అహంకారము యెన్ని అవగుణము లున్నవో వాటన్నిటికిని పుట్టినిల్లు వంటిది. అహంకారికి మంచి, పుణ్యము, పాపము, సత్యము, దైవము యేవీ లేవు. వుండవు. ధర్మము వానికి యే మాత్రము తెలియదు. న్యాయము వానికి సరిపడదు. ఇట్టి దురుణములు లేకుండుటే అనహంకారము. అహంకారము మిత్రునివలె వుండు శత్రువు అని తెలుసు కోనవలెను.
(గీ. పు. 209)