ఎంతటివాడైనా, ప్రారంభదశలో కీడుచేసిన వారికి తిరిగి కీడు చేయవలెననియు,అపకారముచేసినవారికితిరిగిఅపకారముచేయవలెననియు,తననుఅవమానపరిచిన వానికి తిరిగి ఏదో ఒక విధముగా అవమానము జరుగవలెననియు తలచుట సహజము. అది ప్రవృత్తి లక్షణము. కాని నివృత్తి మార్గమును అనుసరించువానికి ఇట్టి తలంపులు ఉండరాదు. ప్రత్యపకారము మరొక తీరని కర్మ కాగలదు. ఇట్టి దానినే ఆగామి" అందురు. ఉత్తరోత్తరంగా దానిని తిరిగి అనుభవించక తప్పదు. ప్రత్యపకారము వల్ల కర్మక్షయము కాదు. అభివృద్ధి అగును. ప్రత్యపకారము వలన సాధనకు తాత్కాలిక తృప్తి కలుగునేమో కాని, మున్ముందు అది తనను బాధించును. కాన, అపకారికి ఉపకారము చేయుటే తితీక్ష. అది దైవమానవత్వము యొక్క లక్షణము. -
(శ్రీభ.ఉ.పు.11/12)