ఒక "లైబ్రరీ రూమ్" లో లక్షలాది పుస్తకములు ఉండవచ్చును. అయినప్పటికీ ఆ లక్షలాది పుస్తకములలోనిఏ ఒక్క పదమైనా ఆలైబ్రరీకేమాత్రమైనా తెలుసునా? నేటి మానవుడి పరిస్థితి కూడా లలైబ్రరీ రూమ్ మాదిరిగా ఉంటున్నది. ప్రపంచంలో అన్ని విషయాలను అతడు తెలుసుకొంటున్నాడు. అన్ని బోధలు వింటున్నాడు. కాని, ఏ ఒక్కటైనా ఆచరణలో పెట్టుటలేదు. ఆచరణలో పెట్టని విషయాలను ఎన్ని పర్యాయములు విన్నప్పటికీ ప్రయోజనం లేదు. కనుక, ఆధ్యాత్మిక మార్గమును అనుసరించేవారు. ఒకటి, రెండు విషయాలనైనా ఆచరణలో పెట్టాలి. అప్పుడే ఆనందాన్ని అనుభవించ గలరు. అప్పుడే, అనుభవించిన ఆనందాన్ని పదిమందికి పంచగలరు. ఇదే ఈనాడు మనము తెలుసుకొన వలసిన ప్రధాన తత్వం.
(శ్రీ భ. ఉ. పు.126/127)