విద్యార్థులారా! చక్కగ మీరు గుర్తించవలసిన విషయము, హాస్టలులో కానీ మరెక్కడైనా సరే బ్రహ్మార్పణము గావించి భుజించమని భోధించాము. ఎందుకనగా ఆహారములో అనేక రకములైన ఆశుద్థములు చేరుతుంటాయి. పాక శుద్ధి - పాత్ర శుద్ధి - పదార్థ శుద్ది,పదార్థములను శుభ్రంచేసి పెట్టుకున్నంత మాత్రాన అవి శుద్ధి కావు. మనం తెచ్చుకున్న కూరకాయలు, వండించి తెచ్చినాడో, దొంగలించి తెచ్చినాడో మనకు తెలియదు. కనుక ఈ కూరగాయలలో అనేక దోషాలుంటాయి. ఇలాగ పదార్థముయొక్క దోషాలు విచారించడం సాధ్యము కాదు. వంటవాని thoughtsఎలాంటివో మనము విచారించలేము. కనుక ఎన్ని దోషములున్నను - బ్రహ్మార్పణం గావిస్తే - భగవదర్పితము గావిస్తే - అది ప్రసాదము అవుతుంది. కానీ, పదార్థములు కావు. ప్రసాదముగా మారినప్పుడు దాంట్లో పెట్టి దోషములుండవు. నాలుగు రకములుగా మనము భుజించే ఆహారమును భగవంతుడు పరిశుద్ధం చేస్తున్నాడు. ఇవి ఏమనగా - భక్ష్య, భోజ్య లేహ్య చోష్యములు.
(స.సా.అ..89పు.220)
"రోజుకు రెండుసార్లు క్రమం తప్పకుండా ప్రార్థనలు చేయడం వల్ల వ్యాధులకు తట్టుకోగల శక్తి, ధైర్యం లభిస్తాయి. భగవంతుని అనుగ్రహం మనశ్శాంతిని కలిగిస్తుంది. కనుక నీవు నూటికి నూరుపాళ్ళూ భగవంతుని మీద ఆధారపడి ఉన్నానని భావించు. ఆయన నిన్ను జాగ్రత్తగా చూసుకొని అపాయం నుండి, కష్టం నుండి కాపాడుతాడు."
(లో.పు.124)
"బ్రహ్మాండమంతట ప్రబలుచుండెడి నీకు
ఆలయంబునమర్చ నలవియగునె?
కోటి సూర్యులకాంతి మేటివయిన నీకు
ప్రమిద దీపం బెట్లు పెట్టగలను?
అజహరాదులకైన ఆందనివాడవు
నీరూపు కనుగొన నెవరి తరము?
సర్వజీవులయందు సంచరించెడు నీకు
సరియైన పేరిడ సాధ్యమగునె?
వసుధ తెలుసుకున్నది సాయిబాబయనుచు
ఇతరమైనది నేనేమి ఎరుగనయ్య
సర్వమును నే వేయని నిన్ను సన్నుతింతు
మరువనెప్పుడు బాబ నా మనసుతీర
ముంచు నీళ్ళను పాలనో విడువవెపుడు".
(లో పు.1)
నిద్రమంచి మేల్కొనటం జన్మించటమని, నిద్రలోకి వెళ్ళటం మరణించటమని తెలిసి కొనండి. ప్రతిరోజు నిద్రనుంచి మేల్కొనగానే "పరమాత్మా! నేను నిద్ర గర్భము నుంచి జన్మించాను. సకల చరాచర ప్రపంచమునకు ప్రభువై, నాహృదయ వాసివై ఉన్న నిన్నే తలచి నీ కొరకే అన్ని కార్యకలాపములను చేయపూనుతున్నాను. నీకే ర్పణముగా నేను పలికే మాటలు, తలచే తలపులు, చేసే కర్మలు పవిత్రమొనర్చి, అనా నుంచి మంచి మాటలు, మంచి తలపులు, మంచి పనులు వచ్చునట్లు చేసి, నేను ఎవరిని బాధింపక, నేను బాధపడకుండునట్లు నన్ను నడిపించు"అని ప్రార్థించండి.
అదేవిధంగా నిద్రలోకి వెళ్ళేటప్పుడు "పరమాత్మా! నేనింతవరకు నీవు చేయించన పనులను చేశాను. నీవు ప్రేరేపించిన తలపులనే తలచాను. నీవు పలికించిన మాటలనే పలికాను. నేను నడచిన నడకలు, పలిగిన పలుకులు తలచిన తలపులు అన్ని నీవే నడిపించి, పలికించి, తలపించినవి. ఈ దినమున నిత్యవ్రతము సమాప్తమైనది. నన్ను ఇంక నిద్రలోనికి తీసుకో. పరమాత్మా! నాకు ఎల్లవేళలా శాంతి సుఖములను ప్రసాదించేది - నీ ఒడి ఒక్కటే" అని ప్రార్థించండి.
