అనాదికాలము నుండి అవతారముల యొక్క రహస్యమే ఇది. ఏదీ డైరక్షగా చెప్పటం లేదు. కొన్ని మాత్రమే డైరెక్కుగా చెప్పవచ్చును. కొన్ని ఇన్ డైరెక్టుగా చెప్పుతారు. మానవత్వమునందే దివ్యత్వమున్నది. కనుక ఆదివ్యత్వములను మేలుకొలిపి ఆదివ్యత్యము ద్వారానేగుర్తించ ప్రయత్నించాలి. అన్నీ డైరెక్ట్ గా చెప్పూ పోతుంటే, మానవుడు తనదివ్యత్వాని ఏమాత్రము అర్థము చేసుకోలేడు. తన దివ్యత్వాన్ని అర్థము చేసుకొనే స్వాతంత్ర యాన్నిఅతని అందించటానికి దైవము ఇన్ డైరెక్టుగా చెప్తుంటాడు.
(బృత్ర, పు.101)
శరీరము, యింద్రియములు, మనస్సు, బుద్ధి ఈ నాల్గింటి రహస్యమును చక్కగా గుర్తించినప్పుడే మానవుడు పరిపూర్ణుడౌతాడు. దీని రహస్యమును మనము గుర్తించుకోకుండా పోవటంచేతనే అనేక చిక్కులకు కురై పోతున్నాము, అనేకఅశాంతులు అనుభవిస్తున్నాము. ఏదో సాధన సాధన అని కాలమును వ్యర్ధము చేస్తున్నాము. ఎట్టి సాధనలు మనము చేయనక్కరలేదు సత్యమును గుర్తించుకుంటే అదే సాధన. (బృత్ర.పు. 25)