బాల్యమందున తత్త్వంబు పట్టుపడని
కారణంబున సంఘంబు కాలగతిని,
ప్రగతి స్థానంబు దిగజారి పతనమయ్యె.
ఇంతకంటెను దుర్గతి ఏమికలదు
సత్యమును తెల్పుబాట ఈ సాయిమాట.
(నేను నా సాయి పు 97)
తామసంబు విడక తత్వంబు ఎటుకుదురు
రాజసంబు విడక రాదురక్తి
సాత్వికంబె భక్తి సాధనం బగునయా
ఉన్న మాట తెలుపు చున్న మాట. .
(మ మ పు44)