భారతీయులకు ప్రధాన అంగం వేదం. "సత్యం వద - ధర్మం చర" అని బోధించింది వేదం. సత్యమును ఉచ్చరించు. ధర్మమును ఆచరించు అని చెప్పింది వేదం. ఈనాడు సత్యమును ఉచ్చరించడం లేదు. ధర్మమును ఉచ్చరిస్తున్నారే కాని, ఆచరించటం లేదు. ధర్మమును ఆచరించాలి. " ధర్మోరక్షతి రక్షితః" ధర్మమే మనలను రక్షించేది.
ధర్మమంటే ఏమిటి? మన ఆచారాలు సాంప్రదాయాలు మాత్రమే కావు. "మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం" ఇదే మానవుని యొక్క ధర్మము. The proper Study of Mankind is man. ఈ మూడింటిని ఏకత్వము గావించాలి. అప్పుడే త్రికరణశుద్ధి ఏర్పడుతుంది. ఆత్రికరణశుద్ధి యే మానవుని ధర్మం ..
ఈనాడు మాటలు వేరు, తలంపులు వేరు, క్రియలు వేరు, కావటము చేతనే ధర్మము క్షీణించిపోయినది. "సత్యాన్న ప్రమదితవ్యం" ఎలాంటి పరిస్థితులు యందునను సత్యాన్ని వదలవద్దని. "ధర్మాన్న ప్రమదితవ్యం" ధర్మాన్ని వదలవద్దని, ఉపనిషత్తులు తెలుపుచున్నవి. ఎలాంటి సమయములో నైనా - ప్రాణాపాయం సంభవించినా, ధర్మాన్ని వదలరాదు. అదే హరిశ్చంద్రుడు సాధించిన వ్రతం. ఉపనిషత్తులు ఇటువంటి పవిత్రమైన సత్యాన్ని భోధిస్తూ వచ్చాయి. సత్యమునకే విజయము. విజయాన్ని సాధించవలసినవాడు ధర్మాన్ని అనుసరించాలి. ధృతరాష్ట్రుడు సంజయడ్ని ప్రశ్నించాడు. పాండవులు, కౌరవులు, ఇరువురూ యుద్ధభూమిలో చేరినారు. వారు ఏమి చేస్తున్నారు? యుద్ధ భూమికి పోయినవారు యుద్ధం చేస్తారు కాని విందు చేయరుకదా? యుద్ధము సంభవించినది. యుద్ధం చేస్తున్నారని సంజయుడు తెలిపినాడు. నీ ఉద్దేశముతో ఎవరికి విజయము సంభవిస్తుందని ప్రశ్నించాడు ధృతరాష్ట్రుడు. ఇంద్రియములను లొంగదీసుకున్నవాడు సంజయుడు. ఇలా అన్నాడు –
"యత్ర యోగేశ్వర: కృష్ణో, యత్ర పార్థో ధనుర్ధరః,
తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువా నీతి ర్మతిర్మమ"
.
ఓ మహారాజా! ఎక్కడ సర్వశక్తిమంతుడైన భగవంతుడు, ఎక్కడ సర్వధర్మపరాయణుడైన నిర్మలుడు అర్జునుడు ఉందురో, అక్కడే విజయు. ఈ విజయానికి సత్యధర్మ స్వరూపమైన భగవదనుగ్రహమే ప్రధానమని భోధించినాడు. (దే.యు.పు.42/43)
మానవునికి దైవ విశ్వాసం చాల ప్రధానమైనది. దేవుడు ఎవరు? ఎక్కడున్నాడు? అని అనేకమంది ప్రశ్నిస్తుంటారు. సత్యమే దైవం, ప్రేమయే దైవం. భారతీయుల సత్యం, అమెరికన్ సర్యం, జర్మన్ సత్యం అనే భేదం లేదు. ప్రపంచమునకంతా సత్యం ఒక్కటే, అదే దైవం. అదేవిధంగా ప్రేమయే దైవం. కనుక, ప్రేమలో జీవించండి. ఈ ప్రేమ దేహసంబంధమైనది కాదు. హృదయ సంబంధమైనది. దేహమొక నీటి బుడగ, మనస్సొక పిచ్చి కోతి. కనుక, దేహాన్ని, మనస్సును విశ్వసించకండి, అంతరాత్మను అనుసరించండి. అప్పుడే మీకు సత్యం గోచరిస్తుంది. (స..డి.99.పు.366)
నేను సత్యస్య సత్యమ్ - నేను సత్యములలో సత్యమును
(శ్రీ. . ప్రే. స..పు.224)
రమణీ శిరోమణి రావచ్చు పోవచ్చు.
శాశ్వతమైనది సత్యమెక్కడ!
రాజ్యభోగములెల్ల రావచ్చు పోవచ్చు
శాశ్వతమైనది సత్యమెక్కడ !
భ్రాతలు బంధువుల్ రావచ్చు పోవచ్చు
శాశ్వతమైనది సత్యమెక్కడ !
లోకమందు ఆధికార భోగముల్ రావచ్చు పోవచ్చు
శాశ్వతమైనది సత్యమెక్కడ !
సరస సన్మార్గ తత్వంబు తెలియజెప్పి
అమృతమ్ము - అదియె సకల సౌభాగ్యమందు
భువిని సత్యంబె పరమ సౌభాగ్యమందు
(ది.ఉ =19.11.2000)
సత్యంబునందుండి సర్వంబు సృష్టించే
సత్యమందణగె సర్వసృష్టి
సత్యమహిమ లేని స్థలమేది కనుగొన్న
శుద్ధ సత్వ మిదియె చూడరయ్య
(ద.స.98వు. 3)
పుడమిన అవతరించిన ప్రతి మానవునకు సత్యమే ప్రత్యక్ష దైవము. ఈ చరాచర ప్రపంచమంతయు సత్యము నుండియే ఆవిర్భవించి సత్యమునందే జీవించి సత్యమునందే లీనమగుచున్నది. “సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ’ బ్రహ్మ సత్యము. అనంతమైనదీ సత్యము. ఈ బ్రహ్మకు ఆత్మ అని పేరు నిత్యమైన బ్రహ్మము "సత్య" అన్నారు వేదాంతులు. ప్రతి మానవుడు గౌరవించవలసినది సత్యమును మాత్రమే. భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాచణులు. జ్ఞానమే భారతీయుల ఆటపట్టు, ప్రతి మానవుడు సత్య ధర్మములకు వారసుడే. సహృదయులు, శాంతికాములు అయిన యువతీయువకులు సత్యాన్వేషణకై సత్యాచరణకై తగిన కృషి చెయ్యాలి. లోకహితమే భారతీయుల అభిమతము. అదియే యువకుల వ్రతము, అదియే మనమతము. ఇట్టి పవిత్రమైన సత్యమును సంస్కృతిని ఈనాడు విస్మరించటము చేతనే జాతి సమైక్యతమ దేశ సమగ్రతమ మనము సాధించలేక పోతున్నాము. సత్యము ధర్మము దేనికిని లొంగవు. భుజబలము, బుద్ధిబలము, అధికారబలము, ఆయుధ బలము కూడను. సత్యధర్మములకే లొంగవలసినవి. కాని సత్యధర్మములు దేనికీ లొంగునవి కావు. విజయము ఎల్లప్పుడు సత్యధర్మములనే వరిస్తూ వుంటాది. (బృత్ర.పు. 12)
కనులకగుపడు దృశ్యంబు గాంచి మీరు
సత్యమిదియని ఎంచక! సంబరమున
తెరను దాగిన సత్యంబు తెలిసికొనగ
విశ్రమింపకనా తో, వెడలిరండు.
(సాపు,204)
సమస్త ధర్మములకు సత్యమే ఆధారం ‘సత్యంనాస్తి పరోధర్మ:"
(స. సా .జూ1989పు.143)
సత్యమే ఈశ్వరలోకే
సత్యం పద్మాసితాసమ్
సత్యమూలం ఇదం పుణ్యం
సత్యం నాస్తి పరం సుఖమ్"
ప్రేమస్వరూపులారా! ఈ ప్రపంచమంతయూ సత్యంతోనే నిండియున్నది. సత్యం సర్వత్రా వ్యాపించినటువంటిది. ధనకనక వస్తు వాహనాదులు, భోగభాగ్యములు కూడనూ సత్యమునే ఆశ్రయించి వున్నవి. సత్యమే లేకుండిన లోకమేలేదు. ఈనాడు సత్యమును కోల్పోవటంచేతనే, మానవులు అనేక విధములైన కష్టములకు గురి అవతూ వస్తున్నారు. సత్యము చాలా విలువైనటువంటిది. ఒకరు దాచితే దాచేది కాదు. ఒకరు మార్చితే మారేటటువంటిది కాదు. "త్రికాల భాజ్యం సత్యం", మూడు కాలములయందునూ మారనటువంటిదే సత్యం. ప్రాచీనకాలము నుండి భారతీయులు సత్యమునే ఆశ్రయించి, సత్యమునే పలుకుతూ, సత్యజీవితం గడుపుతూ రావటం చేతనే, భారతదేశం నాటినుండి నేటివరకునూ సుక్షేమంగా వుండగలిగింది. సత్యం చేతనే భారతీయులు యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక జీవితమును ప్రకటించగలిగారు. ”లోకాస్సమస్తా స్సుఖినో భవంతు" అనే ఆదర్శము ఈ సత్యమువలననే ఆవిర్భవించింది. ఇట్టి పవిత్రమైన, నిత్యసత్యమైన సత్యమును ఈనాడు మానవులు మరచి పోతున్నారు. సత్యమేలేకుండిన ధర్మమేలేదు. సత్యం నాస్తి పరోధర్మ: సత్యమే మనకు ప్రధానమైన ధర్మము. సత్యమే మానవులకు ప్రాణం. సత్యమే లేకుండిన మానవత్వమే లేదు. మానవతా విలువలు సత్యము పైననే ఆధారపడి ఉన్నాయి.
ప్రేమస్వరూపులారా! సత్యం చాలా గొప్పది. ఈ సత్యం కోసం ఆలుబిడ్డలను అమ్ముకొని కాటికాపరి అయినాడు సత్యహరిశ్చంద్రుడు.
సత్యంబు నందుండి సర్వంబు సృష్టించే
సత్యంబు నందణగె సర్వ సృష్టి
సత్య మహిమలేని స్థలమేది కనుగొన్న
శుద్ధ సత్యమిదియె చూడరయ్య!"
సత్యము చిన్ని పదముగా మనకు గోచరిస్తుంది. కాని సత్యమును అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఈ సత్యము సందే సర్వస్వమూ యిమిడి ఉన్నది. యావత్ ప్రపంచమూ ఈ సత్యము పైననే ఆధారపడి ఉన్నది. అట్టి ఆధారమైన సత్యమును మనం కోల్పోయిన, మన జీవితం ఏగతి పాలవుతుoది? సత్యం లేని స్థానమే లేదు. సత్యం సర్వత్రా వ్యాపించినటువంటిది. (శ్రీ ఆ.2001వు.7)
ఒకానొక సమయంలో ఇంద్రుడు ప్రహ్లాదునివద్దకు వెళ్లి అతని శీలము దానమిమ్మని కోరాడు. అడిగిన వారికి లేదనక ఇచ్చే స్వభావము ప్రహ్లాదునిది. ఇంద్రుడు కోరినట్లుగా తన శీలమును ధారపోశాడు. శీలముతోపాటు శౌర్యము, యశస్సు, కూడా అతనిని వదలి పెట్టి వెళ్ళి పోయాయి. కాని ప్రహ్లాదుడు లెక్క చేయలేదు. కాని కట్టకడపటికి సత్యము కూడా అతనిని వదిలి పెట్టి పోవడానికి ప్రయత్నించగా ప్రహ్లాదుడు అడ్డుకుని "ఏవరు పోయిన నాకు దుఃఖము లేదుగాని నీవు మాత్రము నన్ను వదలిపోకూడదు అని ప్రార్ధించాడు. ఎప్పుడైతే సత్యము ప్రహ్లాదుని దగ్గర నిల్చిపోయిందో అప్పుడు పోయిన యశస్సు, సంపద సర్వస్వము వెనుకకు తిరిగి వచ్చాయి. విద్యార్థులారా! మీరు ఆఫీసులోనైనా, ఫ్యాక్టరీలోనైనా ఏమాత్రము జoకు లేక సత్యమునే పాటించండి: ధర్మాన్ని అనుసరించండి. ఏమిటి ధర్మము? అంతరాత్మ (కాన్షియన్స్) ను అనుసరించడమే నిజమైన ధర్మము. వేదము “సత్యం వద, ధర్మంచర" అని బోధించింది. పూర్వకాలంలో విద్యార్థులు ఋషుల దగ్గర విద్య నభ్యసించి గురుకులమును వదిలి వెళ్ళే ముందుగా వారిని చేరదీసి ఋషులు వారికి ఈ విధమైన సద్బోధలు గావించేవారు. దీనినే స్నాత కోత్సవము(కాన్వాకేషన్) అని అన్నారు. (ససా.డి..96పు.321)
శాస్త్రంబునెప్పుడు సత్యంబుగా నమ్ము
వేదసమ్మతులైన విప్రులార!
దేశంబు కొరకునై దేహమర్పణ చేసి
రహిమించు రాజాధిరాజులార!
ధనధాన్యములు గల్గి ధర్మగుణంబుతో
వరలుచుండెడి వైశ్య వర్యులారా
వ్యవసాయ వృత్తిచే నాహారమందించి
సుఖజీవనము చేయు శూద్రులార!
కాలమంతయు నూరక గడుపనేల?
సర్వజన సమ్మతమ్మగు సత్యమైన
భక్తిమార్గము గొను డిహపరము లిచ్చి
సత్యముగ మిమ్ము సాకును సాయిబాబా
(సంపుటి – 37 సంచిక - 04శ్రీవాణి 2021)