తత్త్వజ్ఞానము

పుట్టపైన మర్ధించిన పాము మరణమోందునా

తనువును తాదండించిన విషయభోగములడుగునా

ఆకలిదప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానగునా

తానెవరో తెలియకున్న తత్వజ్ఞానమెటు కుదురును

తత్వజ్ఞానము కుదురవలెనన్న తానెవరో మొట్టమొదట గుర్తించ ప్రయత్నించాలి. మానవుడంటే యేమిటో అర్థము చేసుకోవాలి. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికి దేహము నూతనముగానే వుంటుంది. మానవత్వము. దివ్యత్వముతో కూడిన ఆత్మతత్వమనియిది నిరూపిస్తుంది. విచారణ సల్పినప్పుడే దీని నిజస్వరూపము మనకు గోచరమవుతుంది. స్వస్వరూపసంధానమే దీనినిష్ట - ఇట్టి నిష్ఠనే జ్ఞానమునకు సరియైన ద్రష్ట ఈ ద్రష్ట యొక్క సందర్శనమే భక్తి ప్రభావము. ద్రష్టాధారము చేతనే దృష్టిని అభివృద్ధి పరచుకొని సృష్టిని అనుభవించాలి. అంతేకాని ఆకారము కూడినంత మాత్రమున మానవత్వమని అనుకోవటం అవివేకము.

(బ్బత్ర పు. 28, 29)

 

ధర్మవిరుద్ధ కామక్రోధలోభములు కూడనూ భగవత్ స్వరూపములని కృష్ణ పరమాత్మ అన్నాడు. కానీవేయేటికి"సర్వభావములుసర్వరూపములుసర్వవస్తువులూనా అపరా పరాకృతివల్ల సంభవించినవే" అని అన్నాడు. కానీ ఉపాసకునకు ఉత్తమ భావన లేర్పడుటకోసం మొట్టమొదటిదిఉత్తమభావంఉత్తమరూపంఉత్తమ భూతంలో నా స్వరూపమని తెలిపెను. ఇంత మాత్రమునకే మంచిది మాత్రము భగవత్ స్వరూప లక్షణములనియూతతిమావన్నియూ కాదనియూ తలంచుట తత్త్వజ్ఞానము కాదు. త్రిగుణములయిన రాజసికతామసికసాత్విక వస్తువులుభూతములుభావములూ భగవంతునియందే ఉద్భవించినవని స్థిరము చేసుకొనుటకు విచారణాప్రయత్నమూ జరుపవలెను. ఇట్టు ఆ భగవంతుడే స్వయముగా తెలిపెను.

 

అర్జునా! అన్నియూ నాయందే పుట్టినాయందే వుండును. కాని నేను మాత్రము వాటి ఆధీనమందుండక వాటితో ఏ సంబంధమూ లేనివానివలె యుందును". ఇచ్చట రెండు దృష్టులు కలవు. ఒకటి జీవదృష్టిరెండవది భగవత్ దృష్టిజీవదృష్టిలో చూచినపుడు మంచి చెడ్డలను ద్వంద్వాలు కలవు. భగవత్ దృష్టిలో చూచినపుడు ద్వంద్యములు లేక సర్వమూ భగవంతుడే. మరేమీ లేదని సర్వ భూతాంత రాత్మ తత్వమును బోధించును.

(గీ.పు. 108/109)

 

తత్త్వజ్ఞాన దర్శనము - మోక్షాపేక్ష దృష్టి తప్ప మరేమీ లేకుండట.

(గీ.పు.214)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage