దేహములతోకలసియుండిననూఆత్మగుణధర్మాలకుఅతీతమైయుండును.దేహములోనిబాల్య,కౌమార, యవ్వన, వార్థక్యాదు లెట్టులో దేహ తదనందరము ప్రాప్తి కూడ అట్టిదే. ధీరుడు ఇందుకై శోకింపడని, కృష్ణుడు గట్టిగా రథమును వూపించి చెప్పెను.
దానికి అర్జునుడు సందేహ మనస్సుతో ప్రశ్నించును: "స్వామీ! అవస్థాంతరాల వల్లనే దేహాంతరాలు కూడనూ, అని ఆంటిరి కదా! కాని, అవస్థాంతరాలలోని విషయములు జ్ఞాపకమందుండునుకదా! దేహాంతరాల విషయములు జ్ఞాపకమందుండవే! నీవు చెప్పినది దీని కెట్లు పొసగును ?" “యేకదేశీ అంతమే గ్రహించవలెను.
సర్వాంశ గ్రహణము సరిపోదు. అవస్థలు మారినా, ఆత్మ మారదు! అట్లే, దేహములు మారినా ఆత్మ మారదు! దృష్టాంతములో ఇంతవరకే గ్రహించవలెను."
కానీ, అర్జునుడు మరో అంశానికి దిగినాడు. ఇది అర్జునున కొక్కనికే కాదు. సామాన్య మానవులకు ఈలాంటి అనుమానములు వచ్చుననే భగవంతుడు "ధీరస్తత్ర సముహ్యతే" అంటూ ఆ అనుమానమునకు అక్కడికక్కడే వెంటనే సమాధానము తెలిపెను. "అర్జునా! అవస్థాంతరాలలో బుద్ది కొంతవరకు జ్ఞాపకము పెట్టుకోగలుగుతుంది, మరణకాలములో అనగా, దేహాంతర పరిస్థితులలో బుద్ధి వికలమై పోతుంది. ఆ దెబ్బతో గడచిన వన్సీంటిని ఒక్క పెట్టున మరచి పోతుంది. ఎరుక మరపులు బుద్ది ధర్మము కాని ఆత్మధర్మము కాదు. ఇప్పుడు మరొక విషయము తీసుకో: "అనగా నీకు పాతిక సంవత్సరముల వయస్సు అనుకో, గడచిన పది సంవత్సరముల మునుపు యేదో వక దినమున నీవు యెక్కడుంటివని అడిగిన నీవు చెప్పలేవు, కాని, నీవుండియుండుట సత్యమే కదా? నేను లేనని మాత్రము అనలేవుకదా? అటులనే దేహాంతర విషయాలు కూడనూ! నీవున్నావు కాని విషయములు మాత్రము జ్ఞాపకమందు లేవు. ఈ విషయమందే బుద్ధిబలము కలవాడు భ్రమ చెందడు. అట్టివానినే జ్ఞాని" అందురు. ఆత్మ పోయేది కాదు; దేహము వుండేది కాదు. పోనీ వారి మరణము కోసమైనా దుఃఖించినవారి ఆత్మకేమైనా సంతోషమా! అది మరింత పిచ్చిమాట! ఆత్మకు యేమి చేసినా దుఃఖము లేదు.
(గీ.పు, 27/28)
(చూ|| పురుషార్థము)