చిన్నపిల్లలు మరణిస్తే వారికి పునర్జన్మ ఉండదు. ఎటువంటి పిల్లలో తెలుసా తల్లితండ్రులకు ఎటువంటి జబ్బుఉండకూడదు. ఆరోగ్యంగా ఉండాలి. శిశువు కూడ ఏరోగము లేక ధృడశరీరము కలిగి ఉండాలి. అటువంటి బిడ్డ మరణిస్తే పునర్జన్మ లేదు. పదహైదు సంవత్సరాల లోపల మరణిస్తే ముక్తజీవులౌతారు. ఎందుకంటే ఆ వయస్సు లోపు వారిలో కామక్రోధాలు చోటు చేసుకోవు. యోగులకు గర్భవాసం బాల్యం అనే కర్మలు గానే ఉంటేవారు పుట్టి అవి అనుభవించి తక్షణం మరణిస్తారు. అది వారికి చివరి జన్మ అవుతుంది.
ఆయుర్దాయం పూర్తి కాకుండా ఆత్మహత్య చేసుకోకూడదు. అది మహాపాపం. కొత్తగా సమస్యను తెచ్చుకోవటం. అద్దె ఇల్లు సంపాదించకుండా, ఉన్న ఇల్లును ఖాళీ చేయడం వంటిది. ఆత్మహత్య చేసుకుంటే నడి రోడ్డు మీద పడాలి. ప్రేతాత్మగా దిక్కు మొక్కులేక బాధపడాలి.
(త్రి. సా.పు. 222)
పాంచభౌతికము, దుర్భలమైన కాయంబు,
ఎప్పుడో విడిచేది ఎరుక లేదు!
శతవర్షములదాక మితము చెప్పిరి కాని,
నమ్మరాదామాట నెమ్మనమున|
బాల్యమందో, లేక ముదిమియందో లేక ముసిలి యందో,
ఈడనో, ప్రాయమందో ఉదకమధ్యమున!
ఎప్పుడో విడిచేది ఏక్షణములో
మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన|
దేహమున్నంతలో తెలియవలయు!
(సా.పు.198)
పోకన్ మానదు దేహమెవ్విధమునన్
పోషించి రక్షించినన్
రాకన్ మానవు హానివృద్దులు
మహారణ్యoబునన్ దాగినన్.
(శ్రీవాణి జూన్ 2021 పు. 7 )