నేనెవరు

మానవుడు తనను తాను గుర్తించుకునే నిమిత్తమై భగవంతుడు అతనికి పవిత్రమైన బుద్ధిని అనుగ్రహించాడు. బుద్ధి పరిశుద్ధమైన అద్దము వంటిది అద్దమునకు ఒకవైపున రసాయనం పూయబడినప్పుడు దానిలో మీరు మీ ప్రతిబింబమును చూసుకోవచ్చు. రసాయనము పూయని అద్దమును ఎదురుగా పెట్టుకుంటే దాని వెనుక భాగమున ఉన్నదేదో కనిపిస్తుందిగానిమీకు మీరు కనిపించరు. అదేవిధంగామీరు స్వస్వరూపాన్ని గుర్తించాలంటే మీ బుద్ధి అనే అద్దమునకు ఒకవైపున ప్రేమ అనే రసాయనమును పూయాలి. అయితే మీరు బుద్ధి అనే అద్దమును మాత్రం ఎదురుగా పెట్టుకున్నారు గానిదానికి ప్రేమ అనే రసాయనమును పూయటం లేదు. కనుకనేమీరు స్వస్వరూపాన్ని దర్శించలేక పోతున్నారు. రసాయనం పూయని అద్దంలో మీకు ఇతరుల ముఖం కనిపిస్తుందిగానిమీ ముఖం ఎలా కనిపిస్తుంది. కనుకనేఈనాడు ప్రతి ఒక్కరూ "ఎవరండీ మీరుఎక్కడి నుండి వచ్చారు?" అని ఎదుటివారిని ప్రశ్నిస్తున్నారేగానిమొట్టమొదట "నేనెవరుఎక్కడి నుండి వచ్చాను?" అని తమను తాము ప్రశ్నించుకోవడం లేదు. మొట్టమొదట "నీవెవరు?" అనే ప్రశ్నవదలిపెట్టి  నేనెవరుఅనే విచారణను ప్రారంభించాలి. ఇతరుల దోషాలను చూడటం మానివేసి మీలోని దోషాలను గుర్తించుకోవాలి. భగవంతుడు మీకు బుద్ధిని అనుగ్రహించినది. మిమ్మల్ని మీరు చూసుకోవడానికే గానిపరులయొక్క దోషాలను చూడటానికి కాదు.

(స.సా.మే2000 పు. 150/151)

 

నే నెవడు అని విచారణ చేసినచో వృత్తులన్నియూ పోవును. ఎట్టి వృత్తులు వచ్చిననూ నేనెవరను ప్రశ్న వేసుకొన్న అన్ని వృత్తులు బుడగలవలె నలిగి పోవును. ఇట్టి సాధన రమణ మహర్షి సాధించెను. అదే మార్గమును తన శిష్యబృందమునకు బోధించెను. ఆదియే సులభమార్గముఅనగా సర్వమును బ్రహ్మమేదానికి వ్యతిరేకమైన దేదియు లేదు అని అర్థము. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యమును జపించిననూ ఆజ్ఞానము పటాపంచలగును.

(జ్ఞావా.పు. 18/19)

 

నే వరుఈ కర్తృత్వ మేమిటిఈ భోక్తృత్వ మెందులకుజనన మరణాదు లెందుకు కలుగుచున్నవినాకీ సంసార మెట్లు ప్రాప్తించినదిఇందుండి ముక్తి కలదాఇత్యాది విషయ విచారణయే మహాతపస్సని ఋషులు చెప్పెడివారు.

 

"నేను యెవరుఅని ప్రశ్న జనించుటకు మృత్యు విషయమే మూలకారణము. కావున మృత్యువిషయమును విస్మరించరాదు. అలక్ష్యము చేయరాదుభయపడి పారిపోరాదుఅజ్ఞాన ప్రప్రథమ సోపానము. అమాయకపు జీవితానికి అంకురార్పణము. మాయకు మహాబలముమానవత్వము యొక్క పరమరహస్య మంతయూ మృత్యువిచారముతోనే ముడిపడి యున్నది. దైవ చిద్విలాస మంతయూ మృత్యువు యొక్క పరిశీలనలోనే ప్రకాశించు చున్నది.

(.శా..పు.11/12)

 

 

 

"చూడండి. మీరు ఎదుటి వ్యక్తిని "నీవెవరు? అని ప్రశ్నిస్తున్నారేగాని. నేనెవరు? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం లేదు. "నేను" ఎవరో తెలిస్తే మీకంతా తెలిసిపోతుంది. "నీవెవరు?" అని అడిగినప్పుడు "నేను అనిల్‌ కుమార్‌ను, గుంటూరు వాడిని, ప్రొఫెసరు" అని నీ పేరును, నీ ప్రాంతమును, నీ వృత్తిని గురించి చెబుతావు. ఇది సరియైన జవాబు కాదు. " నేనునేనే అన్నదే సరియైనసమాధానం. ఈ నేనుఅనేదానివినీవు తెలుసుకుంటే ప్రతి ఒక్కరిలో ఉన్న నేనువీకు తెలిసిపోతుంది. ఒకటి ప్రక్కన సున్నలు పెట్టేకొలదీ ఆ సున్నలకు కూడా విలువ పెరుగుతుంది. ఆ ఒకటియే నేను దానిని తెలుసుకోవాలి. నీవు ఎంత తెలుసుకున్నప్పటికీ నీవెవరో నీకు తెలియక పోతే ఏమి ప్రయోజనం?"

(స.సా.మే 2002 పు. 158)

 

(చూ|| ప్రవృత్తి)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage