మానవుడు అది మంచిచేసేది ఒకే ప్రార్ధన. "అసతో మా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. మృత్యోర్మా అమృతంగమయ" - ఇదే జీవికి నిరంతర శాంతి మంత్రము. దీనికి అనేక దేశములలో, అనేక మతములలో అనేక అర్థములను చెప్పుదురు. కాని దీనికి నిజమైన అర్థము మానవుని ఆవేదన. "ఓ దేవా, బాహ్య ప్రపంచ సుఖములచే ప్రలోభ పెట్టబడిన సమయమున నన్ను శాశ్వత సుఖశాంతుల నొసగు సత్య మార్గమువైపు నడిపించు". ఇది మొదటి ప్రార్థన..
" ఓ ప్రభూ: ప్రాపంచిక విషయముల అంధకారముచే ఆవరింపబడినపుడు అతి ముఖ్యమైన ఆత్మ తత్వమును అర్థము చేసికొను జ్ఞానజ్యో తిని వెల్గిOచు" - ఇది రెండవ ప్రార్థన. " ఓ దేవా: నీ అనుగ్రహముతో లోక భ్రాంతులను చీకటి నుండి తప్పించుకొని, నిత్యమైన, సత్యమైన జ్ఞానజ్యోతిని వెలిగించుకొని, ఇహమును జయించి, పరమును పొంద గలుగునట్లు చెయ్యి" ఇది మూడవ ప్రార్థన.
(స. సా.పి.85 పు.వెనుక కవరు.)
(చూః శాంతి మంత్రము)