ఒకానొక సమయంలో బుద్ధుడు ఎక్కడికో ప్రయాణమై వెళుతుండగా మార్గమధ్యంలో ఒక పెద్ద యజ్ఞంలో అనేక మేకలను, గొఱ్ఱెలను బలి యిస్తున్నారు. బుద్ధుడు చూచాడు. "అహింసా పరమో ధర్మః", నోరు లేని జీవులను ఎందుకు బలిస్తున్నారు. ఇది మంచిది కాదని అరికట్టటానికి ప్రయత్నం చేశాడు. అక్కడ చేరిన పెద్దలందరూ "అయ్యా, ఈ బలిని మీరు ఎందుకు ఆపుతున్నారు? ఈ గొఱ్ఱెలను, మేకలను బలి ఇవ్వడం ద్వారా వాటికి మేము మోక్షం ప్రసాదిస్తున్నాం" అన్నారు. "ఓహో! ఇదా మీరు చేసే పని. అయితే, మీ తల్లి మోక్షాన్ని కోరుతున్నది. మీ తండ్రి మోక్షాన్ని కోరుతున్నాడు. వారిని కూడా ఎందుకు బలి యివ్వకూడదు? మోక్షం కోరేవారికి మోక్షం ఇవ్వకుండా, ఈ మూగ జీవులకు మోక్షం ఇవ్వడం ఎందుకు?" అని ప్రశ్నించాడు. ఏ ప్రాణిని హింసించకూడదు. ఇంద్రియాల నరికట్టుకోవాలి. అదే నిజమైన సాధన అదే మోక్షమార్గం" అన్నాడు. దీనిని పురస్కరించుకొనియే బుద్ధుడు ఐదు సూత్రాలను బోధించాడు. మొదటిది సమ్యక్ దృష్టి, రెండవది సమ్యక్ శ్రవణం, మూడవది సమ్యక్ వాక్కు, నాల్గవది సమ్యక్ భావం, ఐదవది సమ్యక్ కర్మ - వీటిని అలవర్చుకున్నప్పుడే నిర్వాణం ప్రాప్తిస్తుంది. మొట్టమొదట బుద్ధుడు ఎన్ని దినములు సాధన చేసినప్పటికీ తృప్తిని పొందలేకపోయాడు. ఇదంతా ప్రయోజనం లేని పని అని గుర్తించాడు. ఎన్ని గ్రంథములు చదివినా, ఎంతమంది పెద్దల బోధనలు విన్నా ఎన్ని సాధనలు చేసినా మోక్షం లభించదు. భగవంతుడిచ్చిన పంచేంద్రియాలను సక్రమమైన మార్గంలో వినియోగించుకోవడమే మోక్షమునకు మార్గమని తెలుసుకున్నాడు.
దానికి తగిన ప్రయత్నం చేస్తూ వచ్చాడు. సమ్యక్ దృష్టి, సమ్యక్ భావం, సమ్మక్ వాక్కు, సమ్యక్ శ్రవణం, సమ్యక్ కర్మ - ఈ ఐదింటిద్వారా తాను నిర్వాణం పొందాడు. మొట్టమొదట మంచి దృష్టిని అలవర్చుకోవాలి. తద్వారా మంచి భావాలు కలుగుతాయి. మంచి భావాలు కలిగినప్పుడు మంచినే పలుకుతాము. మంచినే చేస్తాము. మంచినే పొందుతాము. కనుక, మంచిని పొందాలంటే మొట్టమొదట ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. దీనినే "యోగః చిత్త వృత్తి నిరోధ:" అన్నాడు పతంజలి. ఇంద్రియాలను నిగ్రహించు కోకుండా ఎన్ని సాధనలు చేసినా ప్రయోజనం లేదు.
(స. సా..ఆ.99 పు.276/277)
నీకొరకు ఇంద్రియములున్నవి కాని నీవు ఇంద్రియముల కొరకు లేవని తలంచవలెను. వాటికి దాసుడుకాక, నీకు అవి దాసులగునట్లు చేసుకొనవలెను."
(గీ.పు.209)
ఇంద్రియనిగ్రహమే, సౌశీల్యమే లావణ్యం
రామాయణ చరిత్రలో ఒక్కొక్క ఘట్టాన్ని తీసుకుంటే ఎంతో ఆశ్చర్యకరమైన విషయములంతా ఉంటున్నాయి. ఒక్కొక్క సమయంలో అవి చాలా విచిత్రమైనవిగా కనిపిస్తుంటాయి. దశరథుడు వస్తున్నాడు. తల్లి పడకింటిలో లేదు. రాముడు మాత్రం ఉన్నాడు. అప్పుడు రాముడు చిన్నపిల్లవాడు. తన కాళ్ళు తాను ఒత్తుకుంటున్నాడు. చూశాడు దశరథుడు. “అయ్యో, పాపం! ఆటలాడి తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులేమో! ఎవరినైనా పంపించాల”ని ఇద్దరు పనివాళ్ళను పంపించాడు. కాని, రాముడు “నాకు నొప్పులు లేవు,” అని చెప్పి వాళ్ళను పంపించేశాడు. ఎందుకోసం? “నా దేహానికి నేనే సేవ చేసుకోవాలి గాని, పరులు కాదు. పరులు నా పాదములు ఒత్తితే నేను యజమాని, వాడు సేవకుడు అవుతాడు. అందరూ ఈ జగత్తులో సేవకులే. అందరూ సమానులే,” అనే సమత్వమును నిరూపించే నిమిత్తం ఎవరితోనూ ఏ కించిత్ పనీ చేయించుకోలేదు. ఈ అవతారములయొక్క తత్త్వములు, లక్షణములు చాలా విచిత్రంగా ఉంటూ వచ్చాయి. మనం లావణ్యము అనే పదమును ఉపయోగ పెడుతున్నాము. ఏమిటీ లావణ్యము? ఇంద్రియనిగ్రహమే లావణ్యము. ఇచట దశరథుని సంగతి చెప్పాలి. దశేంద్రియములను స్వాధీనం చేసుకున్నవాడే దశరథుడు. అటువంటి ఇంద్రియనిగ్రహం కలవానికే రాముడంటి కుమారుడు పుడతాడు. - అవతారపురుషుడు ఎప్పుడూ సౌశీల్యమనే దీక్ష కల్గియుంటాడు. అదియే యౌవనమునకు మూలకారణం. అందువలన వృద్దాప్యమంటూ అతార పురుషులకు ఉండదు. వారు నిత్యయౌవనులు. కృష్ణుడు తాతగా మారినట్లుగా మీరు చూశారా? అసలు ఆతడు ముసలివాడే కాలేదు. డెబ్బై అయిదు సంవత్సరముల వయస్సులో అర్జునునికి ఆయన రథసారథిగా నిలిచాడు. అటువంటి వాడు ముసలివాడు ఎట్లవుతాడు? అలాగే రాముడు. తను కూడా అంతే. రాముడు ఎప్పుడూ లావణ్యం తొణికిసలాడుతూ నిత్య యౌవనునిగా ఉండేవాడు. దీనికి కారణం అతనిఇంద్రి యనిగ్రహమే. (రామాయణ దర్శనము వేసవి తరగతులు 2002 పు 39)
“ఇంద్రియ నిగ్రహము యోగులకు, సన్యాసులకు అవసరం కాని, . నాకెందుకు? అని కొందరు వాదిస్తుంటారు." ఇది నా కారు. నాపేరుతోనే రిజిష్టర్ చేశాను. నేనే దీనికి డ్రైవర్‌ను కూడా. మరి ఇది నాకెందుకు ప్రమాదం తెచ్చి పెడుతుంది? “అనే తలంపుతో, బ్రేకులు బాగున్నాయో! లేవో! పరీక్షించక, అహంకారంతో, ఆడంబరంతో డ్రై వ్ చేస్తే, ప్రమాదం తప్పదు. అదే విధముగ ఈ కారు అనే దేహమును కూడా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తింపజేయరాదు. ఈ దేహమే ఒకకారు. కన్నులే హెడ్ లైట్స్, కడుపు పెట్రోల్ టాంక్, నోరు హారను, మనస్సు స్టీరింగు, ధర్మార్ధ కామ మోక్షములే టైర్లు, విశ్వాసమే వాటిలో గాలి, బుద్ధియే స్విచ్, ఇంద్రియ నిగ్రహమే బ్రేకులు. కనుక ఇంద్రియ నిగ్రహము కలిగిన చిత్తశుద్ధి, చిత్తశుద్ధి కలిగిన జ్ఞాన సిద్ధి కలుగును”. (సాలీత పు213)
ఇంద్రియనిగ్రహమే, సౌశీల్యమే లావణ్యం
రామాయణ చరిత్రలో ఒక్కొక్క ఘట్టాన్ని తీసుకుంటే ఎంతో ఆశ్చర్యకరమైన విషయములంతా ఉంటున్నాయి. ఒక్కొక్క సమయంలో అవి చాలా విచిత్రమైనవిగా కనిపిస్తుంటాయి. దశరథుడు వస్తున్నాడు. తల్లి పడకింటిలో లేదు. రాముడు మాత్రం ఉన్నాడు. అప్పుడు రాముడు చిన్నపిల్లవాడు. తన కాళ్ళు తాను ఒత్తుకుంటున్నాడు. చూశాడు దశరథుడు. “అయ్యో, పాపం! ఆటలాడి తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులేమో! ఎవరినైనా పంపించాల”ని ఇద్దరు పనివాళ్ళను పంపించాడు. కాని, రాముడు “నాకు నొప్పులు లేవు,” అని చెప్పి వాళ్ళను పంపించేశాడు. ఎందుకోసం? “నా దేహానికి నేనే సేవ చేసుకోవాలి గాని, పరులు కాదు. పరులు నా పాదములు ఒత్తితే నేను యజమాని, వాడు సేవకుడు అవుతాడు. అందరూ ఈ జగత్తులో సేవకులే. అందరూ సమానులే,” అనే సమత్వమును నిరూపించే నిమిత్తం ఎవరితోనూ ఏ కించిత్ పనీ చేయించుకోలేదు. ఈ అవతారములయొక్క తత్త్వములు, లక్షణములు చాలా విచిత్రంగా ఉంటూ వచ్చాయి. మనం లావణ్యము అనే పదమును ఉపయోగ పెడుతున్నాము. ఏమిటీ లావణ్యము? ఇంద్రియనిగ్రహమే లావణ్యము. ఇచట దశరథుని సంగతి చెప్పాలి. దశేంద్రియములను స్వాధీనం చేసుకున్నవాడే దశరథుడు. అటువంటి ఇంద్రియనిగ్రహం కలవానికే రాముడంటి కుమారుడు పుడతాడు. - అవతారపురుషుడు ఎప్పుడూ సౌశీల్యమనే దీక్ష కల్గియుంటాడు. అదియే యౌవనమునకు ఆ మూలకారణం. అందువలన వృద్దాప్యమంటూ అవతార పురుషులకు ఉండదు. వారు నిత్యయౌవనులు. కృష్ణుడు తాతగా మారినట్లుగా మీరు చూశారా? అసలు ఆతడు ముసలివాడే కాలేదు. డెబ్బై అయిదు సంవత్సరముల వయస్సులో అర్జునునికి తాను రథసారథిగా నిలిచాడు. అటువంటి వాడు ముసలివాడు ఎట్లవుతాడు? అలాగే రాముడు. తను కూడా అంతే. రాముడు ఎప్పుడూ లావణ్యం తొణికిసలాడుతూ నిత్య యౌవనునిగా ఉండేవాడు. దీనికి కారణం అతనిఇంద్రి యనిగ్రహమే. (రామాయణ దర్శనము వేసవి తరగతులు 2002 పు 39)