిరగక హంస వైక్షణము ఆడుమురా." ఆదర్శవంతమైన విద్యార్థులుగా ఒక పది సంవత్సరములు బ్రతికినా చాలు. ఆదర్శవంతమైన జీవితము అనుభవించటానికి దేశాభిమానము, ఆత్మాభిమానము అత్యవసరము. పుట్టిన ప్రతి వ్యక్తి మొట్టమొదట గుర్తించేది తల్లిని తండ్రిని, తల్లిని. తండ్రిని గుర్తించని వ్యక్తి యీ జగత్తులో ఉండడు. దేశాభిమానము. ఆత్మాభిమానము గుర్తించినవాడే నిజముగా తల్లితండ్రులను గుర్తించినవాడౌతాడు. మనదేశమంటే ఎలాంటిది. ఎంత పవిత్రమైన దేశము. ఎంత దివ్యమైన దేశము, ఎలాంటి ఆదర్శవంతమైనదేశము. ఎంతటి ప్రేమపూరితమైన దేశము, ఎంతటి విశాలమైన దేశము? విద్యార్థులు మొట్టమొదట మనదేశము యొక్క విశిష్టతను గుర్తించాలి.
(బృృత్ర. పు, ౧ ౦)
ఎట్టి విద్యలు, నియమము లెరుగనట్టి
పక్షి, జంతువు, పశువులు, పరమమైన
నీమమును బూని, జీవించనేర్చియుండ
తెలివి గలిగిన నరునకే తెలివిలేదే!
(సా॥ పు. 6)
కోటీశ్వరులకైన కూడు గుడ్డయోగాని
బంగారమును తిని బ్రతుకలేరు
కాలమే గాకున్న కఱ్ఱయే పామగు
కలసి వచ్చిన మట్టి కనక మగును
పండితుడొక చోట పశువుగా మారు
మూర్ఖుండొక తరిని మునిగమారు
ధనవంతు నొకపరి దారిద్ర్యదేవత
ప్రేమించి వాని తో వరుసలాడు
ప్రాకులుడుటయేగాని ప్రాప్తియే లేకున్న
దమ్మిడీయైనను దరికి రాదు.
వద్దురా బాబు, వద్దు ఏ ఆశ హద్దు మీరి
బుద్ధి కలిగి జీవించుమో పెద్దమనిషి!
(ద. య. స.. 98 పు. 48)