మన భక్తులు, మన ఆర్గనైజేషన్‌కు చెందిన వారందరూ ఆచరణ, ఆచరణ ఆచరణ. Be good, See good, Do good. That is the way to God-. చాలమంది ఆడంబరాలు, ప్రయోజనమేమిటి? కొంతమంది లెక్చెర్లు, లెక్చర్లు - ఒట్టిగాస్! ఇవన్నీ పుస్తకాలు చదివేది, నోటు చేసుకునేది లెక్చెర్లు చెప్పేది. ఆచరణ చూస్తే జీరో, లెక్చర్లు చూస్తే హీరో". (సా. పు 328)
భగవద్గీత కాని, బైబిల్ కాని, ఖురానుకాని, గ్రంథ సాహీబ్ కాని ఇంక ఏ పవిత్ర గ్రంథములైనప్పటికి పారాయణ నిమిత్తమై ఆవిర్భవించలేదు. ఆచరించే నిమిత్తమై అందించినట్టివి. మనము ఆచరణలో పెట్టాలి. శ్లోకాలు చదివి ప్రయోజనమేమిటి? ఎన్ని వాఖ్యానములు చేసి ప్రయోజన మేమిటి? "గంగ గోవు పాలు గంటే డైనను చాలు, కడివెడైన నేమి ఖరముపాలు". భగవద్గీతను పారాయణము చేస్తూంటాము. ఏడునూర్లు శ్లోకాలు కంఠస్థము చేస్తున్నారు. ఇది భక్తి అనుకుంటారా? కాదు కాదు. ఇది ఆడంబరమైనటువంటి తత్త్వము. ఈనాడు ఆకార మానవునికంటె, ఆచార మానవుడు అత్యవసరము. (బృృత్ర.పు ౧౯౭)
భ్రమకు, బ్రహ్మకు ఉన్న వ్యత్యాసాన్ని మీరు గుర్తించాలి. ఏకత్వమును అనేకత్వముగా విభజించటమే భ్రమ; అనేకత్వమును ఏకత్వముగా స్వీకరించడమే బ్రహ్మ. కనుకనే వేదము
"సహనా వవతు సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై"
అని ఏకత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చింది. ఏమిటి దీని అర్థం?
కలసి మెలసి పెరుగుదాం. కలసి మెలసి తిరుగుదాం
కలసి మెలసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం
కలసి మెలసి కలత లేక చెలిమితో జీవించుదాం.
వేదము బోధించే ఇట్టి పవిత్రమైన, నిత్యసత్యమైన సూక్తులను మీరు గుర్తించి ఆచరణలో పెట్టాలి. సర్వ జీవులకు ప్రాణసమానమైనది. వేదము. "వేదోఖిలో ధర్మమూలం", సర్వ ధర్మములకు మూలమైనది వేదము. ఇది అనంతమైనది విశాలమైన భావములతో కూడినది. జాతి, మత భేదము లేమాత్రము లేనిది. ఇట్టి పవిత్రమైన వేదములో ఉన్న సత్య సూక్తులను ఎవ్వరూ సరిగా గుర్తించటం లేదు. ఎవరికి తోచిన అర్థాన్ని వారు చెప్పుకుని కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు. మీ జీవితం సార్థకం కావాలంటే వేదం లోని సత్యసూక్తులను ఆచరణలో పెట్టాలి. "సత్యాన్నాస్తి పరో ధర్మః” సత్యమనే పునాది దృఢంగా ఉన్నప్పుడే ధర్మమనే భవనం నిలుస్తుంది. ఎలాంటి పరిస్థితియందైనా అసత్యమాడితే దానివల్ల మున్ముందు అనేక బాధలకు గురి కావలసి వస్తుంది. "ముందున్నదిరా తొందరలోనే ముసలితనమ్మను ముసళ్ళ పండుగ!" ఈ దేహం దేవుని వరప్రసాదం. దీనిని సద్వినియోగపర్చుకోవాలి. "దేహొదేవాలయః ప్రాక్తో జీవో దేవ సవాతనః". ఈ దేహంలో దేవుడు నివసిస్తున్నాడు. జీవునికి,దేవునికిగలవ్యత్యాసంఏమిటి?వ్యష్టియేజీవుడు,సమిష్టియేదేవుడు.కనుక, మీరు వ్యష్టితత్త్వం నుండి సమిష్టి తత్త్వంలోకి ప్రవేశించాలి. అప్పుడే మీకు దైవత్వం ప్రాప్తిస్తుంది. ‘ఈశావాస్య మిదం జగత్ , ఈశ్వర స్సర్వ భూతానాం , ఏకం సత్ విప్రా: బహుధా వదంతి" మున్నగు పవిత్రమైన వేదసూక్తులను మీరుఅర్థం చేసుకోవాలనుకుంటే మొట్టమొదటసద్గుణాలనుపెంచుకోవాలి.సదాచారములనుఅలవర్చుకోవాలి:సత్ప్రవర్తనతోజీవించాలి. (స. సా.. నం. 99 పు.320/321)
వ్యాసుల వారు అన్ని తెలివితేటలు, విద్యావినయములు కలిగిన వాడైనప్పటికిని తన వ్రాతలయందు తనకే నమ్మకం లేక పోయింది. కారణ మేమిటి?ఆచరణమందు,అనుష్ఠానమందుఏమాత్రము కూడను అనుభూతికి రాలేదు. చక్కెరకు చక్కరతీపి ఏమాత్రము తెలియదు. జిహ్వ మాత్రమే చక్కెర తీపి తెలుసుకోగలదు. నాలుకకు అనుభవముంది. అదే విధంగా భగవంతుని గుణగణ విశేషములను వర్ణిస్తూ వచ్చాడు. కాని తనయొక్క ఆనందానుభూతిని అందుకోలేక పోయాడు వ్యాసుడు. ఆదే విధంగానే మనం కూడ పిల్లలకు బోధించవచ్చు. కాని ఆ బోధించినటువంటి మనలో జీర్ణమైనపుడే ఈ బోధించే అధికారం. కాని ఈ బోధించిన దానికి తగినటువంటి ఫలితాన్ని మనం అందుకోటానికి అవకాశం ఉంటుంటాది. కనుక మనం ఏది చెప్పినా ప్రీతి పూర్వకంగా వారి భవిష్యత్తును హృదయమునందుంచుకుని శాంతమైనటువంటి భావంతో ప్రేమ తత్త్వంతో వారికి ప్రబోధలు చేయటానికి పూనుకోవాలి. దీనివల్ల ఎంతైనా ఫలితం కొంత అధికంగా ఉంటుంది. (గు. శి.పు.68/69)
పూర్వం భారతీయులందరూ త్యాగానికి పట్టం కట్టారు. న్యాయానికి కంకణం తొడిగారు, ధర్మాన్ని అందలమెక్కించారు, సత్యాన్ని స్వాగతించారు .....కనుక ప్తతి మానవుడు తన శక్తి కొలది ఎదో కొంచెం త్యాగం చేసి తోటి మానవులకు తగిన సహాయం చేయాలి. ఎంతమందినో బాధపడే వారిని చూస్తున్నాము, చూసి జాలి పడుతున్నారు. కానీ ప్రయోజనమేమిటి? జాలిని ఆచరణ రూపంలో నిరూపించి న పుడే అది సార్ధక మౌతుఉంది. (విజదశిమి 1997 అ 11 తేదీ ౯సాయి సేవా ఝరి సె 2012 పు 9)