భగవంతుడు ఏ సమయంలో, ఏ రూపంలో వచ్చి సహాయం చేస్తాడో గుర్తించడానికి వీలుకాదు. ఐతే, మీ హృదయంలో దృఢమైన విశ్వాసం ఉండాలి. మీలో దృఢమైన విశ్వాసం లేకపోతే భగవంతుడు ఏ సహాయమూ చేయలేడు.
(స.సా. అ.99పు.254)
"ఉదాత్తమైన బుద్ధితో, మహోన్నతమైన ఉత్సాహంలోప్రేమ భరితమైన విశాల హృదయంతో, ఆత్మవిశ్వాసంతో, అంతర్యామియైన భగవంతుని పట్ల విశ్వాసంలో నీవీలోకంలో సంచరించు. అప్పుడంతా మంచే జరుగుతుంది. నీవెక్కడ నడచినా నేనక్కడున్నాను. వీవెవరిని కలుసుకున్నా ఆవ్యక్తిలో నేనున్నాను. నేను ప్రతి ఒక్కరిలోను ఉన్నాను. ప్రతి ఒక్కరిలో నుండి నేను పలుకుతాను. నేను అంతటా నిండి ఉన్నాను కనుక నీవు నన్నొక స్థలంలో చూడలేవు. నీవు నన్ను తప్పించుకోలేవు. అంటే నాకు తెలియకుండా ఏదీ చేయలేవు."
(లో.పు.135)
విశ్వాసమే మనకు మిత్రుడు అనేటటు వంటి తత్వమును ప్రబోధించినవాడు విశ్వామిత్రుడు. అనగా, విశ్వమనే ప్రకృతియే మన ఫ్రెండ్ (friend). విశ్వాసమనేటటు వంటిదే మన ఫ్రెండ్ (friend). విశ్వాసముగా వుంటున్నప్పుడు, ఎంత పెద్ద కార్యమైనమ సాధించగలము.
(ఆ.రాపు .266)
"మీలో కొందరు మీకేదైనా ఆశాభంగమైనప్పుడో లేక ఏమైనా యిబ్బంది వచ్చినప్పుడే నాచేత విస్మరింప బడినామని అనుకొంటారు. అయితే అటువంటి అడ్డంకులు మాత్రమే మిశీలాన్ని గట్టిపరచి మీ విశ్వాసాన్ని సుస్థిరంగా ఉంచుతాయి. గోడకు పటం వ్రేలాడ తీయాలంటే పటం బరువును భరించే టంతగట్టిగా ఉందో లేదో అని మేకును గుంజిచూస్తావు. అట్లాగే భగవంతుని రూపమునీ మనోహృదయాలనుండి చెరగి శిధిలాలు కాకుండా ఉండడానికి నీ హృదయాంతరాలలో బిగించిన మేకును (భగవన్నామమును) అచంచలంగా ఉందని నిశ్చయపరచుకోవడానికి గుంజి చూడబడాలి.
(సా.ఆ.పు.86)
"ఆధ్యాత్మిక సాధనలో విశ్వాసము ఊపిరివంటిది. సందేహము సాధన యొక్క పునాదులను సైతం కదలించి వేస్తుంది”. అందువలన దానిని తొలగించాలి. మన పూర్వుల యొక్క విజ్ఞాన సంపదయందు విశ్వాసము కలిగియుండుము. మన మహర్షుల యొక్క స్వయంప్రేరితమైన మనస్సును (Intuition) గాని, తద్వారా వారు కని పెట్టిన గొప్ప గొప్ప విషయాలముగాని నీ అల్పబుద్ధితోశంకించకు. నీయందు నీవు విశ్వాసము ఏర్పరచుకో. ఇటువంటి విశ్వాసము ఏర్పరచుకోవటానికి అనేక సంవత్సరాలు పట్టవచ్చు. ఈ విశ్వాసము జీవితంలో ఉపయోగపడాలంటే, నీమనసులోగల విశ్వాసము నిరంతరాయముగాను, అచంచలమైనది గాను ఉండాలి. సాధనలో ఎదురయ్యే నిరాశా నిస్పృహలవంటి ఆటంకములను, భగవంతుని యందు మనకు గల విశ్వాసమును గట్టిపరచి మనలను ఉన్నత స్థితికి తీసికొని వెళ్ళడానికి ఆయనే కల్పించిన పరిస్థితులుగా ఆత్మసంయమనముతో స్వీకరించాలి.