వెలుగును ప్రసాదించే మీ ఆత్మను మీరు గురువుగా స్వీకరించటమే అన్నిటికన్నా మంచిపని. ఆ అంతరాత్మయే, అంతర్గతంగా ఉన్న ఆ గురువే మీకు సత్యమును ప్రకటిస్తాడు. ప్రార్థనా పూర్వకమైన ఈ మనస్తత్వము మీ గుణములను, మీ జ్ఞానమును అభివృద్ధి చేస్తుంది.
(వ.61-62 పు.56)
దుర్భావములు, దుస్సంకల్పములు విసర్జించి నిత్యమూ 4 గంటలకు లేచి ధ్యానమూ, సంకీర్తనా చేయండి. పడకమీద లేచి కూర్చుని చిన్న ప్రార్థనచేయండి.
సుషుప్తి మాతా సుషువే శిశుంతత్ అహం నిశ్చయం తత్ర సద్యఃకరోమి
యద్యత్కృతం తద్భవతు త్వదర్ధం హృదిస్థితే రాజ్ఞి చరాచరాణాం
ఉక్తం మతం దేవ తథా కృతంచ హవ్యం తతః పావన పూతమస్తు
కుర్యాం నకించిత్ పరపీడనాయ పరోపి మహ్యం నతథాదునోతు.
నీపై భారమువేసి నా కార్యక్రమములను నేను పూనుకున్నాను. అని అంతా తనపై అర్పించి కార్యక్రమమునకు పూనుకో.రాత్రికి పుట్టిన పడక మీదనే తిరిగి చేరుతున్నావు. కనుక అది మరణముగా భావించు "స్వామీ! నీవు యిచ్చిన కార్యాన్నే ఆచరించాను. అది నికే అర్పిస్తున్నాను. ఏవైనా తప్పులు ఉంటే మరల అవి చేయకుండా కాపాడు." అని అతనికి అర్పించి అతనిలో చేరిపో. ఇట్లు నిరంతరమూ చేసుకుంటే తప్పులు రావు కర్మఫలం మిమ్మల్ని అంటదు. అవసరమైన భావములలో స్నానము చేయక భగవత్ నామంతో స్నానంచేయి. భుజించే టప్పుడు కూడ అనేకమాటలతో కుక్కలుగా తినటంకాదు. తింటున్నప్పుడు ప్రసాదం నాఆత్మస్వరూపానికి అందిస్తున్నానని భావించు. ప్రసాదం దోషరహితమైన అమృతస్వరూపం అన్నారు. ఈనాడు పాత్ర శుద్ధి, పాకశుద్ధి, పదార్థశుద్ధి అన్నీ చూసుకోవటం కుదరదు కనుక నీ ముందు పెట్టగానే భగవంతుని కర్పించు. సర్వదోషములు పరిహారమై పోతాయి. .
(వే. ప్ర.పు.194/195)
ప్రార్థన చేయటానికి కావలసింది అనవసరపు హంగులూ ఆర్భాటాలు కావనీ, ప్రార్ధన కేవలం భగవంతునిలో మనం ప్రత్యక్షంగా సంభాషిస్తున్నట్లుగా ఉండాలి.
(శ్రీ.స.ప్రే...పు.79)
"సత్యసాయి కాలేజిలో ప్రతి పని ముందు ప్రార్థన చేయమని చెప్పినాను. పరీక్షాధికారులు పరీక్ష జరిగే హాలులోనికి వచ్చినారు. ప్రశ్నపత్రములను విద్యార్థులకు ఇచ్చినారు. విద్యార్థులంతా లేచి ఒక నిమిషము నిలుచున్నారు. ఆ అధికారులకు ఆశ్చర్యము కలిగినది.నిమిషము ప్రార్థన కాగానే ఎవరి సీట్లో వాళ్లు కూర్చుని చక్కగా ఆన్సర్స్ వ్రాసినారు. ఇతరచోట్ల ఎగ్జామినేషన్ హాల్స్ లో అల్లర్లు ఆ జరుగుటవలన అధికారులు భయపడుతున్నారు. కనుక, ఈ అశాంతిని పోగొట్టుటకు విద్యార్థులలో ఆధ్యాత్మిక దృష్టిని పెంపొందించాలి. దానికి క్రమశిక్షణతోపాటు ప్రార్థన చక్కని చేయూత నిచ్చును. కనుక, విద్యావిధానములో మార్పు వస్తేనే మానవుడు నిజమైన మానవుడై లోక కల్యాణమునకు తోడ్పడగలడు. పెద్ద చెట్లను వంచలేము కనుక, చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే వంచి సన్మార్గమునకు త్రి ప్పాలి. అందుకు మంచి అవకాశములను విద్యాసంస్థలు కల్పించాలి. ఏ విద్యాసంస్థలోనైనా విద్యార్థి యొక్క శీలమునే ముఖ్యముగా పరిగణించాలి. విద్య కన్న విజ్ఞానమునకెక్కువ ప్రాముఖ్యత చూపాలి. అప్పుడే నిజమైన విద్యార్థి తయారవుతాడు. విద్యార్థులను తీర్చిదిద్దవచ్చును. మానవత్వములోనికి మరలించవచ్చును. అట్టి విద్యార్థులు మానవ కల్యాణమునకు తోడ్పడెదరు.” (సనాతన సారథి, ఏప్రిల్ 2022 పు 18)