"అసతోమా సద్గమయ: తమసోమాజ్యోతిర్గమయ; మృత్యోర్మా అమృతంగమయ" ఇదే శాంతిమంత్రము. దీనిభావము అనేకులు అనేక విధములుగా పెద్దగానూ సూక్ష్మముగనూ చెప్పుదురు. కాని " ఓ భగవంతుడా! నేను ప్రపంచమందలి వస్తువుల విషయమై సౌఖ్య మనుభవించు కాలమందు, నన్ను అసత్తగు వస్తువునందు మరపు పుట్టించి శాశ్వతమైన ఆనందమునకు దారిచూపుము." ఇది మొదటి ప్రార్థన: ఇక రెండవదానికి "పరమాత్మా! ప్రపంచమందలి వస్తువు నన్ను ఆకర్షణ చేసినప్పుడు ఆత్మ వస్తువని ఎంచబడు దానియందుగల ఆత్మస్వరూపమును గుర్తించు శక్తి లేకుండుటచే నన్ను ఆవరించిన చీకటిని తొలగింపుము." ఇంక మూడవది. "ఆ వస్తువునందుగల ప్రకాశమానమైన ఆత్మస్వరూపముయొక్క ప్రకాశము చూడనిమ్ము: నేను కోరుచున్న ఆ శాశ్వతమైన సుఖము నీ యొక్క కటాక్షమువల్లఅమృతము. లేక పరమానందము అగుగాక" అని ప్రార్థనల యొక్క నిజ అర్థము.
(ప్ర.వా.పు.19)
(చూ॥ అసతోమా సద్గమయ)