వృద్ధుడైన దశరథుని సేవలు చేస్తూ, పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దారు. రాముడు తండ్రికి ఏ మాత్రము శ్రమ కల్గించేవాడు కాదు. ఒకనాటి రాత్రి దశరథునికి దాహం వేసింది. ఒక జగ్గును తీసుకొని టంబ్లర్ లోకి నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు. జగ్గును పట్టుకునేటప్పటికి చేయి అదిరింది. ఇక దశరథుడు నిద్ర పోలేదు. "నా దేహమే నా అదుపులో లేనప్పుడు ఇంక రాజ్యపాలన చేసే అధికారం నాకు లేదు" అనుకున్నాడు. చూశారా! ఆనాటి రాజులు ధర్మాన్ని ఏ రీతిగా అనుసరిస్తూ వచ్చారో! కాని, ఈనాటి వారు మాత్రం వ్రాయటానికి చేతులు రాకపోయినా, ఫైల్స్ చూడటానికి కన్నులు లేకపోయినా ఇంకా రాజ్యము నేలాలని ఆశిస్తున్నారు.
(శ్రీ భ. ఉ.పు.61)