ఆచరణ చాలా అవసరము.

సాయి సంస్థలలో ప్రతి ఒక్కరూ ఆచరణ ద్వారా సరియైన ప్రచారం చేయండి. మీరు చేస్తూ ఉంటే ఇంకొకరు చూసి దానిని అనుసరించాలి. మీరు చేసి చూపించి ఇతరులకు ఆదర్శాన్ని అందించండి. ఇదే నేను కోరేది. నాకు ఏ విధమైన ఆశ కూడా లేదు. ఐతే దేశాన్ని బాగు పరచాలి. దేశానికి అనుకూలం చేయాలి. బీదలు ఎక్కడైనా ఉంటున్నారు. మీరు ఎక్కడ సేవ చేసినా అది సాయి సేవగా భావించాలి. ఈ విధమైన త్యాగభావాన్ని మీరు అధికంగా పెంచుకోవాలి. ఇక్కడకు వచ్చి నప్పుడు మాత్రమే త్యాగాన్ని ప్రదర్శించడంబయటకు పోతూనే కాంక్షలు పెంచుకోవడం సరియైనది కాదు. ఎక్కడికి వెళ్ళినా సేవాభావాన్ని కలిగియుండాలి.

 

ఈ సేవాభావము చేతనే మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.

(స.సా.ఏ.94 పు.97/99)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage