పవిత్రమైన భారతీయ సంస్కృతికి వేద శాస్త్రములే పురాణములు, సంగీత సాహిత్యములు వేదమునుండియేఆవిర్భవించినవి. సంగీతమునకు సామవేదము మాతృక, సాహిత్యమునకు ఋగ్వేదము మాతృక. భక్తి పూరితమైన సంగీతము భగవంతుని స్వరూపము గనుకనే నాహం విశామి వైకుంఠేన యోగి హృదయే రసవో మద్భక్తా, యత్రగాయంతి తత్ర తిష్టామి నారద అన్నాడు నారాయణుడు : వైకుంఠవాసిని కాను, యోగుల హృదయవాసిని కాను. ఎక్కడ నాభక్తులు నన్ను గురించి ప్రేమతో గానము చేస్తూ వుంటారో, ఆస్థానమే నా ప్రతిష్ఠస్థానమని నారదునితో చెప్పాడు. ముక్త వరులైన భక్త శిఖామణులు, కళాకారులు, భక్తి చేత తన్మయులై పదార్ధ భావంతోతదాత్మ్య భావన పొందినటువంటి వారు. ప్రహ్లాదుడు హరినామమును ఆనందముతోగానము చేశాడు. త్యాగరాజు "ఏ తావునరా నిలకడ నీకు" అని పాడాడు. అనగా సర్వత్రా వ్యాపించిన ప్రేమ స్వభావమును సర్వులకు అందిస్తున్నాడని భావముతో శ్రీరాముని కీర్తించాడు. సంగీతము గాని, కావ్యముగాని, రసములు అని చెప్పవచ్చు. "అలంకారో విష్ణు ప్రియః" అన్నారు. నవరసములున్నాయి. భోజరాజు శృంగార రసమును, భవభూతి కరుణా రసమును, అల్లసాని పెద్దన "రసోవైసః" - బ్రహ్మమే నిజమైన రసమని చెప్పాడు. రామకృష్ణుడు హాస్య. వీరసము. వాల్మీకి శోకరసము ప్రారంభించి, కరుణారసముతో ముగించాడు రామాయణము. ఈ బ్రతుకు సారమేమిటి? రసమేమిటి?ఆనందమే బ్రహ్మము. బ్రహ్మత్తత్వమే మన జీవితం.
(సా.పు. 540)
మానవ జీవిత వృక్షంలో ప్రేమ అనే ఫలము లభిస్తున్నది. అయితే ఈ ఫలములోని మధుర రసమును గ్రోలవలెనన్న దీనిని కప్పియున్న అహంకారమనే పైతోలును, అభిమాన మమకారములనే విత్తనములను తీసివేయాలి. భగవంతుడు రసస్వరూపుడు. దీనినే వేదాంతము "రసోవైస!" అన్నది. (పిల్లల పెంపకం రీటా బ్రూస్ పు 32)