(వై.పు.328)
జీవాత్మ, పరమాత్మల భావపూరిత అనురాగ సమ్మేళనము గోపికల గాథ యొక్క సారము. వారి హృదయమే బృందావనముగా మారినది. వారిలో కించిత్తైనా దేహభ్రాంతి శేషముగా నిలచలేదు. వారు కృత యుగములో ఋషులు, త్రేతా యుగమందు వానరులు, ద్వాపర యుగమందు గోప గోపికలు. నిజముగా వారు దేవతలే! “దర్శనం పాప నాశనం" "స్పర్శనం సంకట నాశనం", "సంభాషణం సంకట విమోచనం" అనే సూత్రములపై వారికి అమిత విశ్వాసము. నిప్పు స్వర్శనమువలన బొగ్గులోని నల్లదనము నాశనమై ఆది కూడ ప్రజ్వలించు నిప్పుగా మారును కదా?
(స.సా.జులై 78 పు.101)
సచ్చిదానందం కోయంబత్తూరు సాయి సమితి కోఆర్డినేటర్, విశ్వాసమువల్లనే ఇంత విజయాన్ని సాధించాడు. దీనికంతా కారణం విశ్వాసమే. ఈ విశ్వాసమునకు ఏమి కారణమని మనము చూడనక్కరలేదు. విశ్వాసము beyond reason. ఎట్లనగా నీవు తల్లిని ప్రేమిస్తున్నావు. నీవు దేనివల్ల ప్రేమిస్తున్నావు? ఆమె తల్లి అన్న విశ్వాసము వల్లనే ప్రేమిస్తున్నావు. ఆమే నాతల్లి అన్న నమ్మకమే లేకపోతే నీవు ప్రేమించ లేవు. "He is my God" అనే నమ్మకమున్నప్పుడే ప్రేమ కలుగుతుంది. ఈ ప్రేమ ఎట్లు పెరుగుతుంది. అని కొందరు ప్రశ్నిస్తారు. ఈప్రేమ పెంచడానికి ప్రయత్నము చెయ్యనవసరం లేదు. వల్లనే plus-plus- plus అయిపోతుంది. మనము మొక్కను నాటాము ఎట్లా పెరుగుతుందని మనము దీనిని దినమూ సాగదీస్తుంటే అది చచ్చిపోతుంది. కానీ దానికి పోయ్య వలసినటువంటి నీరు, వెయ్యవలసినటువంటి ఎరువు వేస్తుంటే అదే పెరిగిపోతుంది. నీ నమ్మకము, నీ శ్రద్ధ, నీ భక్తి వీటిని వేస్తుంటే అదే పెరిగిపోతుంది. శ్రదే జ్ఞానంగా మారిపోతుంది. అందువల్లనే "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం " అన్నారు. ఈనాడు మీరు ఎం.బి.ఎ.స్థితికి వచ్చారంటే మీ శ్రద్దే దానికి మూలకారణం. ఈ శ్రద్ధే లేకపోతే మీరు ఇంత అభివృద్ధికి రాలేరు. అందుకే ప్రతిదానికి కూడా శ్రద్ధః!శ్రద్ధః! శ్రద్ధః!
ఒక్కొక్కరు ఒకో పదార్థాన్ని చూచి తృప్తి పడుతుంటారు. మరి కొందరు అసంతృప్తి పడుతుంటారు. ఈ టంబ్లర్, half water ఉన్నది తృప్తి కలిగినవాడు ఈ tumbler half full గా ఉన్నది అంటాడు. తృప్తి లేనివాడు ఇది half empty అని నిరాశపడతాడు. ఒకడు గులాబీ పుష్పాన్ని చూచి చాలా ఆనందిస్తాడు. మరొకడు దాని క్రిందనున్న thorn చూచి భయపడతాడు. కనుకనే సుఖము దు:ఖము అనేవి ప్రత్యేకముగా లేవు. మన భావములందే ఉంటాయి. చూడండి Love is a flower. Lust is thorn. There is no rose without a thorn. So cut the flower but do not touch the thorn! నీవు చెయ్య వలసినదంతే. మనము కావలసిన దానిని తీసుకుందాము అక్కరలేనిదానిని వదలి పెడదాం. అవసరము లేనిదానితో నీవు వాదోపవాదము లెందుకు పెట్టుకోవడం? అవసరమైనది తీసుకో: అవసరం కానిది వదలి పెట్టు ఇటువంటి భావాలలోయువకులు దేశంలో ప్రవేశించారంటే ఎంతైనా దేశం బాగుపడుతుంది. పవిత్రమైన భారత దేశంలో దివ్యమైన సారమున్నది.
(స.సా. జూ.88పు.147)
జరిగిపోయింది పోయింది. మీరు ఎంత ప్రయత్నం చేసినా రాదు. Future గురించి యోచన చేయకండి. Future is not sure. Present చాలా important. This, not ordinary present: omni-present. ఈనాడు మానవుడు అనేక దుఃఖములకు, అశాంతికి గురికావటానికి కారణం ఏమిటి? Present మరచి Future ను వెతుక్కుంటున్నాడు. Present ప్రధానంగానీ, ఆకలైనప్పుడు తట్టలోని అన్నం భుజించు. పదినెలల క్రిందట మా యింట్లో పండగ జరిగింది. ఆ పండగలో పంచభక్ష్య పరమాన్నములు చేశామని తలచుకొని ప్రయోజనం ఏమిటి? పది నెలల ముందు జరిగింది ఎందుకు యోచించాలి? Present యోచించు. Past-tree; future tree, present-seed. past tree నుంచి Present seed వచ్చింది. Present seed నుండి future tree వస్తుంది. అందుకనే seed is very very very important. Present లో తగిన జాగ్రత్తగా ఉండాలి. Future గురించి ఏమాత్రం తలచకండి. Present మంచిగా ఉంటే Future లో ఆటోమేటిక్ గా మంచిగా ఉంటుంది. కనుక, Future ని గురించి worry అయితే సైకలాజికల్ గా నిజంగా దుఃఖమే ఏర్పడుతుంది. చింతనే చేయకు, ఎందుకు worry చేయాలి? What is the shape of Worry? It is mentally created fear only. ఈ worry కి ఏరూపు లేదు. నీ creation.అలాంటి దీనికి అవకాశము యివ్వకండి. ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడూ ఆనందముగా ఉంటుండండి. మా కెట్లా స్వామీ, ఇంటిలో అనేక చిక్కులుంటాయి. మాకు అనేక బాధలుంటున్నాయి. సంసారములో వ్యధలుంటు న్నాయి. మేము ఎట్లా సుఖముగా ఉండటానికి వీలవుతుంది అంటారు. Worry చేస్తే Problems పోతున్నాయా? పోవటం లేదే. కనుక worry చేసి ఏమి ప్రయోజనం? కనుక happy గా ఉండు. Happiness నీworry ని దూరం చేస్తుంది. అంతేగాని worry గా ఉంటే యింకా ప్లస్ ప్లస్ అవుతుంది. నీవు worry చేయకూడదు. ఏది వచ్చినా ఇది భగవత్ప్ర సా దమే. Pleasure is an internal between two pains. రెండు కష్టములు మధ్యనే సుఖము ఉంటున్నది. కష్టములు లేక సుఖము విలువ మనకు తెలియదు. చీకటి లేక వెలుగు యొక్కప్రకాశము తెలియదు. కాబట్టి కష్టములు కూడా ప్రసాదమే. మలేరియా జ్వరము వచ్చిన వానికి క్వినైన్ యిస్తారు. Bitter గా ఉంటుంది. కానీ దానిని నీవు కష్టపడి త్రాగినప్పుడే మలేరియా జ్వరము నివారణమైపోతుంది. మందుకూడా తీయగా కావాలని కోరితే వ్యాధి నివారణ కాదు. కష్టము కూడా సుఖము నందిస్తుంది. ఎప్పుడూ నీవు joyful గా ఉండాలి. అప్పుడే నీ జీవితము ఆనందము, ఆదర్శము నందిస్తుంది.
యువకులారా! శరీర సంబంధమైన విషయములుగానీ, future విషయములకుగానీ, కుటుంబ విషయములకు గానీ, మీరు హృదయములో ఏ మాత్రము చోటివ్వకండి. హృదయములో చోటు యివ్వవలసింది. ఒక్కనికే. భగవంతునికే యివ్వాలి. Art అంతా outside ఉంది, heart inside ఉంది. Art అంతా heart నుండి వచ్చిందే. కనుక మొట్టమొదట heart ని చూసుకో. art ని చూడవద్దు: Reflection of the inner being.లోపల నీవు ఆనందంగా ఉంటే బయట ఆనందమే వస్తుంది. ఎందుకోసం? భగవంతుడు నావెంటనే ఉన్నాడు, హృదయమునందే ఉంటున్నాడు. అనే విశ్వాసము మనము పెంచుకోవాలి. అప్పుడే తగిన ఉత్సాహ ప్రోత్సాహములు అభివృద్ధి అవుతుంటాయి.
(శ్రీ.స.పు.64/66)
విశ్వాసము లేకపోవుటవలన మానవుడు నిరాస్పృహలకు గురియై పోతున్నాడు. కనుకనే మనము నమ్మకమనే టటువంటి దానిపై శ్రద్ధ అలవరచుకోవలయును. శ్రద్ధలేని మానవుడు ముందంజ వేయలేడు. శ్రద్ధ వలననే జ్ఞానము కలుగును. “శ్రద్ధావాన్లభతే జ్ఞానం" శ్రద్ధవలన మానవుడు ఎంతటి వున్నత స్థానమునకు నైనా పోగలడు. కేవలము
క్షణ భంగురములైన వాటిపై శ్రద్ధను అధికముగా పెంచుకొనరాదు. నిత్య సత్యమైన దైవ పదార్థము పైన శ్రద్ధ అభివృద్ధి చేసుకొనవలయును. నమ్మకమే మనశక్తి, ఆ నమ్మకమే లేకుండిన మానవుడు ఈ జగత్తునందు కాని మరే జగత్తునందుకాని ఒక్క క్షణమైనను జీవించలేడు.రేపు అనే నమ్మకము ఉండబట్టే కొన్ని కార్యములు చేపట్టుతాము. నమ్మకం లేని వారు దౌర్భాగ్యులుగా రూపొందుతారు. కనుక నమ్మకం చాలా అవసరం. .
(సా. పు 608)
పుట్టలో దేవుడున్నాడు. చెట్టులో దేవుడున్నాడు- అంటూ మనం అన్నింటిని పూజిస్తున్నాము. ఇట్టి సమత్వము ఒక్క భారతదేశమునందు తప్ప ఏ ఇతర దేశమునందూ లేదు. దీనిని ఎవరైనా హాస్యాస్పదం చేస్తుంటే మనమెందుకు ఊరుకోవాలి? వారిని ఎదుర్కొని సరియైన జవాబు చెప్పాలి. “దేవుడు చెట్టులోనూ ఉన్నాడు, పుట్టలోనూ ఉన్నాడు. నా విశ్వాసం నాది. దీనిని కాదవటానికి నీ వెవరు? నీకు విశ్వాసం లేకపోతే నీవు వెళ్ళు" అని చెప్పాలి. ఇంత చదువుకున్నవాడు. ఇలా చెబుతున్నాడే: ఇంత గొప్ప సైంటిస్టు ఇలా చెబుతున్నాడే అని వారి మాటలు నమ్మ నీ విశ్వాసాన్ని కోల్పోరాదు. నీకు ఏ సైంటిస్టు అక్కరలేదు. ఏమేధావీ అక్కరలేదు. నీవు ఎవరికీ దాసుడవు కావు. ఎవరిని ఆశ్రయించనక్కరలేదు. నీ ‘కాన్షియస్సే నీకు ప్రధానం. దానిని నీవు అనుసరించు. ఎవరనుకునేది వాళ్ళు అనుకుంటారు. వాళ్ళ మాటలు. వీళ్ళ మాటలు వింటే కట్ట కడపటికి నీవేమైపోతావో! కనుక, నీ అంతరాత్మను అనుసరించు. అదే నిజమైన విశ్వాసం. ఎవ్వరికీ నీవు భయపడనక్కరలేదు. ఆత్మ విశ్వాసాన్ని కలిగి భగవంతుని హృదయ పూర్వకంగా ప్రార్థించు.
(శ్రీభ.ఉ.పు.155)
భగవంతుని చరిత్రను వర్ణించాలంటే సాధ్యం కాదు. పానకంలోని పంచ దారవలె ప్రతి మానవుని యందు దైవత్వ మున్నది. వేదము "రపోవైసః" అన్నది. భగవంతుడు రసస్వరూపుడై ప్రతి మానవుని యందున్నాడు. ఆ రసమే లేకపోతే మానవుడు నీరసించి పోతాడు. దివ్యత్వం తనయందే ఉందన్న విశ్వాసాన్ని మానవుడు పెంచుకోవాలి. విశ్వాసం గలవానికి ఇంకొకరి సహాయం చేస్తుంటాడు. విశ్వాసం లేనివానికి ఎంతమంది సహాయం చేసినా ప్రయోజనముండదు. Dead body కి Decoration (నిర్జీవమైన దేహానికి అలంకరణ) ఉన్నప్పుడే ఏదైనా చేయవచ్చు. అలాంటి విశ్వాసం వల్లనే సావిత్రి గతించిన తన పతిని బ్రతికించుకోగల్గింది. చంద్రమతి భయంకరమైన దావాగ్నిని చల్లార్చ గల్గింది. సీత అగ్నిగుండంలో దూకి తన పవిత్రతను నిరూపించుకుంది. దమయంతి కామాంధుడైన కిరాతకుణ్ణి భస్మంగావించింది. ఇలాంటి మహాపతివ్రతలకు జన్మభూమి మన భరతభూమి.
(స.సా.జూ..2002 పు. 185/186)
“విశ్వాసం అగ్నిపర్వతం లాంటిది. అది మంచు పర్వతం లాంటిది. ఇక నేమీ ఉండదు, సందేహం ఉండదు” అని విశ్వాసాన్ని గురించి, దాని స్వభావమైన అచంచలత్వంగురించి స్వామి చెప్పారు. మరొకరెప్పుడూ స్వామి కారు. ఐనారని భ్రమించడం - ఇక్కడ నా అనుగ్రహం ఉన్నది - ఉంటుంది - అన్న సత్యాన్ని విశ్వసించపోవమే."ఈ కాలంలో కేవలం విశ్వాసం పటిష్టంగానూ,స్థిరంగాను ఉన్నవాళ్ళు తప్ప తక్కిన భక్తులు చాలామంది సాయి నుంచి జారిపోతారు." (స. సా. న 2021 పు 22-23)