రామ / రాముడు

రామ అనే పదమునందు "ర" - - అను మూడు బీజాక్షరములు ఉన్నవి. వాటిలో"ర"  సూర్య బీజము; చంద్రబీజము, అగ్ని బీజము. ఈ మూడింటియందును ఉన్న అంతరార్థమేమిటి? " " అనే సూర్యబీజము, మనయొక్క అజ్ఞానమనే చీకటినంతా దూరము చేస్తుంది. ఇంక చంద్రబీజమైన , మనకున్న తాపమును చల్లార్చుతుంది. అనే ఆగ్ని బీజము, మన పాపమునంతా భస్మముచేస్తుంది. కనుక ఒక్క రామనామమే పాపమును, తాపమును, అజ్ఞానమును, మూడింటిని కూడను నాశనము చేస్తుంది. కనుకనే, రామనామముకంటెను మించినది లేదని వాల్మీకి మహర్షి లోకానికి చాటుతూవచ్చాడు. ఆమహాకవి రామ నామ మహిమను. ఇంకా సులభమార్గంగా సామాన్య ప్రజలకును అర్థమయ్యేరీతిగా ఇట్లు తెలిపినాడు. "ర అను అక్షరము ఉచ్చరించునపుడు నోటిని తెరిపించి, ఆ ద్వారమున మనలోనున్న ఎల్లపాసములనూ బయటకు పంపిస్తుందట! అను అక్షరము, బయటికిపోయిన పాపములు, మరల లోనికి రాకుండా, ఆద్వారమును మూసివేస్తుందట!

(ఆ.రా.పు.14/16)

ధర్మశాస్త్రము, విద్యార్థి, గృహస్థు, ఆర్జకుడు, యజమ ని,సేవకుడు , సాధకుడు, సన్యాసి మొదలగు అన్ని తరగతులవారి నడవళ్ళను, వారి వారి యంతస్తులకు తగువిధమున నిర్ణయించు చట్టము. ప్రజలు ఆ చట్టమును పాటింపక, తామీ లోకమునకు వచ్చిన ప్రధాన ప్రయోజనమును మరచి, తమకు విధివిహితములైన కృత్యములు చెరచి తప్పుదారులు పట్టినప్పుడు వారిని మరల మంచిమార్గమునకు మరలించుటకై భగవంతుడవతరించుచుండును. అనగా, మానవరూపమున వచ్చి చెదరి పోయిన ధర్మమును చక్కబరచునని భావము.

 

భగవద్గీతలో "ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అన్న భగవద్వాక్యమునకర్ధమిదే.. కొందరు పండితులు రాముడు గొప్పవాడనీ, కాదు, కృష్ణుడు గొప్పవాడనీ వాదములు చేయుచుందురు. కాని భగవదవతారములలో కొద్ది గొప్పలు లేవు. ఆతెరగు వాదమంతయు, ఒక రకమైన మాటల సర్కస్: పండితులు తమ యానందముకొరకును, ప్రజా ప్రకటనము కొరకును ప్రదర్శించు పాండిత్యపు కుస్తీపట్లు. ఇక్కడగాని, మరియెక్కడగాని అవతార మేరూపములో వచ్చినను ఆరూపము భగవంతునికి భిన్నము కాదు. దైవము అవిభాజ్యమైన యొక సత్యము.

రాముడు మాయామానుష రూపముతో ఆవిర్భవించిన యవతారము. ఆయన బాల్యమునుండియును ధర్మమునకు బద్దుడై, నిత్యకృత్యములందును ధర్మమును పాటించెను. ఆయన రూపము దాల్చిన ధర్మము. ఆయనలో అధర్మపు జాడయైనను లేదు. రాముని దైవత్వము ఆయన శాంతగుణములోను, కరుణారసములోను ప్రకటితమైనది. నీవు రాముని ప్రేమింపుము; నీ హృదయ ప్రేమభరితమై, యెల్లప్రాణులను నీవు ప్రేమింప నేర్తువు. రాముని చరిత్రమును పఠింపుము; పనికిమాలిన చింతలు పటాపంచలై నీ చిత్తము ప్రశాంతికి నిలయమగును. విశ్వామిత్రుడు తాటకను వధింపుమన్నప్పుడు రాముడు వెంటనే విల్లెత్తక "స్త్రీని వధించుట యధర్మ"మని ఆ మునీంద్రునితో వాదించెను. అప్పుడు విశ్వామిత్రుడు “రామా! ఇందధర్మమేమియు లేదు. ఆ రాక్షసికి శాపమొకటి యున్నది. ఆ శాపము నీచేతి బాణహతి చేత తీరిపోయి, అది సుఖపడును. కావున నీవు సంకోచింప పనిలేదని సమాధానము చెప్పెను. అప్పుడు రాముడు బాణము ప్రయోగించినాడు. . రాముని ధర్మనిరతికిని, దయార్ధ్రహృదయతకును ఇది యొక తార్కాణము.
రాముడు సత్వగుణ ప్రధానుడు. ఆ మహా వీరుడు తనకై తాను కయ్యమునకు ప్రేరేపి, యెవ్వనినిగాని వధించినది యెన్నడును లేదు; సరిగదా! అపరాధికి ఆత్మరక్షణ కెన్ని యవకాశము లియ్యదగునో అన్నియు నిచ్చియున్నాడు. ఏరోధి తమ్ముడైన విభీషణుని శరణాగతి నంగీకరించుటయే కాక, రావణుడు వచ్చి, తన దుష్కృత్యమునకు పశ్చాత్తాపమును వెలిపుచ్చునేని, అతనిని గూడా అంగీకరింతునని ప్రకటించినాడు. ఆయన సర్వసముడు. జాబాలి మొదలగు - ఋషులతో సమముగా వానరులకు రాక్షసులకు సైతము ధర్మసందేశము నందంచెను.


రాముడు వేదోక్త ధర్మమును చక్కగా పాటించినవాడు. శ్రుత “సత్యం వద” (సత్యమునే చెప్పుము) అని శాసించనది. రాముడు ప్రలోభనము లెన్నియున్నను వాటిని నిరాకరించి, సత్యమునేగాని అసత్యము నెప్పుడును చెప్పలేదు. “ధర్మం చర” (ధర్మమునందే వర్తింపుము) అని శ్రుతి వాక్యము. రాముడు ధర్మమార్గము నేపట్టునను తప్పలేదు. ఆయన తండ్రి వాక్యమును పాలించుటకు 14 సంవత్సరము అడవులలో నివసింపవలసి వచ్చినది. ఆ పదునాలు గేండ్లలో - ఒక్క మారయినను పట్టణములో గాని, పల్లెలో గాని యడుగు పెట్టలేదు. సుగ్రీవపట్టాభి షేక సమయమున కిష్కింధకుగాని, విభీషణుని పట్టాభి షేక మప్పుడు లంకకు గాని ఆయన పోలేదు. కొలది దినములు మాత్రమే కొరతగా పదునాలు గేండ్లును నిండవచ్చినవనియు, తన పట్టాభి షేకమునకు రావలసినదనియు విభీషణుడెంతగా ప్రార్థించినను, రాముడు తనకు మారుగా లక్ష్మణుని పంపెనే గాని తాను కదలలేదు. ఆయన ప్రతిజ్ఞా పాలనదృఢవ్రత మట్టిది.

రాముడు దర్మస్వరూపము; కృష్ణుడు ప్రేమ స్వరూపము. రాముడెట్టి పరిస్థితిలో ను ధర్మము నేమరువాడు కాడు. ఆయన యరణ్యమునకు బయలుదేరినప్పుడు మరణవేదనలో నున్న దశరథుడు, “సుమంత్రా! రధము నాపుమాపు" మనుచు వెంబడించెను. రాముడు, “రథ మాపవల” దని సుమంత్రునాజ్ఞా పించెను. సుమంత్రుడు కర్తవ్యము తోపక నిశ్చేష్టితుడయ్యెను. అది గమనించి రాముడు - "సుమంత్రా! నన్నడవులకు కొనిపోవలసినదిగా నిన్నా జ్ఞాపించినవాడు రాజుగానున్న దశరథుడు. అపుడు, నీవాయన మంత్రివి. కనుక, ఆయన యాజ్ఞను పాలించుటే నీకు ధర్మము. ఇపుడు రధము నాపుమనుచున్నవాడు దుఃఖములో మునిగియున్న నా తండ్రి. దు:ఖాతిశయముచేత మతిచెదరిన వారి మాట పాటింపదగినది కాదు” అని తెలియజెప్పి, “రథము పోనీ” మ్మన్నాడు.రాముడు ధర్మసమ్మతము కాని మాట వచింపడు.
కైకేయి అనిర్దిష్టములైన రెండు వరములు కోరుటకు సిద్ధముగా నున్నది. దశరథుడు తన తల పైబడిన మునిశాపము కారణముగా పుత్ర వియోగదుఖముతో మరణించుటకు సిద్ధముగా నున్నాడు. దైవకార్యమునకు తోడ్పడుటకు వానరులు సిద్ధముగా నున్నారు. లోకారిష్టమును తొలగించుటకు తగిన కారణము కల్పించుటకై, సీత భూమి నుండి యుద్భవించి సిద్ధముగా నున్నది. ఈ పాత్ర సామగ్రితో రంగమంతయు అవతారమునకు పూర్వమే, సూక్ష్మతి సూక్ష్మములైన సూచనలతో సంసిద్ధము చేయబడినది. పూదండ భిన్నభిన్నవర్ణములను, పలుతెరగుల పరిమళములును గల వివిధ కుసుమములతో కూర్చబడినట్లు, శ్రీరాముని యద్భుతచరిత్రమును దెల్పు ఈ దివ్యకథయు ఒకవరము, ఒక యాశీర్వాదము, ఒక శాపము అను భిన్న భిన్న ఘట్టములతో సంధానింపబడినది.

మానవుడు కష్టము లెట్లనుభవింపవలెనో లోకమునకు తెలుపుటకై రాముడు కష్టము లను భవించె ననువారు కొందరున్నారు. కాని, అది యవతారతత్వము తెలియని మాట. ఒక రాజు తన సౌధములో నాటక ప్రదర్శనమొకటి ఏర్పాటు చేసి, అందులో - వినోదార్ధము - తానొక బిచ్చగాని వేషము ధరించి, అచ్చము బిచ్చగానివలెనే అభినయించినాడనుకొనుడు. అపుడతడు బిచ్చగానివలె బాధలును అనుభవించినాడనియే మీరనుకొందురా. అందు, అభినయమే కాని అనుభవముండదు. ఆ వేషము విప్పగనే మరల రాజు రాజే. రాముడా నందమయుడు. ఆనందమే రాముడు. బాధపడునేని అతడు రాముడు కాడు. తియ్యగా నుండదేని, అది చక్కెర కాదుగదా! ఇనుపముక్కకు చల్లదనము స్వభావము. ఎఱ్ఱగా కాచినచోనది వేడియెక్కి శరీరమును కాల్చును. ఆవేడి అది ధరించిన వేషము. ఆ వేడి పోగానే అది యెప్పటట్లు చల్లగనే యుండును. అవతార తత్వమును అట్టిదే.

జపతపములు లేకపోయినను, నీవు రాముని వలె పితృభక్తియు, మాతృభక్తియు కలిగియుందువేని రామనామము నిన్ను కాపాడును, లేనిచో రామనామజపము వట్టి పెదవుల కదలిక మాత్రమే యగును. రామధ్యాన శ్లోకములు పఠించునపుడును, రామకోటి వ్రాయునపుడును, మనసును రాముని స్వరూపము నందును, రాముని స్వభావమునందును నిల్పుము. అది నీ మనసునకు స్థైర్యమును, తుష్టిని, పుష్టిని కలిగించును. ఆత్మ విచారజ్ఞానము నలవరచును. ఈ శ్రీరామనవమి దినమున ఈ ధర్మస్వరూపమును మీ యాత్మారామునిగా చేసికొనుడు. ఇదే నా యుపదేశము. ఇదే నా యాశీస్సు.రాజమండ్రి, 1-4-1963. (శ్రీ సత్య సాయి వచనా మృ తము 1964 పు 2-5)

 


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage