అయస్కాంతశక్తి

భూగోళమంతయును అయస్కాంతమయమై ఉన్నది. భూగోళమునకు సమీపించినటువంటి సర్వజీవులుసర్వపదార్థములన్నియూ అయస్కాంతస్వరూపమై ఉన్నవి. ప్రవహించే నదులుభూమి యొక్క అయస్కాంత శక్తి చేతనే భూమిని అంటిపెట్టుకొనే ప్రవహిస్తున్నవి. సర్వత్రా నిండి యున్నది. అయస్కాంతమే. మనం పెద్ద పెద్ద దేవాలయములకు వెళ్ళుతున్నాం. ఈ దేవాలయములకు వెళ్ళేది ఎవరుభక్తి ప్రవత్తులతో కూడినటువంటివారే. కనుక  భక్తి ప్రపత్తులు కూడనూ అయస్కాంతమయమే. వేలాదిమంది భక్తులు ఈ మందిరంలో ప్రవేశించడం చేతవారి యొక్క అయస్కాంతశక్తి అంతయూఈ మందిరంలోన నిలిచి పోతున్నది. వారు అర్పించే పుష్పములుగాని, ఫలములుగాని అన్ని అయస్కాంతమయమై ఉన్నది. కనుకనే ఆ అయస్కాంత శక్తి ఆ మందిరంలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ అయస్కాంత శక్తి దినదినమునక పెరుగుతూ ఉంటుందే గాని తరగదు. అయస్కాంత కిరణముల యందు ఒక ఇనుప మూలికను వేసినప్పుడుకొన్ని దినములకు ఆ ఇనుప మూలిక కూడనూ అయస్కాంతమైపోతుంది. కనుక మందిరంలో ప్రవేశించే వ్యక్తులు గానివారు అర్పించే పదార్ధములు గాని అన్నియూ అయస్కాంతమయమైపోతాయి. మందిరం యొక్క మహత్తర శక్తులు ఎక్కడ నుoచి ఆవిర్భవించాయిభక్తుల యొక్క అయస్కాంత శక్తుల వలననే వచ్చింది. ప్రతి వ్యక్తి యందునూ ఈ అయస్కాంత శక్తి యిమిడి ఉన్నది. అయితే ఈ శక్తిని వారు గుర్తించుకోలేక దేవాలయంలో వుండే శక్తి కోసం ప్రయత్నిస్తున్నారు. దేవాలయం నుండి ప్రత్యేక శక్తులు మనకు ప్రాప్తించవు. నీ నుండి వెళ్ళిన అయస్కాంత శక్తియే నీకు ప్రతిబింబిస్తూ ఉంటున్నది. తిరుపతిహరిద్వారం మొదలగు పవిత్ర క్షేత్రములు వెళ్ళుతుంటారు. ఈ పవిత్ర క్షేత్రముల యందువెళ్ళేటటువంటి భక్తుల భక్తిప్రపత్తులుభక్తి యొక్క తత్త్వములు శక్తికి మూలకారణం. 

 

మానవుడు సకల ఐశ్వర్యస్వరూపుడు.భగవంతుడు కూడనూ సకల ఐశ్వర్యస్వరూపుడేఐశ్వర్యము, దానముయశస్సుజ్ఞానంసంపదఆనందం - ఇవన్ని భగవంతుని అనుగ్రహ ప్రసాదములే. ఈ ఆరు శక్తులు ప్రతి మానవుని యందునూ ఉన్నాయి. అట్టి శక్తులను మానవుడు సద్వినియోగపరచకదుర్వినియోగం చేయటం చేతనేఆ శక్తులను కోల్పోతున్నాడు. కనుక ప్రతి మానవుడూ ఆ సర్వేశ్వర స్వరూపమైనటువంటి శక్తులను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టివాటిని సద్వినియోగపరచినతన యందే ఆ దివ్యత్వము ప్రకాశిస్తుంది. ప్రతి మానవుని ముఖమునందునూ ఆ తేజస్సు ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. వెంకట్రామన్ చెప్పారు మొదటి శక్తిMaterialisation.అనగాశరీరములోనిఅవయవములు,కండరములు,మాంసములన్నిచేరి ఒక పదార్ధము యొక్క స్వరూపమే. దీనినే The one you think you are అని చెబుతూ వచ్చారు.దీనికిvibration ప్రాణశక్తి చేరినప్పుడుఅదియే  యశస్సుఈ రెండింటినీ సమన్వయం చేసేటటువంటి ఒక గొప్ప శక్తి ఉన్నది. అదియే  ఆత్మశక్తిదానినే Radiation(ప్రకాశము) అన్నారు. Materialisation,Vibration,Radiation-ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవుడు. దైవము నందు ఏ శక్తులున్నవో ప్రతి వ్యక్తియందునూ ఆ శక్తులు  తాండవమాడుతున్నాయి. కాని మానవుడు ఆ శక్తుల మీద దృష్టిని పెట్టటం లేదుమరల్చటం లేదు. కేవలం దేహతత్త్వమునే లక్ష్యము నందుంచుకొని, "నేను దేహముఅని భ్రమిస్తున్నాడు. కాని తాను దేహము కాదు. దేహము కంటే నీవు ప్రత్యేకంగా ఉంటున్నావు. నీవు ఈ భౌతికమైన ఈ దేహము కాదు. నీవు కాని దేహమును నాది ... నాది అని భ్రమిస్తున్నావు. ఈ భ్రమల చేతనే మానవుడు ఆ దివ్యమైన క్రాంతిని కోల్పోతున్నాడు.

 

ఇక Vibrationఇది ఉచ్చ్వా స నిశ్వాసముల యొక్క తత్వశక్తి. ఇది కేవలం గాలి వలన జరుగుతున్నదని భావిస్తున్నారు. కాదు.... కాదు.... ఇదియే నిజమైన శ్వాసశక్తిప్రాణశక్తి. నా శ్వాస సరిగా రావటం లేదంటావు. నీ శ్వాస కాదునా శ్వాస ఆంటున్నావు. శ్వాస కంటే నీవు ప్రత్యేకంగా వున్నావన్నమాట. కనుక తనది కానటువంటి దానినితనదిగా భావిస్తున్నాడు. ఈ విధంగా భావించటమే మూఢత్యము.

 

మూడవది Radiationఇదియే దివ్యశక్తి. ఇది  నా దివ్యశక్తిఅని చెప్పటం లేదు. “దివ్యశక్తి  అంటాడు. కనుక నీవు వేరు దివ్యశక్తి వేరు కాదు ఇక్కడ రెండింటి యొక్క ఏకత్వమే. కనుక ప్రతి మానవుని యందునూ వున్నటువంటి శక్తి ఈ అయస్కాంతమే. దేవాలయముల యందు ఆవిర్భవించిసర్వవ్యక్తుల ఆకర్షించిసర్వశక్తులను ప్రకటింపజేసేది ఈ దివ్యశక్తియే. ఈ అయస్కాంతమనేటటు వంటి కేవలం దైవశక్తితో  కూడినటువంటిదే. దీనినే మందిరం యొక్క స్వభావము అన్నారు. దీనిని సైన్స్ లో ముక్కలుగా చేసినటువంటి అయస్కాంతంగా భావిస్తుంటారు. దీనిని Materialistic Magnet అన్నారు. ఇది మానవుని యందునూ ప్రకాశిస్తూ ఉంటుంది. అసలు ఈ ప్రకాశించేటటువంటి శక్తి ఎక్కడ నుంచి వస్తున్నదిఅంతా తన నుండియే వస్తున్నది. ప్రపంచమంతా గాలితో నిండి ఉంటుంది. గాలిలోనీటిలో కూడా మాగ్నెట్ ఉంటుంది. ప్రతి దానిలో మాగ్నెట్ వుంటుంది. ఇలాంటి సర్వశక్తివంతమైన తత్త్వాన్ని మనం గుర్తించాలి.  దైవాధీనం జగత్ సర్వం  జగత్తంతా భగవంతుని అధీనంలోనే వుంటుంది. సత్యాధీనం తు దేవతంఇలాంటి శక్తి ఒక సత్యంతో  ఇమిడి వుంటుంది.  తత్ సత్యం ఉత్తమాధీనం . అటువంటి సత్యం ఉత్తముని అధీనంలో వుంటుంది. ఉత్తముడనగా ఎవరుశాంతస్వభావంప్రేమమనస్సుదయా హృదయం గలవాడు.  ఉత్తమో పరమోగతి!  అటువంటి ఉత్తముడే మార్గదర్శకుడుపరమస్థితికి మార్గం. కనుక మానవుని యందు కూడనూ ఈ పవిత్రమైన శక్తులు లేకపోలేదు. దైవశక్తి కోసం యాత్రలు చేస్తుంటారు. ఈ పవిత్రమైన శక్తి తన యందు లేదనే భావం వుండటం వలననే యాత్రలు చేస్తుంటారు. కేవలం శక్తి వుండినంత మాత్రం చాలదు. దానిని కంట్రోల్ చేయగల శక్తి కూడా ఉండాలి. రష్యాలో ఒక బ్రిగిట్ అనే మహిళ ఉండేది. ఆమెలో - సర్వశక్తులూ ఉండేవి. మాగ్నెట్ పుష్కలంగా ఉండేది. ఆమె రోడ్డు మీద నడిచి వెళ్ళుతుంటేప్రక్కన వున్న ఇనుపముక్కలు వచ్చి కరుచుకొనేవి. షాపుకు వెళ్ళితే అక్కడ వున్న సామాన్లు కూడా ఆమెను కరుచుకొనేవి. అందువలన ఏ షాపు వారు ఆమెను రానిచ్చేవారు కాదు. ఇటువంటి పరిస్థితులలో భోజనం కూడా చేయలేకపోయేది. ఆమె కొంత కాలానికి ఆహారం తినలేక మరణించింది. శక్తిని సంపాదించిన తరువాతదానిని జీర్ణించుకునే శక్తిని కూడా కలిగి ఉండాలి. కేవలం శక్తి ఉండినంత మాత్రమున ప్రయోజనం లేదు. ఆ శక్తిని కంట్రోల్ చేయగల శక్తిని కూడా సంపాదించాలి. ఆ శక్తిని వశం చేసుకోగల శక్తిని కూడా సంపాదించాలి. ఆ వశం చేసుకొనే శక్తి ఆమెలో లేకపోవటం వలన ఆమె మరణించింది. కారుని నడిపేవానికిఆ కారును కంట్రోల్ చేయగల శక్తి ఉండాలి. అది లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. ఈ దేహమనేది కూడా ఒక మాగ్నెట్ కారు. కన్నులు లైట్లునోరు హారన్మైండ్ స్టీరింగ్. ధర్మఅర్ధకామమోక్షాలు అనేవి ఈ కారుకు టైర్స్. ఈ టైర్స్ లోపల faith (విశ్వాసం) అనే గాలి ఉండాలి. ఈ టైర్స్ లో గాలి ఎక్కువగా ఉండరాదు. తక్కువ ఉండరాదుసరిపోనూ ఉండాలి. మన పొట్టే ఈ కారుకు పెట్రోల్ టా o కు. దీనిలో పెట్రోల్ పోయాలి. అదే విధంగా ఈ పొట్టకు ఆహారం అందివ్వాలి. పరిశుద్ధమైన ఆహారం ఇవ్వాలి. మలినమైనది ఇస్తే ఆరోగ్యం దెబ్బ తింటుంది. అదే విధంగా కారు టాంక్ లో పరిశుద్ధమైన పెట్రోల్ పోయాలి. నలకలు వుంటే కారు నడవదు. ఇంజన్ ఆగిపోతుంది. జలము కూడా పరిశుద్ధమైనది పోయాలి. అప్పుడే ఈ దేహము అనే కారు చేరవలసిన గమ్యానికి సరీగా సకాలములో చేరుతుంది. ప్రతి ఒక్కరూ ఈ కారు యొక్క తత్త్వాన్ని చక్కగా గుర్తించివర్తించినప్పుడే మన జీవితం సార్ధకమవుతుంది.

 

మానవుని యందు ఏది కూడను చెడ్డది లేదు. అంతా పవిత్రమైనటువంటిదే ఉంటుండాలి. కారణముఅంతా Magnet యొక్క powerఇది అయస్కాంత మందిరము యొక్క చిహ్నములు. మన దేహము ఒక అయస్కాంత మందిరం. ఈ మందిరంలో పవిత్రమైన కార్యాలు చేయాలి. ధర్మవిరుద్ధమైన కార్యాలు ఆచరించినప్పుడుధర్మవిరుద్ధమైన ఫలితాలే వస్తాయి. మన దేహమంతా అయస్కాంతమే. ఈ అయస్కాంత మందిరమైనటువంటి మన దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశ పెట్టాలి. ధ్యానములుజపములు చేస్తూ వుంటారు. ఇవన్నీ కూడా కేవలం తాత్కాలిక తృప్తి నిమిత్తమై చేసేటటువంటివే కాని ఈ అయస్కాంతమును control చేసేటటువంటివి కావు. ... నవ విధ మార్గములుగా చెప్పారు. శ్రవణముకీర్తనమువిష్ణుస్మరణంవందనంఅర్చనందాస్యం:  దాస్యం ఎప్పుడు దొరుకుతుంది. స్నేహం దొరికింతరువాత దాస్యం వస్తుంది. కనుకమొట్టమొదట స్నేహాన్నికోరాలి.ఈfriendshipఆశించి,friendship,బలపర్చుకున్నప్పుడేమనకుసరియైన బద్ధములభిస్తుంది. Friendship అయినతరువాత ఆత్మనివేదనము. అంతవరకు surrender రాదు. అంతా magnet power అనే తెలియదు. అంతా అయస్కాంతమనే భావం మనలో రావాలి.

 

ఏది చేసినా కూడా అయస్కాంతమే కనుక ఈ అయస్కాంత మందిరాలే ఈ యొక్క దేవాలయములు. ఎక్కడ ఎక్కడ దేవాలయములు ఉంటున్నవో ఆ దేవాలయములలో ఉంటున్నటువంటి power లు అంతయూ అయస్కాంతము యొక్క శక్తులే. తిరుపతిలో గొప్ప శక్తి వుంది అనుకుంటాము. అది వెంకటేశ్వరస్వామి యొక్క శక్తికాదు. మీరు తీసుకొని పోయి నటువంటి భక్తుల యొక్క ప్రపత్తులుశక్తులు అక్కడ వదలి పెట్టుతున్నారు. ఆ Magnetకి ఆకర్షణ శక్తి ఉండాలి.  రమయేతి: రామ: రమింప చేసేటటువంటి శక్తి ఉంది. అది రమింపచేయటంవల్ల అక్కడ అయస్కాంతశక్తి ఉంటున్నది. ఇది దైవత్వము యొక్క శక్తి. ఇది దేవాలయములో మాత్రమే అనుభూతి పొందవచ్చు. దీనికి కారణమేమిటిదేవాలయములలో ప్రతిష్టించిన దేవుళ్ళుఅభిషేకమునకు ఉపయోగించు నీరు పువ్వులుఆరాధనకు వాడే పసుపు అక్షతలు అన్నీ కూడా పూర్తి అయస్కాంత శక్తియే. అందువలనే ప్రజలుదేవాలయములకు ఆకర్షింపబడుతారు.

 

మనం అనవసరంగా ఇతరులను కోప్పడినప్పుడుమనలో వున్న అయస్కాంతం వృధా అయిపోతుంది. ఇతరులను ద్వేషించినప్పుడుఅసూయపడినప్పుడు కూడా మనలో వున్న అయస్కాంతం తరిగిపోతుంది. కనుక మనం పవిత్రమైన కార్యాలను ఆచరించాలి. పవిత్రమైన కార్యాలను చేయాలి. ప్రతి మానవుడు దైవశక్తి మీద విశ్వాసం ఉంచాలి. ఇదంతా మన వలననే జరుగుతున్నదనే అహం భావమును విడనాడాలి. ప్రేమస్వరూపులారా! 

 

ఈనాడు మానవుని యందు ఈ అహంకారం ఉండటం వలననే అసలు విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. పండిన వడ్లువడ్లుగా ఎవడూ తినలేదు. దానిపై పొట్టును తీసివేయగా వచ్చిన బియ్యమును ఉడికించాలి. ఉడికిన అన్నానికి రుచికరమైన పదార్థమును చేర్చాలి. అప్పుడే భుజించి ఆనందాన్ని అనుభవించగలడు. ఇదంతా మన ప్రయత్నం చేత జరుగుతున్నది. సృష్టి మాత్రం అంతా దైవముతోనే జరుగుతున్నది. కనుక ప్రతి మానవుడు దైవసృష్టి మీద విశ్వాసమును పెట్టుకోవాలి. తెలియని వారు దైవమే లేడని భావిస్తారు. ఇంకా ఏముందయ్యా! అంటే ఏదో ఒక శక్తి ఉన్నదంటారు. ఆ శక్తికే దైవము   అని పేరు పెట్టారు. మానవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు శక్తి ఎక్కడ నుంచి వస్తున్నదిఅదే దివ్యమైనటువంటిది. అoదుకోసమనే Meterialisation, Vibration,Radiation – యీమూడు శక్తులూచేరినటువంటిదే మానవుడు అన్నారు.రేడియేషన్‌నుతీసుకొనివచ్చివైబ్రేషన్నుతన యందుచేర్చుకొనిమెటీరియలైజేషన్దేహరీతిగా పనులు చేయగలుగుతున్నాడు. ఈ దేహంతో పనులు చేయటం కర్మయోగంచింత చేయటం వైబ్రేషన్అన్నింటిని చైతన్యం గావించడానికి రేడియేషన్. దీనినే వేదమునందు  ప్రజ్ఞానం బ్రహ్మ  అన్నారు. దీనినే Constant integrated awareness అన్నారు. ఇది ఎప్పుడూ జరుగుతునే వుంటుంది. "సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచంతవమ్". దానికి రాత్రి పగలు అనేటటువంటిదే లేదు. అన్ని కాలములూ ఒక్కటే. ఏకం సత్ విప్రా బహుధా వద౦తి కనుక అట్టి సత్యస్వరూపమైనటువంటిది ఈ మాగ్నెట్. అయస్కాంత మనేది ప్రతి మానవుని యందునూ ఉన్నది. ప్రతి దేవాలయమునకు వెళ్ళి దానిని ప్రవేశపెడుతున్నాడు. కనుక దేవాలయమంటే ఏమిటిఅయస్కాంత మందిరమే. అక్కడ ఏ రూపాన్ని అయినా దర్శించవచ్చును. కాని దివ్యత్వానికి ఏ రూపమూ లేదు. నీటికి ఏ రూపం ఉన్నదిదానికి రూపం లేదు. కాని గ్లాసులో పోస్తే గ్లాసు ఆకారాన్ని పొందుతుంది. గాలికి కూడా రూపం లేదు. బెలూన్ లోనికి పంపుతే బెలూన్ రూపం ధరిస్తుంది. కాబట్టి నీరుకుగాలికి రూపంలేదు. అదే విధంగా పంచప్రాణములకుపంచ భూతములకునూ ఎట్టి రూపం లేదు. రూపములను మనం కల్పించు కుంటున్నాం. కల్పించుకున్న రూపములుకనిపించ కుండానే మధ్యలో పోతున్నాయి. కనుక ప్రయత్నం చేత సాధించినవన్నీ భౌతికములే. వీటన్నింటికీ ఆధారమైన శక్తి ఒక్క దైవత్వమే.

