మరచిపోవలెను

అత్యంతాశ్చర్యకరమైన విషయమేమిటంటే మానవులు ఎవరికి వారు. తమకు మరణము సంభవించుననే విషయములో అనేక అపోహలకు లోనగుదురు. పుష్పములు, వడలి నేలరాలక ముందు వికసించి పరిమళమును వెదజల్లును. మానవుడు తన అంత్యకాలమాసన్న మైనపుడు విచారవదనుడగును. పుష్పమువలె అంత్యకాలము సమీపించినప్పుడు తేజోమయుడై సత్కార్యములను చేపట్టవలెను. మానవుడు రెండు విషయములను ఎప్పటికీ గుర్తుంచుకొనవలెను. అవి, మరణము, భగవంతుడు. ఇక రెండు విషయములను మరచి పోవలెను. అవి మనకు ఇతరులు చేసిన హాని, మనము. ఇతరులకు చేసిన మంచి వీటిని విడిచి పెట్టకుండా జ్ఞప్తియందుంచుకోవడమంటే కొన్ని ఫలితములనాశించి ప్రాకులాడుట. అప్పుడు వాటి పరిణామములను కూడా అనుభవించవలసి వచ్చును. మనము ఏమి యోచించినా, మన మనస్సులో ఏభావమునకైనా స్థానము కల్పించినా మనము ప్రతిఫలమును అనుభవించెదము. అయితే మరణము సంభవించునను సత్యమును ఎప్పుడూ మనస్సునందుంచుకొనవలసినదే. దీని వలన సత్కార్యాములను చేపట్టి హానికరములైన పనులకు దూరముగా నుండుటకు అవకాశమున్నది.

(.పు.95)


About Us

Sri Tumuluru Krishna Murty and his late wife, Smt. Tumuluru Prabha are ardent devotees of Bhagavan Sri Sathya Sai Baba

Read More

Reach Me

Sri Tumuluru Krishna Murty

E-mail : hello@srisathyasaidigest.com

Subscribe For Contemplate Massage