Marriage (వివాహం) అనేది Mirage (ఎండమావి) వంటిది. ఎండమావిలో నీరున్నట్లుగానే కనిపిస్తుంది. కాని, దానివెంట పరుగులు తీస్తే నీదాహం తీరే దెప్పుడు? వివాహం వల్ల కలగే ఫలితం కూడా ఇంతే! పెళ్లి చేసుకున్న తరువాత నే "ఈమె నా భార్య" అంటున్నావు. అంతకు పూర్వం ఆమె ఎవరు? నీవెవరు? పుట్టిన తరువాతనే ఈమె నా తల్లి అంటున్నావు. అంతకు పూర్వం తల్లి ఎవరు? బిడ్డ ఎవరు? ఈ సంబంధాలన్నీ కదిలిపోయే మేఘాలవలె వస్తాయి. పోతాయి. కాని నైతిక శక్తి వచ్చి పోయేది కాదు. అది వస్తే అభివృద్ధి చెందుతుంది. దానికి ఇంద్రియనిగ్రం చాలా ప్రధానం. కాని, ఈ నాటి మానవుడు ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోడం చేత బలహీనుడైపోయాడు; దైవత్వాన్ని చేరవలసినది పోయి దీనత్వానికి దిగజారి పోయాడు. చిన్న చిన్న విషయాలకు కోపం వస్తుంది. ఇంక, అలాంటివానికి భగవత్తత్త్వం ఏరీతిగా బోధపడుతుంది? కష్టసుఖాలపట్ల నీవు సమత్వం వహించాలి. కొడుకు పుట్టాడు. సంతోషించావు. కొడుకు పోయాడు, దుఃఖిస్తున్నావు. వచ్చింది ఎవరు? పోయింది ఎవరు? మధ్యలో వచ్చి పోయేవాటిగురించి చింతించవద్దు. నీ కర్తవ్యాన్ని నీవునిర్వర్తించు. కర్తవ్య నిర్వహణయే దైవపూజగా భావించు. "ఇది నా ఇంటిపని, అది ఆఫీసుపని, అది భగవంతుని పని." అని విభజించుకోవద్దు. ఏ పని చేసినా అది దైవకార్యంగా భావించు. అదే సరియైన మార్గం.
(స. సా..జా 2001 పు.172/173)
"వివాహమంటే మనం తొడుక్కున్న బుష్ షర్టును మార్చడం వంటిది కాదు. వివాహము ఒక శాశ్వతమైన బంధము. ఒక బిడ్డ ఏడుస్తున్నప్పుడు ఆ బిడ్డను సముదాయించడానికి ఒక చాక్లెట్ను ఇస్తాము. అదే విధముగా ఇంద్రియలోలురైన మానవులను తృప్తి పరచడానికి భగవంతుడు వివాహమనే ఒక బంధమును సృష్టించి స్రీ పురుషుల కలయికకు ఏర్పాటు చేశాడు. నిజానికి ఆత్మ నిగ్రహము కొరికే ఇరువురు వ్యక్తులు వివాహమాడతారు. నిస్వార్థపరత్వమే భగవంతుడు. నీది, నాది అని భావించడం అహంకారమునకు చిహ్నము. అహంకారము చాలా ప్రమాదకరమైనది. అహంకారమును చంపుకుని ఒకరితో ఒకరు సర్దుకుపోవడం ఎలాగో నేర్చుకోవడానికి ఇద్దరు వ్యక్తులు వివాహబంధము ద్వారా చేరువవుతారు. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన చాలా అవసరం. ఈనాడు ఈ పరస్పర అవగాహనము మరచిపోయి భార్యాభర్తలు ఒకరితో ఒకరు సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తూ సమస్యల వలయంలో చిక్కుకుంటున్నారు. ఇక్కడ కావలసినది నిజమైన అవగాహన. ఇది లేకుండా ఒకరితో ఒకరు సర్దుకు పోవడానికి ప్రయత్నం చేయడం మంచిది కాదు. అసలు మొట్టమొదట భార్యాభర్తలిరువురూ ఒకరినొకరు అర్థము చేసుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు క్రమంగా ఒకరితో ఒకరు సర్దుకుపోవడం సులభతరమవుతుంది. గతాన్ని మరచిపొండి జరిగినదేదో జరిగిపోయింది. గతంలో మీ మధ్య కొన్ని అపార్థములు, విభేదములు సంభవించి యుండవచ్చు. వాటిని తలుచుకుని విచారించకండి. భవిష్యత్తులో ఏమి జరుగబోతోందో అనే విషయాన్ని ఊహించడానికి కూడా ప్రయత్నించకండి. భవిష్యత్తు ఎలా ఉంటుందో మీకు తెలియదు. వర్తమానంలో జీవిస్తూమీకు చేతనయినంత చేయడానికి ప్రయత్నించండి. వివాహబంధము చాలా పవిత్రమైనది. మీరిద్దరూ పరస్పర అవగాహనతో సహజీవనం చేస్తామని ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నారు. వివాహమునకు పూర్వము మీరు ఒక ప్రత్యేక వ్యక్తిత్వముగల "నేను". అలాగే ఆమె కూడా ఒక ప్రత్యేక వ్యక్తిత్వము గల "నేను”. ఇప్పుడు మీరిద్దరూ కలసి "నేను" + "నేను" = "మనం" అయ్యారు. ఇకనుండి మీరు "నేను" కాదు "మనం". ఆమెకు ఏదైనా కష్టము వచ్చినప్పుడు మీరు "ఆమె" ఆనుకోకుండా "మనం" ఆనుకోవాలి. అలాగే భర్తకు ఏదైనా ఆపద సంభవిస్తే భార్య "ఆయన" అనుకోకుండా "మనం" అనుకోవాలి. జీవితం పూర్తిగా కష్టములు, సమస్యలతో నిండియుంటుంది. అటువంటి సమయాలలో మీరు విడిపోకుండా ఇద్దరు కలసి వాటిని ఎదుర్కొవాలి. వివాహబంధము నుండి విడిపోవాలనే ఆలోచనే రాకూడదు. త్యాగభావంతో ఒకరితో ఒకరు సర్దుకుపోవాలి.అదేవైవాహిక జీవితంలో ఒకరి హృదయమును ఒకరికి అర్పించడం అంటే.
ఇతరులకు ఇవ్వడం క్షమాగుణం ద్వారా ప్రేమ వృద్ధి పొందుతుంది. స్వార్థము ఇతరుల నుండి తీసుకోవడం, వారిని మరచిపోవడం ద్వారా అభివృద్ధి చెందుతుంది. స్వార్థరాహిత్యమే ప్రేమ, ప్రేమ రాహిత్యమే స్వార్థము. వివాహమునకు పూర్వము మీ ఇద్దరి ప్రేమలు వేరువేరుగా ఉంటాయి. వివాహమయిన తరువాత మీ ఇద్దరి ప్రేమలు ఒక్కటై చిగురిస్తాయి.
(దై.ది.పు.359/361)
(ఒకసారి పెళ్ళి ప్రసక్తి వచ్చింది. ) దగ్గర సంబంధాలు చేసుకోకూడదు. క్రొత్త సంబంధమయితే ప్రతిభావంతులైన పిల్లలు పుడతారు. దగ్గర సంబంధమయితే రక్తం ఒక్కటే అవడంచేత శరీర ఆరోగ్యముగ బుద్ధిశక్తి కూడా తగ్గిపోతాయి. అట్లే వంశపారంపర్యంగా రోగం ఉన్న ఇంటికి దేవుడులేడనే నాస్తికుల ఇంటికీ పిల్లని ఇవ్వకండి. గూనివానికీ ఇవ్వకూడను అసలు వివాహం ఎందుకో తెలుసా? ప్రారంభంలో భార్యాభర్తలు ప్రేమకు ఇచ్చిపుచ్చుకుంటారు. పిల్లలు కలిగాక ఆ ప్రేమ వారిపైన ప్రసరిస్తుంది ఇంటిలోని వారిమీద, ఇరుగుపొరుగు వారిమీద, సమాజం మీద క్రమంగా ప్రేమ ప్రసరిస్తుంది. ఇలా మనస్సు విశాలమయ్యేందుకు అది దారి అవుతుంది. విశాలప్రేమే జీవితం! ( అని స్వామి చెప్పారు.) ((శ్రీ సత్య సాయి ఆనందసాయి పు 140-141)
"ఈనాడు వివాహములు విశేషమైన శ్రమతో కూడిన ఏర్పాట్లతో, ఆడంబరమైన వేడుకలతో నిండి ఉంటున్నాయి. పెళ్ళిచేసుకుంటుంటే చాలా సంతోషంగానే ఉంటుంది. కాని, ఈ సంతోషము తాత్కాలికమైనది, కదిలిపోయే మేఘమువంటిదనిచాలామందికి తెలియదు. నిజమైన ఆనందము. దేనివలన లభిస్తుందో చెప్పగలవా ఓ మనసా? భగవంతుని దివ్యసన్నిధే నిజమైన ఆనందాన్ని ప్రసాదించేది". (పిల్లల పెంపకం రీటా బ్రూస్ పు11)
వివాహమనేది భగవంతుడు మానవజాతికి ప్రసాదించిన మొట్ట మొదటి సాంఘిక వ్యవస్థ. ఇంత పవిత్రమైన వ్యవస్థ ఈనాడు కేవలం లైంగిక వ్యవస్థ స్థాయికి దిగజారిపోయింది. అందులో ఒక వ్యక్తి మనకు నచ్చకపోతే వేరొక వ్యక్తిని వెతుక్కోవచ్చు. ఈ విషయంలో మనం మనలోని దివ్యత్వమును మరచి కేవలం జంతువులవలె ప్రవర్తిస్తున్నాము. ఈనాడు పిల్లలను పెంచడానికి అనేక రకాల సంబంధాలు, సంస్థలు అందుబాటులో -నున్నప్పటికి, వైవాహిక జీవితం గడుపుతున్న దంపతులనే స్వామి ఇందుకు సరియైన వ్యవ్యస్థగా గుర్తించారు. భార్యాభర్తలుగా కలసి జీవించడం స్వామికి అంగీకారమేగాని, వివాహం చేసుకోకుండా స్త్రీ పురుషులు కలసి జీవించడం స్వామికి ఇష్టం లేదు. వివాహబంధము ద్వారా మీ జీవిత భాగస్వామి కాని వ్యక్తితో మీరు లైంగిక సంబంధం ఏర్పరచుకుంటే, భగవంతుడు మానవజాతికి ప్రసాదించిన పవిత్రమైన వివాహ వ్యవస్థనే మీరు తృణీకరిస్తున్నారన్నమాట. (పిల్లల పెంపకం రీటా బ్రూస్ పు-12,)
వివాహం కాకముందు ఆయనది సగం శరీరం ,ఆమెది సగం శరీరం. వివాహమైన తరువాత ఈ రెండు భాగాలు కలసి ఒకే శరీరమవుతాయి .ఇందులో ఎడమభాగము స్త్రీ . కుడిభాగము పురుషుడని –‘స్వామి చెపుతారు’ (పిల్లల పెంపకం రీటా బ్రూస్ పు13,)
వివాహం కాకుండా స్త్రీ, పురుషులిద్దరూ కలసి జీవిస్తూ……
అందులోఒకరు ఇంకొకరిని విడిచి పెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఏక శరీరంగా కలసిపోయిన రెండు భాగాలను శస్త్రచికిత్స ద్వారా విడదీయటంలా ఉంటుంది. ఈ ఇద్దరిలో సాధారణంగా ఒకరు ఇంకొకరితో తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోదామనుకునేవారు, మిగిలినవ్యక్తి ఇద్దరం కలసి ఉందాము అనేవారు. అయివుంటారు. అందువలన, విడిపోవడానికి ఇష్టంలేని వ్యక్తి యొక్క మనస్సు తీవ్రంగా గాయపడుతుంది. శారీరకంగా, మానసికంగా, ఆధ్యా త్మి కం గా ఆ వ్యక్తికి తగిలిన గాయాల మచ్చలు చేతనాచేతనావస్థలలో మనస్సు పై శాశ్వతంగా నిలిచిపోతాయి.
"వివాహమంటే కేవలం కొన్నిరోజులు, వారాలు, సంవత్సరాలతో ఆధ్యా త్మి కం గాముగిసిపోయే వ్యవహారం వంటిది కాదు. జీవితాంతమువరకు నిలిచిపోయే పవిత్ర బంధం ము " అంటారు. స్వామి…. (పిల్లల పెంపకం రీటా బ్రూస్ పు13)
“నిస్వార్థమే భగవంతుడు. నీది, నాది అనే భేదభావము అహంకారానికి చిహ్నం. ఈ అహంకారమును నిర్మూలించుటకొరకే ఇద్దరు - స్త్రీ పురుషులు వివాహము ద్వారా ఒక్కటవుతారు. వైవాహిక జీవితంలో ఇద్దరూ ఒకరితో ఒకరు సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తూ తమ అహంకారాన్ని మర్చి పో తారు" అని స్వామి చెపుతారు.
మొట్టమొదట మీరిద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోండి. ఆ త రువాత ఒకరితో ఒకరు సర్దుకుపోవటం సులభమవుతుంది. దీనికి విరుద్ధంగా నూటికి తొంభైమంది సర్దుబాటుకు ముందుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరి యైన పధ్ధతి కాదు.
మొట్టమొదట కావలసినది, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒక్కొక్కప్పుడు మీకు కోపము, అహంకారము, మాటదురుసుతనము , మానసికఒత్తిడి ఇటువంటివి సహజంగానే కలుగు తుంటాయి. అయితే, అటువంటి పరిస్థితులలో మీరు ఇతరులను అర్థం చేసుకుని సర్దుకుపోయే స్వభావమును పెంపొందించుకోవాలి”, అని స్వామి చెపుతారు. (పిల్లల పెంపకం రీటా బ్రూస్ పు17)
“భర్త మనసు తెలుసుకుని మృదుమధురంగా సంభాషించగల స్త్రీయే ఆయనకు నిజమైన స్నేహితురాలు. ఎందువల్లనంటే ఒక్కొక్కప్పుడు భర్తను సక్రమమైన మరియు ధర్మమార్గంలో నడిపించవలసిన సమయంలో భార్య తండ్రి పాత్రను కూడా పోషించవలసివస్తుంది! అలాగే, భర్త అనారోగ్యంతో మంచాన పడినప్పుడు ఆమె తల్లివలె అతనికి సపర్యలు చేయగలదు కూడా" అని స్వామి చెపుతారు. (పిల్లల పెంపకం రీటా బ్రూస్ పు22)
“ఇకనుండి భర్తయొక్క కష్టాలు భార్యవి, భార్య కష్టాలు భర్తవి. ఇది, శరీరంలో ఒక భాగమునకు పక్షవాతం వచ్చి కదలలేకపోతే మిగిలిన భాగముకూడా ఆ పక్షవాతముయొక్క బాధను అనుభవించడం వంటిది. మీ కష్టసుఖాలను మీ భార్య, మీభార్య కష్టసుఖాలను మీరు పంచుకోవాలి. మీ ఇద్దరి బాధలు స్వామి నివారణ చేస్తాడు. మీ ఇద్దరికి స్వామి ఉన్నాడు. భర్తకు భార్య, భార్యకు భర్త ఎల్లవేళలా సహాయపడాలి” అని చెపుతారు స్వామి. (పిల్లల పెంపకం రీటా బ్రూస్ పు24)
“భార్యాభర్తల మధ్య పవిత్రమైన ప్రేమ బంధముచే నిర్మింపబడిన, వారి ఆత్మోన్నతికి దోహదం చేసే స ద్గ్రంథములు ప్రతినిత్యం అధ్యయనం చేయబడుతున్న, నిత్యము భగవన్నామ సంకీర్తన, నామస్మరణ జరుగుతున్న గృహమే భగవంతునికి నిజమైన ఆలయము" అని స్వామి చెపుతారు. (పిల్లల పెంపకం రీటా బ్రూస్ పు29)