 

ప్రేమస్వరూపులా!

 

దేనినైనా మరువండి. దేనినైనా వదలవచ్చు. కాని దైవత్వాన్ని మాత్రం మరువకండిదైవత్వాన్ని మరచినవాడు తనము తానే మరచిపోతాడు. అట్టివాడు ఎక్కువ కాలం జీవించలేడు. ప్రాచీన కాలంలో దైవం మీద భక్తితో నిరంతరమూ స్మరిస్తూ ఉండేవారు. అట్టి వారు 120 సంవత్సరాల దాకా బ్రతికారు. వారికి ఎట్టి రోగములూ రాలేదు. వారు తినిన తిండి సామాన్యమైనదే. ఇప్పటి వారిలాగే విటమిన్లు తినేవారు కాదు. అసలు విటమిన్లు అంటే వారికి తెలియనే తెలియదు. అభగవంతునికి ఆర్పితం గావించి తినటంచేత అన్ని ప్రొటీన్స్విటమిన్సు అందులో ప్రవేశించేవి. కనుక దైవ విశ్వాసాన్ని మనం పెంచుకుంటేసర్వమునూ మనం సాధించవచ్చును. సర్వరూపాలను మనం పొందవచ్చును. మనమే దైవస్వరూపులం కావచ్చును. దైవం ప్రత్యేకంగా లేడు. నీ కంటే దైవము వేరు కాడు. నీవూ దైవం ఒక్కటే. దీనిని గుర్తించి వర్తించినప్పుడు ఏకత్వం ప్రాప్తిస్తుంది.

 

పరమాత్మ చింతన చేయని శక్తి వలన ప్రయోజనం లేదు. కమక దినమునకొక పర్యాయమైనా భగవంతుని చింతించండి. ఎవరు ఏమి చెప్పినా వినకండి. ఎవరి నమ్మకం వారిది. కాని ఈనాడు "నమ్మకమును రెండు - నయనంబులే లేని అంధులైరి మనుజులవని యందుజీవితాన్ని సార్థకం చేసుకునే నిమిత్తమై దైవ విశ్వాసాన్ని  పెంచుకోండి. ఆ నమ్మకమే మిమ్ములను రక్షిస్తుంది. కాని ఈ నాడు రక్షించే దానిని వదిలి పెట్టిశిక్షించే దానిలో మనం ప్రవేశిస్తున్నాం. ఈనాడు పిల్లలు దుర్భావనలు పెంచుకుంటున్నారు. చెడ్డ భావాలను లోపల చేర్చకండి. పరులకు అపకారం చేయు పనులలో ప్రవేశించకండి. పరులను విమర్శించకండిహింసించకండి. ఆ హింసకు మించిన హింస మీకు తగులుతుంది. మీ కుటుంబానికి కూడా తగులుతుంది. ఈ సత్యమును మీ మనసులలో ఉంచుకోండి. అందరి క్షేమాన్ని మనం కోరినప్పు డేమన క్షేమాన్ని మన కుటుంబ క్షేమాన్ని భగవంతుడు కోరుతాడు. కనుక మంచి భావాలు పెంచుకొనిమంచి చింతన చేస్తూ కాలాన్ని సార్థకం చేసుకోండి!

(శ్రీ.ఏ. 2002 పు. 7/11 మరియు ది.ఉ. 13.3.2002) |

(చూ॥ లింగోద్భవము)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage